Solar eclipse 2022: ఈ సూర్యగ్రహణం ఈ నాలుగు రాశులవారికి అనుకూలంగా ఉంటుంది..
Solar eclipse 2022: ఈ ఏడాదిలో తొలి సూర్య గ్రహణం ఏప్రిల్ 30 న ఏర్పడనుంది. అయితే ఇది మన దేశంలో కనిపించదు. కాగా ఈ సూర్యగ్రహణం ఎఫెక్ట్ వృషభం, సింహ, వృశ్చిక, కుంభరాశులపై ఎలా ప్రభావం చూపుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

Solar eclipse 2022: ఏప్రిల్ 30, 2022 న పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడనుంది. ఇదే ఈ సంవత్సరంలో వచ్చే మొదటి సూర్యగ్రహణం . ఆ తర్వాత మే 16 న మొదటి చంద్రగ్రహణం ఏర్పడనుంది.
హిందూ క్యాలెండర్ ప్రకారం.. సూర్య, చంద్రగ్రహణాలు ఒక సంవత్సరంలో వచ్చే ముఖ్యమైన వాటిలో ఒకటి. అయితే ఈ పాక్షిక సూర్యగ్రహణం మన దేశంలో కనిపించదు.
Image: Getty Images
హిందు పురాణాల ప్రకారం.. సూర్యగ్రహణం ప్రతి రాశీ చక్రాన్ని ప్రభావితం చేస్తుంది. అయితే ఈ సూర్యగ్రహణం ఈ నాలుగు రాశుల వారికి అనుకూలంగా ఉంటుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఏప్రిల్ 30 న మధ్యాహ్నం 12.15 గంటలకు సూర్యగ్రహణం ఏర్పడి మే 1న ఉదయం 4.07 గంటలకు ముగుస్తుంది. ఈ గ్రహహణాన్ని దక్షిణ/పశ్చిమ అమెరికా, పసిఫిక్ అట్లాంటిక్, అంటార్కిటికాలో నివసిస్తున్న ప్రజలు చూడవచ్చు. అయితే ఈ సమయంలో వృషభం, సింహ, వృశ్చిక, కుంభ రాశుల వారు ఏ విధంగా ప్రభావితమవుతారో ఇప్పుడు తెలుసుకుందాం.
వృషభం (ఏప్రిల్ 20-మే 20).. ఈ సూర్యగ్రహణం ఈ రాశివారికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఇన్ని రోజులు వీరు ఎదుర్కొన్న కష్టాలన్నీ తొలగిపోతాయి. అలాగే వీరు అనుకున్న లక్ష్యాలను చేరుకోవడానికి ఈ సూర్యగ్రహణం ఎంతో సహాయపడుతుంది. ఈ సూర్యగ్రహణం మీరు అనుకున్న పనులను చేయడానికి సహాయపడుతుంది. ఇది మీకు కాస్త కష్టంగానే అనిపించినా.. వెనకడుగు వేయకుండా ధైర్యంగా నిలబడితే మీరనుకున్న కల నెరవేరుతుంది.
సింహం (జూలై 23-ఆగస్టు 22).. సింహం రాశికి చెందిన వారు.. వారి వృత్తిలో ఒకడుగు ముందుకేస్తారు. వీరు కలలుగన్న లక్ష్యాన్ని చేరుకోవడానికి సిద్ధంగా ఉంటారు. ఈ కొత్త దశలో వీరిపై కొత్త కొత్త బాధ్యతలు మీద పడతాయి. అప్పుడే వీరి అంతర్గత సామర్థ్యం పెరుగుతుంది. సమయానుకూలంగా పనిచేసుకుంటూ పోతే సమాజంలో మీకు మంచి గౌరవం లభిస్తుంది.
వృశ్చికం (అక్టోబర్ 23-నవంబర్ 21).. ఈ సూర్యగ్రహణం వృశ్చిక రాశివారికి కొత్త బంధాలను కలుపుతుంది. ఈ రాశివారికి ఈ సూర్యగ్రహణంతో కొత్త స్నేహితులు పరిచయమవుతారు. మీ పని నలుగురికి ఆదర్శంగా నిలుస్తుంది. దీంతో మీరు నలుగురిలో ప్రశంసించబడతారు. మీతో ఎలాంటి వ్యక్తులు ఉండాలో ఎంచుకోవడానికి ఇదే సరైన సమయం.
కుంభం.. మిమ్మల్ని మీరు ఉన్నత స్థానంలో నిలబెట్టుకోవడానికి ఇదే సరైన సమయం. ఈ సమయంలోనే మీ అసలు శక్తి సామర్థ్యాలు బయటకొస్తాయి. ఇవి మిమ్మల్ని ఉన్నత వ్యక్తిగా ఎదగడానికి సహాయపడతాయి. అంతేకాదు ఈ సమయంలో మీకోసం కొత్త అవకాశాలు ఎదురుచూస్తాయి. ఇవి మిమ్మల్ని ఆనందంగా ఉంచుతాయి.