MalayalamNewsableKannadaTeluguTamilBanglaHindiMarathimynation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Astrology
  • Shani Transit: మార్గంలోకి శని.. ఈ 3 రాశుల వారికి డబ్బే డబ్బు..!

Shani Transit: మార్గంలోకి శని.. ఈ 3 రాశుల వారికి డబ్బే డబ్బు..!

జ్యోతిష్య శాస్త్రంలో శని గ్రహానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. శని దేవుడి గమనం, రాశిమార్పు.. 12 రాశి చక్రాలపై మంచి, చెడు ప్రభావాలను చూపిస్తుంది. ప్రస్తుతం శని మీన రాశిలో ఉన్నాడు. త్వరలో తిరోగమనం నుంచి మార్గంలోకి వస్తాడు. దీనివల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసివస్తుందట. మరి ఆ రాశులెంటో ఓసారి చూద్దామా..

Kavitha G | Published : May 06 2025, 05:18 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
14
Asianet Image

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని దేవుడు న్యాయం, కర్మ ఫలాలను ఇస్తాడు. శని తన రాశిని మార్చినప్పుడు లేదా తన గమనాన్ని మార్చినప్పుడు, 12 రాశులపై ప్రభావం పడుతుంది. అన్ని గ్రహాల్లో శని అత్యంత నెమ్మదిగా కదులుతుంది. కాబట్టి దాని ప్రభావాలు నెమ్మదిగా, దీర్ఘకాలికంగా ఉంటాయి. 

ఈ సంవత్సరం మార్చి 29న శని.. కుంభ రాశి నుంచి మీన రాశిలోకి ప్రవేశించాడు. 2027 వరకు శని మీన రాశిలో ఉంటాడు. ఆ తర్వాత మేష రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ సమయంలో శని గమనంలో కూడా మార్పు కనిపిస్తుంది. జూలైలో శని తిరోగమనంలోకి వెళ్తాడు, సంవత్సరాంతంలో మార్గంలోకి వస్తాడు. శని మార్గంలోకి రావడం వల్ల కొన్ని రాశుల వారికి మంచి రోజులు ప్రారంభమవుతాయి. ఎవరికి లాభం కలుగుతుందో ఇక్కడ తెలుసుకుందాం. 
 

24
మిథున రాశి

మిథున రాశి

మిథున రాశి వారికి శని మార్గం చాలా ప్రయోజనకరంగా, శుభప్రదంగా ఉంటుంది. ఇప్పటి నుంచి శని కర్మ స్థానంలో మార్గంలో ఉంటాడు. దీనివల్ల వృత్తి, వ్యాపారంలో మంచి పురోగతి సాధించే అవకాశం ఉంది. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉంది. వ్యాపారంలో మంచి లాభాలు, ఉద్యోగంలో విజయం, పదవి, ప్రతిష్టలు పెరుగుతాయి. ఆర్థిక విషయాల్లో గొప్ప విజయాన్ని సాధించవచ్చు. ఆర్థిక లాభానికి అవకాశాలు పెరుగుతాయి. ఈ సమయంలో సొంత వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగులకు కొత్త ఉద్యోగం, జీతం పెరుగుదల, పదోన్నతి లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 
 

Related Articles

Zodiac Signs: ఈ 6 రాశుల వారు చదువులో టాపర్లు..!
Zodiac Signs: ఈ 6 రాశుల వారు చదువులో టాపర్లు..!
Birth Date: ఈ తేదీల్లో పుట్టినవారు చాలా మంచి నటులు!
Birth Date: ఈ తేదీల్లో పుట్టినవారు చాలా మంచి నటులు!
34
వృషభ రాశి

వృషభ రాశి

వృషభ రాశి వారికి శని మార్గం శుభప్రదంగా ఉంటుంది. ఆదాయ స్థానంలో శని దేవుడు అనుకూలంగా ఉంటాడు. ఆదాయం బాగా పెరగవచ్చు. కొత్త ఆదాయ మార్గాలు పెరుగుతాయి. జీవితంలో సౌకర్యాలు, అభివృద్ధి పెరుగుతాయి. ప్రయాణాల్లో లాభసాటిగా ఉంటాయి. అదృష్టం వెంటే ఉంటుంది. నచ్చిన పని దొరుకుతుంది. మతపరమైన కార్యక్రమాల్లో ఆసక్తి చూపుతారు. ఊహించని విధంగా ఆర్థిక లాభం పొందే అవకాశం ఉంటుంది.

44
మీన రాశి

మీన రాశి

మీన రాశి వారికి శని మార్గంలోకి రావడం చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ శని నాల్గవ స్థానంలో ఉంటాడు. ఐశ్వర్యం, సౌకర్యాలు పెరుగుతాయి. భూమి, ఆస్తులను నుభవించవచ్చు. అన్ని కోరికలు నెరవేరుతాయి. కీర్తి, పదోన్నతికి అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక పరిస్థితి గతంకంటే మెరుగుపడుతుంది.
 

Kavitha G
About the Author
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. Read More...
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్
 
Recommended Stories
Top Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Andriod_icon
  • IOS_icon
  • About Us
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved