MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Shani Transit: నక్షత్రం మార్చుకుంటున్న శని, ఈ మూడు రాశులకు గుడ్ టైమ్ మొదలైనట్లే

Shani Transit: నక్షత్రం మార్చుకుంటున్న శని, ఈ మూడు రాశులకు గుడ్ టైమ్ మొదలైనట్లే

శని దేవుడు తన నక్షత్రం మార్చుకోవడం వల్ల కొన్ని రాశుల జీవితాల్లో సరికొత్త శుభవార్తలు అడుగుపెట్టనున్నాయి. కొంత మందికి శుభ ఫలితాలు, సిరి సంపదలు వరించగా, మరి కొన్ని రాశులకు మాత్రం సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. అయితే.. శని దేవుడి నక్షత్ర మార్పు అదృష్టాన్ని తీసుకువచ్చే మూడు రాశులేంటో చూద్దాం..

ramya Sridhar | Published : Apr 08 2025, 11:48 AM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
14
shani nakshatra change april wealth luck for these 3 zodiac signs

shani nakshatra change april wealth luck for these 3 zodiac signs


గ్రహాలు తరచూ ఒక రాశి నుంచి మరో రాశిలోకి మారుతూ ఉంటాయి. ఇప్పటికే శని గ్రహం కుంభ రాశిని వీడి మీన రాశిలోకి అడుగుపెట్టింది. ఇప్పుడు శని గ్రహం నక్షత్రాన్ని కూడా మార్చుకుంటోంది.ఏప్రిల్ 28వ తేదీన శని.. ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి అడుగుపెడుతున్నాడు. శని ఆధిపత్యం ఉన్న నక్షత్రం ఇది. ఈ నక్షత్ర మార్పు మూడు రాశులకు అదృష్టం తీసుకురానుంది. ముఖ్యంగా ఆర్థికంగా, వ్యక్తిగత జీవితంలో శుభవార్తలు అందుకోనున్నారు. మరి, ఆ అదృష్ట రాశులేంటో చూద్దామా...
 

24
telugu astrology

telugu astrology


1.మకర రాశి..

 శని నక్షత్రం మార్చుకోవడం మకర రాశి వారికి చాలా మేలు చేస్తుంది. ఈ నక్షత్రం మారిన దగ్గర నుంచి మకర రాశి వారు విజయాలు అందుకోవడం మొదలుపెడతారు. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టినా మంచి ఫలితాలు లభిస్తాయి. గతంలో పడిన కష్టానికి.. ఇప్పుడు ప్రతిఫలం దక్కుతుంది. లవ్ లైఫ్, మ్యారేజ్ లైఫ్ సంతోషంగా మారుతుంది. పిల్లల నుంచి కూడా ఈ రాశివారు శుభవార్తలు అందుకుంటారు.
 

34
telugu astrology

telugu astrology

2.మిథున రాశి..

మిథున రాశి దశ మారిపోతుంది. ఇప్పటి వరకు పడిన కష్టాల నుంచి విముక్తి లభిస్తుంది.మానసిక సమస్యలు తగ్గుతాయి. ప్రశాంతత లభిస్తుంది. ఆర్థికంగా కూడా లాభాలు చూస్తారు. ఎప్పటి నుంచో వాయిదా పడుతున్న పనులు ఇప్పుడు పూర్తౌతాయి.  కష్టాల నుంచి ఉపశమనం లభిస్తుంది. సంపద పెరుగుతుంది. పని పట్ల అంకిత భావం పెరుగుతుంది. మిథున రాశివారికి అదృష్ట తలుపులు తెరుచుకుంటాయి. ఇక నుంచి దశ దిశ మారుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో ఆర్థికంగా చక్కటి పురోగతి ఉంటుంది. ఇంట్లో శుభకార్యాల వాతావరణం, మానసికంగా హాయిగా గడిచే సమయం మొదలవుతుంది.
 

44
telugu astrology

telugu astrology

3.కుంభ రాశి..
కుంభ రాశి వారికి  ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది. అప్పులు తీరిపోతాయి. ఆరోగ్య సమస్యలు తగ్గిపోయి.. సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది. వ్యాపారం చేసే వారికి ఆ వ్యాపారంలో లాభాలు రావడం మొదలౌతాయి. కావాలి అనుకునే వస్తువులను కొనుక్కుంటారు. కుటుంబంతో పాటు ఆధ్యాత్మిక ప్రయాణాలు కూడా చేస్తారు. పెట్టుబడుల నుంచి మంచి లాభాలు వస్తాయి. శని దేవుడి నక్షత్ర మార్పు కుంభ రాశివారి అదృష్టాన్ని రెట్టింపు చేస్తుంది. గతంలో ఉన్న ప్రేమ సమస్యలు పరిష్కార మార్గం చూసుకుంటాయి. బంధాలలో మళ్లీ ఆనందం వెల్లివిరుస్తుంది. అలాగే, డబ్బు అభివృద్ధి, కొత్త ఆదాయ మార్గాలు, పనుల్లో చక్కటి ఫలితాలు రావొచ్చని సూచనలున్నాయి.


ఈ శని నక్షత్ర మార్పు వల్ల మీ రాశి మీద ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటే మీ వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించుకోవడం మంచిది. జ్యోతిష్యపరంగా ఇది మంచి శుభ సమయంగా పరిగణిస్తారు. మీరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి!

ramya Sridhar
About the Author
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు. Read More...
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఏషియానెట్ న్యూస్
ఆధ్యాత్మిక విషయాలు
 
Recommended Stories
Top Stories