సెప్టెంబర్ నెల ఏ రాశివారికి ఎలాంటి ఫలితాలు ఇవ్వనుందో తెలుసా?
సెప్టెంబర్ నెలకు సంబంధించిన ఈ రాశి ఫలాలను పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల మాస ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

మాస ఫలాలు
ఈ మాస ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. ఈ నెల ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
మేష రాశి ఫలాలు
మేష రాశివారికి సెప్టెంబర్ నెలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వ్యాపారంలో లాభాలు పొందుతారు. ఉద్యోగులకు సానుకూల ఫలితాలు ఉంటాయి. మీరు చేయాల్సిన పనిని పొరపాటున కూడా ఇతరులకు అప్పగించవద్దు. కోర్టు సంబంధిత విషయాలు అనుకూలంగా సాగుతాయి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి.
వృషభ రాశి ఫలాలు
సెప్టెంబర్ నెల వృషభ రాశి వారికి అంతగా కలిసిరాకపోవచ్చు. ఆరోగ్యం, సంబంధాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారంలో గట్టి పోటీ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది. అనవసరమైన ఖర్చులు చేస్తారు. ఉద్యోగులు అనుకున్న పనులు సకాలంలో పూర్తిచేస్తారు. ప్రేమ బంధం బలపడుతుంది.
మిథున రాశి ఫలాలు
మిథున రాశివారు సెప్టెంబర్ నెలలో సవాళ్లు ఎదురుకోవాల్సి వస్తుంది. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. కుటుంబంతో కలిసి టూర్లకు వెళ్తారు. వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తికావు. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. స్నేహితుల మద్దతు లభిస్తుంది. జీవిత భాగస్వామితో కొన్ని సమస్యలు రావచ్చు.
కర్కాటక రాశి ఫలాలు
కర్కాటక రాశి వారు కూడా సెప్టెంబర్ నెలలో కొన్ని సవాళ్లు ఎదురుకోవాల్సి ఉంటుంది. ఇంటా బయట ఒత్తిడి పెరుగుతుంది. ఆప్తుల సహకారం దక్కదు. నెల ప్రారంభంలో కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ తెలివితో పరిష్కరిస్తారు. వ్యాపారాలు సాధారణంగా సాగుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుంది.
సింహ రాశి ఫలాలు
సెప్టెంబర్ నెలలో సింహ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగం మారాలనుకునేవారు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. వ్యాపారంలో ఒడిదుడుకులు ఉంటాయి. ఇతరులతో గొడవలకు దూరంగా ఉండటం మంచిది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.
కన్య రాశి ఫలాలు
సెప్టెంబర్ నెలలో కన్య రాశి వారు జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. వ్యాపారానికి సంబంధించిన నిర్ణయాలు ఆలోచించి తీసుకోవాలి. ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ అవసరం. ప్రేమ వ్యవహారం కొంత ఆందోళనకరంగా ఉంటుంది. వైవాహిక జీవితంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఇంటా బయట పరిస్థితులు అంతగా అనుకూలించవు.
తుల రాశి ఫలాలు
సెప్టెంబర్ నెల తుల రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. అనుకున్న టైంకి పనులు పూర్తిచేస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు కూడా పూర్తవుతాయి. కోర్టు కేసులు అనుకూలంగా సాగుతాయి. వ్యాపారాలు లాభాల బాట పడుతాయి. ఇల్లు, భూమి లేదా కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగుంటుంది.
వృశ్చిక రాశి ఫలాలు
సెప్టెంబర్ నెల వృశ్చిక రాశి వారికి శుభప్రదం. ఎప్పటినుంచో పెండింగ్‌లో ఉన్న పని పూర్తవుతుంది. కొన్ని పనుల్లో విజయం సాధిస్తారు. వ్యాపారాలు కలిసివస్తాయి. కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. విద్యార్థులకు ఈ సమయం అనుకూలం. ఆదాయం పెరుగుతుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది.
ధనుస్సు రాశి ఫలాలు
సెప్టెంబర్ నెల ధనుస్సు రాశి వారికి మిశ్రమ ఫలితాలనిస్తుంది. ఉద్యోగులకు అధికారుల నుంచి ప్రశంసలు దక్కుతాయి. భాగస్వామ్య వ్యాపారాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. సొంత వ్యాపారాలు లాభదాయకం. అన్ని రంగాలవారికి విజయం దక్కుతుంది. జీవిత భాగస్వామితో కలిసి దైవ దర్శనం చేసుకుంటారు. ఇంటా బయటా సానుకూల వాతావరణం ఉంటుంది.
మకర రాశి ఫలాలు
సెప్టెంబర్ నెలలో మకర రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొన్ని సమస్యల కారణంగా మానసిక బాధలు తప్పవు. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. ప్రాణ స్నేహితుడి సహాయంతో కొన్ని సవాళ్లను అధిగమిస్తారు. ఆర్థికంగా కొన్ని ఒడిదుడుకులు ఎదురవుతాయి. దూరప్రయాణ సూచనలు ఉన్నాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. పెట్టుబడి పెట్టే ముందు బాగా ఆలోచించాలి.
కుంభ రాశి ఫలాలు
కుంభ రాశి వారికి సెప్టెంబర్ నెలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యం, సంబంధాల విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులకు పనిభారం పెరిగే అవకాశం ఉంది. కానీ నెలాఖరులో పదోన్నతి దక్కవచ్చు. వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టేముందు జాగ్రత్తగా ఆలోచించాలి. కొన్ని పనుల్లో విజయం దక్కుతుంది. విద్యార్థులు శుభవార్తలు వింటారు.
మీన రాశి ఫలాలు
సెప్టెంబర్ నెలలో మీన రాశి వారికి కొన్ని ఒడిదుడుకులు ఎదురవుతాయి. వ్యాపారంలో సమస్యలు వస్తాయి. ఉద్యోగులకు తోటివారి సహకారం లభిస్తుంది. స్థిరాస్తి వివాదాలు తలెత్తవచ్చు. నిరుద్యోగులు కష్టపడాల్సి ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. జీవిత భాగస్వామి కోసం కొంత సమయం కేటాయించాల్సి ఉంటుంది.