Today Horoscope: వృశ్చికరాశి వారికి ఈ రోజు ఈ ఇబ్బందులు తప్పవు
Today Horoscope: వృశ్చికరాశి వారి శుక్రవారం రాశిఫలాలు ఇవి. మరి , ఈ రోజు వృశ్చికరాశి వారికి ఆర్థికంగా, ఉద్యోగ-వ్యాపారాల్లో, ఆరోగ్య పరంగా ఎలా ఉంటుందో చూద్దాం..

వృశ్చికరాశి ఫలాలు
నేడు వృశ్చికరాశి వారి జాతకం ఎలా ఉండనుంది? ఈ రాశివారికి కలిగే లాభాలు, నష్టాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్న వివరాలు ఇలా ఉన్నాయి. ఓసారి తెలుసుకుందామా...
ఆర్థిక పరిస్థితి
వృశ్చిక రాశి వారికి ఈ రోజు ఆర్థిక పరిస్థితి అంతగా బాగుండదు. వీరు ఈ రోజు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అనుకోని ఖర్చులను చేయాల్సి వస్తుంది. మీ అవసరాలకు డబ్బు సరిపోకపోవచ్చు. అప్పులు చేయాల్సి వస్తుంది. పెట్టుబడుల విషయంలో జాగ్రత్త అవసరం. ఖర్చులను నియంత్రిస్తే సమస్యలు రాకుండా ఉంటాయి. అవసరం లేని వ్యాయాలను తగ్గిస్తే ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
ఉద్యోగం, వ్యాపారం
ఉద్యోగం, వ్యాపారంలో శ్రమ తప్పదు. ఉద్యోగులకు ఈ రోజు అదనపు పనిభారం ఉంటుంది. మీ శ్రమకు తగిన గుర్తింపు రాదు. కానీ ప్రయత్ని గుర్తింపు ఖచ్చితంగా వస్తుంది. వ్యాపారులు ఒప్పందం, డబ్బుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండలి. నిరుద్యోగులకు ఈ రోజు కూడా నిరాశే మిగులుతుంది. పట్టువదలకుండా ప్రయత్నిస్తే కొత్త అవకాశాలను అందుకుంటారు.
ఆరోగ్యం
వృశ్చిక రాశి వారు ఈ రోజు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే అవకాశం ఉంది. శారీరక బలహీనత, అలసట, ఒత్తిడి వంటి సమస్యలను ఎదుర్కొంటారు. ధ్యానం, యోగా, విశ్రాంతితో ఈ సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.