- Home
- Astrology
- Venus Transit: కన్య రాశిలోకి శుక్రుడు...దీపావళికి ముందే ఈ మూడు రాశులకు లక్ష్మీ కటాక్షం..!
Venus Transit: కన్య రాశిలోకి శుక్రుడు...దీపావళికి ముందే ఈ మూడు రాశులకు లక్ష్మీ కటాక్షం..!
Venus Transit: శుక్రుడు అక్టోబర్ 9 వ తేదీన తన మార్గాన్ని మార్చుకోనున్నాడు. బుధ గ్రహం పాలించే కన్య రాశిలోకి శుక్రుడు అడుగుపెట్టనున్నాడు. దీని వల్ల మూడు రాశులకు చాలా ప్రయోజనాలు కలగనున్నాయి. ఆ మూడు రాశులకు ఊహించని డబ్బు చేతికి అందనుంది.

Venus Transit
జోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రుడు.. సంపద, ఆనందానికి మూల కారణంగా పరిగణిస్తారు. అందుకే.. శుక్ర గ్రహం అనుగ్రహం ఉన్నవారిని ఆనందానికీ, డబ్బుకు లోటు ఉండదు. అయితే.. ఈ శుక్రగ్రహం దీపావళికి ముందు... మూడు రాశులకు మహర్దశను మోసుకు రానుంది. శుక్రుడు అక్టోబర్ 9 వ తేదీన తన మార్గాన్ని మార్చుకోనున్నాడు. బుధ గ్రహం పాలించే కన్య రాశిలోకి శుక్రుడు అడుగుపెట్టనున్నాడు. మరి... గమనం... ఎవరికి ప్రయోజనాలు కలిగించనుందో ఇప్పుడు చూద్దాం....
కన్య రాశి..
శుక్రుడు కన్య రాశిలోకి అడుగుపెడుతున్నాడు.. కాబట్టి.. ఈ రాశివారికి ఊహించని విధంగా ప్రయోజనాలు కలగనున్నాయి. లగ్న రాశిలో శుక్రుడు సంచారం చేయడంతో.. ఈ రాశివారి అదృష్టం పెరుగుతుంది. అకస్మాత్తుగా చేతికి డబ్బు అందుతుంది. ఏ పనిలో అయినా చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఉద్యోగంలో మంచి స్థాయికి వెళతారు. కుటుంబంలో సంతోషం నెలకుంటుంది.
2.మిథున రాశి...
శుక్రుడు కన్య రాశిలోకి ప్రవేశించినప్పుడు.. మిథున రాశివారికి చాలా ప్రయోజనాలు కలగనున్నాయి. దీని కారణంగా, మిథున రాశి వారికి గోల్డెన్ టైమ్ మొదలౌతుంది. మీరు చేపట్టిన అన్ని పనులు విజయవంతమవుతాయి. చాలా విషయాలు మీకు అనుకూలంగా వస్తాయి. చాలా కాలంగా నెరవేరని కలలు నెరవేరుతాయి. వృధా ఖర్చులు తగ్గుతాయి. పనికిరాని ఖర్చులు తగ్గుతాయి. శుభకార్యాల కోసం ఖర్చులు చేస్తారు.
వృషభ రాశి...
శుక్రుడు కన్య రాశిలోకి అడుగుపెట్టడం వృషభ రాశి వారికి చాలా మేలు జరగనుంది. మీరు ఏదైనా పనిని జాగ్రత్తగా చేస్తే, మీరు సరైన విజయాన్ని సాధించగలరు. ప్రేమ , వైవాహిక జీవితానికి సంబంధించి.. శుభవార్తలు వింటారు. మీరు మీ భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు. పిల్లల ద్వారా మీకు సంతోషకరమైన వార్తలు వినే అవకాశం ఉంది. మీరు కష్టపడి పనిచేస్తే, మీరు సులభంగా విజయం సాధించగలరు. ఈ కాలం విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఆన్‌లైన్ లావాదేవీలు , డబ్బు సంబంధిత విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి.