Zodiac signs: ఈ రాశులకు శని పీడ వదిలినట్లే, ఇక పట్టిందల్లా బంగారమే..!
ఇంతకాలం శని గ్రహం కారణంగా అనేక ఇబ్బందులు పడిన కొన్ని రాశులకు వారికి ఎట్టకేలకు విముక్తి లభించనుంది. ఈ నెలాఖరుకు శని అస్తమించనున్నాడు. దీని కారణంగా నాలుగు రాశులకు అదృష్టం దరిద్రం పట్టినట్లు పట్టనుంది. మరి, అదృష్ట రాశులేంటో చూద్దామా...

హిందూ జోతిష్యశాస్త్రంలో శనిదేవుడికి చాలా ప్రాధాన్యత ఉంది. ఆయన దృష్టి చాలా మంచిది. అలా అని కోపం చూపిస్తే మాత్రం పర్యావసానాలు భయంకరంగా ఉంటాయి. న్యాయ దేవుడిగా, ప్రతి ఒక్కరికీ వారి కర్మలకు అనుగుణంగా ఆయన ఫలితాలను అందిస్తూ ఉంటాడు. అయితే.. శని దేవుడి ప్రత్యేక కృప కారణంగా కొన్ని రాశులకు మంచి జరిగితే, కొన్ని రాశులకు ఇబ్బందులు ఎదురౌతూ ఉంటాయి.
ఫిబ్రవరి నెలాఖరు అంటే 28వ తేదీన శని అస్తమిస్తాడు. మార్చి నెల మొత్తం ఆయన అస్తమించే ఉంటాడు. దాని వల్ల మార్చి నెలలో 12 రాశులపై చాలా ఎక్కువ ప్రభావం చూపించనుంది. మరి, ఈ శని అస్తమయం ఏ రాశులవారికి శుభం కలిగిస్తుందో, ఏ రాశులవారికి నష్టం తెస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..
ధనస్సు రాశి..
శని సంచారం ధనుస్సు రాశి వారికి పెద్ద ధనలాభాలను తెస్తుంది. ఈ రాశి వారి బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. సమాజంలో మీ గౌరవం కూడా పెరుగుతుంది. జీవితంలో ఐశ్వర్యం, సౌకర్యాలు పెరుగుతాయి. వివాహితుల జీవితంలో ఆనందం వస్తుంది. రెండో వివాహం కోసం ఎదురు చూస్తున్న ధనుస్సు రాశి వారికి మంచి సంబంధాలు వస్తాయి. ఈ సమయంలో ధనుస్సు రాశి వారి కోరికలన్నీ నెరవేరుతాయి. అప్పులు తీర్చడానికి మంచి సమయం.
కర్కాటక రాశి..
శని సంచారం, అస్తమయం కర్కాటక రాశిపై మంచి ప్రభావం చూపుతాయి. మీ జీవితంలో కొత్త అవకాశాలు వస్తాయి. పదోన్నతి కోసం ఎదురు చూస్తున్నవారికి ఇప్పుడు శుభవార్త. ఆర్థిక పరిస్థితి కూడా బాగుంటుంది. విదేశ ప్రయాణానికి అవకాశం. జీవితంలో ప్రశాంతత, ఆనందం ఉంటుంది. భార్యాభర్తల మధ్య అనుబంధం పెరుగుతుంది.
మకర రాశి..
శని దేవుడు మకర రాశి వారికి శుభ ఫలితాలనిస్తాడు. కొత్త మార్గాల ద్వారా డబ్బు వచ్చే అవకాశం ఉంది. అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది. స్నేహితులతో సమయం గడపగలుగుతారు. పాత సమస్యల నుండి విముక్తి. ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించండి. లేదంటే వైద్య ఖర్చులు రావచ్చు.
వృషభ రాశి..
శని మారుతున్న వేగం వల్ల వృషభ రాశి వారు చాలా ప్రయోజనం పొందుతారు. అకస్మాత్తుగా డబ్బు వస్తుంది. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి కనిపిస్తుంది. దీర్ఘకాలిక వ్యాధులు నయమవుతాయి. అప్పుల నుండి విముక్తి పొందవచ్చు. కుటుంబంలో సానుకూల వాతావరణం ఉంటుంది. పనిలో విజయం లభిస్తుంది. మీ ఖర్చులను నియంత్రించుకోండి.