Zodiac signs: 30 సంవత్సరాల తర్వాత శని తిరోగమనం..ఈ రాశుల కష్టాల తీరినట్లే..!
శని గ్రహం రాశి మార్పు రెండున్నర సంవత్సరాలకు ఒకసారే జరుగుతుంది. కానీ, ఈ మార్పు కొన్ని రాశులకు దారుణమైన కష్టాలు తీసుకువస్తే, కొన్ని రాశులకు మాత్రం విపరీతమైన లాభాలు, సంతోషాన్ని మోసుకొస్తుంది. ఇప్పుడు శని మీనరాశిలో తిరోగమనం చేయనున్నాడు. ఈ తిరోగమనం మూడు రాశుల వారి జీవితాన్ని మార్చేయనుంది.

శని గ్రహం తిరోగమన దశ మొదలుకానుంది. అన్ని గ్రహాల్లో కెల్లా శని చాలా నెమ్మదిగా కదులుతుంది. ఏదైనా రాశిలోకి అడుగుపెట్టింది అంటే కనీసం రెండున్నర సంవత్సరాలు అదే రాశిలో ఉంటుంది.రీసెంట్ గానే కుంభ రాశిని వదిలేసి మీన రాశిలోకి అడుగుపెట్టింది. దాదాపు 30 ఏళ్ల తర్వాత ఈ రాశిలోకి అడుగుపెట్టింది. అయితే, ఈ రాశిలో శని తిరోగమనం మాత్రం జులై 13 వ తేదీన జరగనుంది. మళ్లీ 2027 వరకు ఇదే రాశిలో శని తిరోగమనం కంటిన్యూ అవుతుంది. కాగా, జోతిష్య శాస్త్రంలో శని గ్రహాన్ని కర్మఫలదాతగా భావిస్తారు. ఇది క్రమశిక్షణ, న్యాయం, బాధ్యతలతో ముడిపడి ఉంటుంది. మరి, ఈ తిరోగమనం మూడు రాశులకు మాత్రం చాలా మేలు చేయనుందట. మరి, ఆ రాశులేంటో చూద్దామా..
1.కన్య రాశి..
మీన రాశిలో శని తిరోగమనం కన్య రాశి వారికి చాలా ఎక్కువ ప్రయోజనాలు మోసుకురానుంది. ఏడో ఇంట్లో శని తిరోగమనం జరగడం వల్ల ఈ రాశివారికి ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. వ్యాపారాల్లో లాభాలు కూడా బాగా వస్తాయి. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ప్రేమ జీవితం ఆనందంగా సాగుతుంది. పెళ్లి కానివారికి పెళ్లి అయ్యే అవకాశాలు ఉన్నాయి. స్థిరాస్తి, వాహనాల కొనుగోలు వంటివి జరిగే అవకాశం ఉంది.
2.మకర రాశి..
మకర రాశి వారు కూడా ఈ సమయంలో అదృష్టాన్ని అనుభవిస్తారు. శని మూడవ ఇంటిలో తిరోగమనంలో ఉండటం వల్ల ధైర్యం, కమ్యూనికేషన్ నైపుణ్యం పెరుగుతుంది. సోదరులు, స్నేహితుల సహకారం లభిస్తుంది. కెరీర్ అవకాశాలు మెరుగవుతాయి. సంబంధాలలో స్థిరత్వం పెరుగుతుంది. కుటుంబంలో ఆనందం పెరుగుతుంది.
3.మీన రాశి..
మీన రాశి వారికి శని స్వరాశిలో తిరుగుతున్నందున ప్రభావం బలంగా ఉంటుంది. ఆరోగ్యం మెరుగవుతుంది. విదేశీ ఉద్యోగాలు, వ్యాపారాల్లో మంచి అవకాశం ఉంటుంది. జీవిత భాగస్వామితో అనుబంధం బలపడుతుంది. కెరీర్ పురోగతికి ఇది మంచి సమయం. ఓర్పు, శ్రద్ధతో ముందడుగు వేస్తే విజయాలు ఖాయంగా ఉంటాయి.