ఈ రాశులవారు అంత చురుకుగా ఆలోచించలేరు..!
ఈ కింద రాశులవారు కూడా అంతే.. పెద్దగా చురుకుగా ఆలోచించలేరు. అంత తెలివితేటలు వీరికి ఉండవనే చెప్పాలి. మరి ఆ రాశులేంటో ఓసారి చూద్దాం...

Daily Horoscope
ప్రతి ఒక్కరూ ప్రతి విషయంలోనూ శ్రద్దగా ఉండలేరు. ముఖ్యంగా చాలా విషయంలో స్మార్ట్ గా ఆలోచించలేరు. పరిపక్వత లేకుండా ఆలోచిస్తూ.. పనులు చేస్తూ ఉంటారు. ఈ కింద రాశులవారు కూడా అంతే.. పెద్దగా చురుకుగా ఆలోచించలేరు. అంత తెలివితేటలు వీరికి ఉండవనే చెప్పాలి. మరి ఆ రాశులేంటో ఓసారి చూద్దాం...
మేష రాశి..
ఈ రాశివారు తమకు ఏది కావాలో నిర్ణయించుకోగలరు. కానీ.. దానిని సాధించుకోవడానికి మాత్రం ఇతరులపై ఆధారపడుతుంటారు. వీరికి కోపం కూడా చాలా ఎక్కువ. ఆ కోపం, ఉద్రేకం వారిని సమస్యల్లోకి నెట్టేస్తూ ఉంటుంది. ఈ రాశికి చెందిన వారు చాలా నాటకీయంగా ఉంటారు. ఆ సమయంలో చిన్న పిల్లల్లా ప్రవర్తిస్తారు. అందరూ తమనే పొగడాలని అనుకుంటూ ఉంటారు. దాని కోసం తాపత్రయ పడుతూ ఉంటారు. మెచ్యూరిటీ వీరికి చాలా తక్కువ అనే చెప్పొచ్చు. వయసు కి తగినట్లుగా ప్రవర్తించరు.
ధనస్సు రాశి..
ఈ రాశివారిలోనూ మెచ్యూరిటీ కాస్త తక్కువగా ఉంటుందనే చెప్పాలి. ఏదీ సరిగా ఆలోచించలేరు. పరిపక్వత తక్కువ. చాలా క్రూరంగా ఆలోచిస్తారు. ఇతరులపై ఎక్కువగా అసత్య ఆరోపణలు చేస్తూ ఉంటారు. వారు చేస్తున్నది.. తప్పో, ఒప్పో.. ఎవరో ఒకరు వారికి చెప్పాల్సి ఉంటుంది.
కర్కాటక రాశి..
ఈ రాశివారిలోనూ మెచ్యూరిటీ తక్కువగా ఉంటుంది. అందరి గురించి మంచిగా ఆలోచించలేరు. ఎదుటివారికి హాని కలిగించాలని అనుకుంటారు. వీరి ప్రవర్తన ఎవరికీ పెద్దగా నచ్చదు. అందరి ముందు అపఖ్యాతి తెచ్చుకుంటారు. వీరి బుర్ర ఎక్కువగా చెడు గురించి మాత్రమే ఆలోచిస్తారు. ఉన్నదానిని మార్చి.. ఎదుటివారిని ఇబ్బంది పెడుతూ ఉంటారు. తమ గురించి మాత్రమే ఎక్కువగా ఆలోచించుకుంటారు.
మిథున రాశి...
ఈ రాశివారికి రెండు రకాల స్వభావాలు ఉంటాయి. ఒకసారి తెలివిగా ఉన్నట్లే అనిపిస్తారు.. కానీ ఒక్కోసారి మాత్రం చిన్న పిల్లలాగా ప్రవర్తిస్తారు. మరోసారి చాలా మూర్ఖంగా ప్రవర్తిస్తారు. వీరు తెలివైనా వారా కాదా అనే అనుమానం కలుగుతూ ఉంటుంది. అందుకే.. వీరికి మెచ్యూరిటీ లెవల్స్ చాలా తక్కువగా ఉంటాయి.
సింహ రాశి..
వారు రియాలిటీ షోలను ఇష్టపడతారు. వారి జీవితాన్ని కూడా ఏదో షోలో పాల్గొన్నట్లుగా ప్రవర్తిస్తారు. అందరూ తమపై ప్రేమ కురిపించాలని అనుకుంటూ ఉంటారు. అలా చూపించకపోతే.. చిన్న పిల్లల్లాగా.. మెచ్యూరిటీ లేని వారిలా ప్రవర్తిస్తారు. ఏ వయసు వచ్చినా ప్యాంపర్ చేయాలని కోరుకుంటూ ఉంటారు.
వృషభ రాశి..
మీరు వృషభరాశితో జాగ్రత్తగా ఉండాలి. వీరి ప్రవర్తనను ఎవరూ తట్టుకోలేరు. వారికి దూరంగా ఉండటం కుదరకపోతే.. ఓపికగా , ప్రశాంతంగా ఉండాలి. కారణం ఏమిటంటే, వారు ఒకసారి తీసుకున్న నిర్ణయాన్ని వారు మార్చుకోరు. వారు పసిపాపలా మొండిగా ఉంటారు. మెచ్యూరిటీ లేకుండా ప్రవర్తిస్తారు.
మీనం, కుంభం, మకరం, వృశ్చికం. తుల, కన్యలు రాశులు మాత్రం చాలా తెలివిగా ఉంటారు. ప్రతి విషయంలోనూ చాలా మెచ్యూర్డ్ గా బిహేవ్ చేస్తారు.