Rahu Transit: రాహువు దుష్టగ్రహమే కానీ ఈ మూడు రాశులకు మాత్రం కలిసి వస్తుంది
చెడు గ్రహాలలో ఒకటిగా రాహువును చెప్పుకుంటారు. రాహువు వల్ల కొన్ని సమయాల్లో లాభాలు వస్తాయి. ముఖ్యమైన గ్రహంగా చెప్పుకునే రాహువు పదేళ్ల తర్వాత సొంత నక్షత్రంలోకి ప్రవేశించబోతున్నాడు. మూడు రాశుల వారికి కలిసి వచ్చేలా చేస్తుంది.

సొంత నక్షత్రంలోకి రాహువు
రాహువు ఒక శక్తివంతమైన గ్రహంగా చెప్పుకుంటారు. జీవితంలో జరిగే ఊహించని సంఘటనలకు అతనే కారణంగా అంటారు. రాహువు సంచారం ప్రతి రాశిచక్రంపై అనేక ప్రభావాలను చూపుతుంది. నవంబర్‌లో రాహువు శతభిష నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. రాహువు శతభిష నక్షత్రానికి అధిపతి. అందువల్ల అతను తన సొంత నక్షత్రంలోకి ప్రవేశించడాన్ని జ్యోతిష్యంలో ఒక ముఖ్యమైన సంఘటనగా పరిగణిస్తారు.
మిథున రాశి
రాహువు సంచారం వల్ల మిథున రాశి ఎంతో మేలు జరుగుతుంది. వారికి ఆధ్యాత్మిక, వ్యక్తిగత అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది. ప్రయాణం, విద్య, కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి ఇది అనుకూలమైన సమయం. కుటుంబంలోని సమస్యలు పరిష్కారం అవుతాయి. సంబంధాలలో మెరుగుదల, సమాజంలో గౌరవం పెరుగుతుంది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. ఉద్యోగంలో మీకు ఎక్కువ బాధ్యతలు వస్తాయి.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి రాహువు ఎన్నో ప్రయోజనాలు కలిగించబోతోంది. ఏ రంగంలో పనిచేసిన వారికైనా మంచి విజయం సాధిస్తారు. దీనివల్ల వారికి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. మీ వృత్తి, సామాజిక జీవితంలో మీరు కొత్త విజయాలను సాధిస్తారు. మీ కార్యాలయంలో మీ కృషికి తగిన ఫలితం దక్కుతుంది. మీరు కష్టతరమైన పనిని పూర్తి చేస్తారు. దీనివల్ల చాలా మంది మిమ్మల్ని ప్రశంసిస్తారు. మీకు ప్రమోషన్, జీతం పెరుగుదల లభించవచ్చు.
కుంభ రాశి
రాహువు తన సొంత నక్షత్రంలోకి ప్రవేశించడం వల్ల కుంభ రాశి వారు ఎన్నో లాభాలు పొందుతారు. నవంబర్ తర్వాత ముఖ్యమైన మార్పులను ఎదుర్కోవలసి ఉంటుంది. కుటుంబ సంబంధాలలో గొడవలు తగ్గి, అనుబంధాలు ఏర్పడుతాయి. విడిపోయిన భార్యాభర్తలు మళ్ళీ కలుసుకోవచ్చు. కొత్త విధంగా డబ్బు ఆదా చేసే మార్గాలు తెరుచుకుంటాయి. గతంలో ఉన్న అప్పుల సమస్యలు పరిష్కారం అవుతాయి, మనశ్శాంతి లభిస్తుంది. కొత్త ఇల్లు, ఆస్తి, ప్లాట్, భూమి కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంది.