Birth Date: ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలకు తెలివి చాలా ఎక్కువ, కానీ అదే వారి సమస్య..!
మూడు ప్రత్యేక తేదీల్లో జన్మించిన అమ్మాయిలకు చాలా తెలివి ఎక్కువగా ఉంటుంది. ఆ తెలివి కారణంగా వారు ప్రతి విషయాన్ని అతిగా ఆలోచిస్తారు.

Birth date
న్యూమరాలజీ మన జీవితాలను చాలా ఎక్కువగా ప్రభావితం చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా, మనం పుట్టిన తేదీ ఆధారంగా.. మన భవిష్యత్తు, వ్యక్తిత్వం తెలుసుకోవచ్చు. మూడు ప్రత్యేక తేదీల్లో జన్మించిన అమ్మాయిలకు చాలా తెలివి ఎక్కువగా ఉంటుంది. ఆ తెలివి కారణంగా వారు ప్రతి విషయాన్ని అతిగా ఆలోచిస్తారు. ఇలా ఆలోచించి చిన్న సమస్యను కూడా పెద్దదిగా చేసుకొని సమస్యలు తెచ్చుకుంటారు. మరి, ఆ తేదీలేంటో చూద్దామా...
నెంబర్ 3..
ఏ నెలలో అయినా 3, 12, 21, 30 తేదీల్లో జన్మించిన వారంతా నెంబర్ 3 కిందకు వస్తారు. ఈ నెంబర్3 లో పుట్టిన అమ్మాయిలు సహజంగా చాలా తెలివైన వారు. వీరు ప్రతి విషయాన్ని చాలా అతిగా ఆలోచిస్తారు. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు.. ప్రతి విషయంలోనూ తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తూ ఉంటారు. అంతేకాదు.. తాము తీసుకున్న నిర్ణయమే సరైనది అనే భావన వీరిలో ఎక్కువగా ఉంటుంది. తమ డెసిషన్ కరెక్ట్ అని అనుకోవడమే కాదు.. ఎంత మందితో అయినా వాదించి తామే కరెక్ట్ అని అందరితోనూ చెప్పిస్తారు. అంత మొండి పట్టుదల కూడా వీరిలో ఉంటుంది. వీరికి ప్రతి విషయంలోనూ క్లారిటీ అవసరం. అంతేకాదు.. వీరు తమ మనసుకు సంబంధించినది మాత్రమే చేస్తారు.
నెంబర్ 5...
న్యూమరాలజీ ప్రకారం ఏ నెలలో అయినా 5, 14, 23 తేదీల్లో జన్మించిన వారంతా నెంబర్ 5 కిందకు వస్తారు. ఈ తేదీల్లో జన్మించిన వారు కూడా చాలా తెలివైన వారు. వారికి కానీ, కుటుంబానికి కానీ ఏదైనా సమస్య వచ్చింది అంటే చాలు.. దానికి పరిష్కారం కనుక్కునే వరకు ఈ అమ్మాయిలు వదిలిపెట్టరు. చాలా సేపు ఆలోచించి మరీ పరిష్కారం కనుక్కుంటారు. అంతేకాదు.. వీరు ప్రతి విషయానికి చాలా తొందరగా స్పందించారు. ఎవరైనా ఏదైనా అంటే వెంటనే ఎమోషనల్ అయిపోయి బాధపడతారు. ఇక.. వీరు ఎక్కువగా మాట్లాడతారు. తాము మాట్లాడిన విషయం ఎదుటి వ్యక్తికి అర్థం కాలేదు అంటే.. మళ్లీ మళ్లీ చెబుతూనే ఉంటారు. అర్థమయ్యే వరకు చెప్పి విసిగించేస్తారు.
నెంబర్ 7..
ఏ నెలలో అయినా 7, 16, 25 తేదీల్లో జన్మించిన వారంతా నెంబర్ 7 కిందకు వస్తారు. ఈ తేదీల్లో జన్మించిన అమ్మాయిలు మంచి తెలివైనవారు. ఆలోచనాపరులు కూడా. ఈ అమ్మాయిలు బయటకు చూడటానికి చాలా ప్రశాంతంగా ఉంటారు. కానీ.. లోపల మాత్రం వారు ఏవేవో విషయాల గురించి ఆలోచిస్తూనే ఉంటారు. ప్రతి విషయం గురించి చాలా ఎక్కువ సేపు ఆలోచిస్తారు. దీని కారణంగా చాలా సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. వీరు ప్రతి విషయంలోనూ గందరగోళానికి గురౌతూ ఉంటారు. వీరు ప్రతి విషయాన్ని చాలా తొందరగా తప్పుగా అర్థం చేసుకుంటారు. చిన్న సందేహం వచ్చినా.. దానికి పరిష్కారం కనుగొనే వరకు వదిలిపెట్టరు.