Birth date: ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిల నోరు పెద్దది, వీరితో వాదించి గెలవలేరు..!
Birth Date: అమ్మాయిల్లో చాలా రకాలు ఉంటారు. కొందరు ఎవరు ఏం అన్నా… మౌనంగా ఉండిపోతారు. కానీ, కొందరు అమ్మాయిలు మాత్రం… తమ తప్పు లేకపోయినా ఎవరైనా ఏదైనా అంటే అస్సలు ఊరుకోరు. ఎదురు తిరిగి మరీ సమాధానం చెబుతారు.

Birth Date
హిందూమతంలో జోతిష్యశాస్త్రానికి ఎంత ప్రాముఖ్యత ఉందో... న్యూమరాలజీ కూడా అంతే ప్రాముఖ్యత ఉంటుంది. జోతిష్యశాస్త్రంలో జాతకం... మన గ్రహాల ఆధారంగా మన జీవితాన్ని విశ్లేషిస్తే.... సంఖ్యాశాస్త్రంలో మనం పుట్టిన తేదీ ఆధారంగా మన వ్యక్తిత్వాన్ని, స్వభావాన్ని తెలుసుకోవచ్చు. ప్రతి వ్యక్తి పుట్టిన తేదీలో ఒక ప్రత్యేక శక్తి దాగి ఉంటుంది. మరీ ముఖ్యంగా మన బర్త్ డేట్ మన ఆలోచనా విధానం, కోపం, సహనం, ప్రేమ, దయ వంటి భావోద్వాగాలపై ప్రభావం చూపుతాయి. కొన్ని ప్రత్యేక తేదీల్లో పుట్టిన అమ్మాయిలకు నోరు చాలా పెద్దది. అంటే... ఏదైనా వాదన మొదలుపెట్టారు అంటే...వీరితో ఎవరూ గెలవలేరు. మరి, అలాంటి రాశులేంటో చూద్దామా...
నెంబర్ 1...
ఏ నెలలో అయినా 1, 10, 19, 28 తేదీల్లో జన్మించినవారంతా నెంబర్ 1 కిందకు వస్తారు. ఈ తేదీల్లో పుట్టిన వారిపై సూర్యుని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. సూర్యుడు నాయకత్వానికి, ఆత్మగౌరవానికి, శక్తికి సంకేతం. అందుకే... ఈ తేదీల్లో జన్మించిన వారు సహజంగానే చాలా ధైర్యవంతులు. ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువగా ఉంటుంది. కోపం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. మరీ ముఖ్యంగా ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలను భరించడం అంత ఈజీ కాదు. వారికి కోపం వచ్చింది అంటే తట్టుకోవడం చాలా కష్టం.
ఏదైనా ముఖం మీదే చెబుతారు...
ఈ తేదీల్లో జన్మించిన మహిళలు చాలా నిజాయితీగా ఉంటారు. ఎవరితో ఏది మాట్లాడినా నిర్మొహమాటంగా ముఖం మీదనే చెబుతారు. ఇతరులు చెప్పేది వీరు తొందరగా వినరు. వీరు చెప్పింది మాత్రం అందరూ వినాలని అనుకుంటారు. ఈ అమ్మాయిలు ఏదైనా నిర్ణయం తీసుకున్నారు అంటే, అది కచ్చితంగా జరగాల్సిందే. తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే అలవాటు వీరిలో ఉండదు. తాము చెయ్యాలనుకుంటే చేసి తీరతారు. ఎవరైనా తమ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తే వీరు మౌనంగా ఉండలేరు. కోపాన్ని వెంటే ప్రదర్శిస్తారు. గంట సేపు అయినా.. వాదించగలరు. వీరితో వాదనలో ఎవరూ గెలవలేరు. అందుకే.. ఈ అమ్మాయిలను చూస్తే ఎవరైనా కొంచెం ఎక్కువగా భయపడుతూ ఉంటారు
కోపం ఎక్కువ..
ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలకు కోపం ఎక్కువగా ఉన్నా కూడా మనసు మంచిది అని చెప్పొచ్చు. కోపం తగ్గిన తర్వాత.. వీరు మళ్లీ చాలా స్నేహపూర్వకంగా వ్యవహరిస్తారు. కానీ, ఎవరైనా మోసం చేసినా, తమ జీవితంలో జోక్యం చేసుకుంటే మాత్రం వీరు సహించరు. అగ్నిపర్వతంలా పేలిపోతారు.
నాయకత్వ లక్షణాలు....
ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిల్లో సహజంగా నాయకత్వ లక్షణాలు ఉంటాయి. దీని కారణంగా వీరు ఇతరులను సులభంగా ప్రేరేపించగలరు. వీరు జీవితంలో ఏదైనా సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంటే... దానిని సాధించే వరకు వదిలిపెట్టరు. పట్టుదల చాలా ఎక్కువ. అంతేకాదు.. వీరికి కోపం వచ్చినా.. వారి కోపం వెనక ఒక న్యాయం, ఆత్మ గౌరవం ఉంటుంది. ఇతరుల పట్ల ప్రేమ, కరుణతో కూడిన మనస్తత్వం కలిగి ఉంటారు. తమను అర్థం చేసుకున్న వారికి వారు జీవితాంతం మద్దతుగా నిలుస్తారు. ఈ మహిళలు బయటకు కఠినంగా కనిపించినా, వారి మనసు మాత్రం న్యాయం, నిజాయితీతో నిండి ఉంటుంది.