ఈ తేదీల్లో పుట్టినవారు మహా ముదుర్లు.. ఎవ్వరినైనా ఈజీగా బుట్టలో పడేస్తారు!
సంఖ్యా శాస్త్రం ప్రకారం కొన్ని తేదీల్లో పుట్టిన వారు చాలా తెలివిగా ఉంటారు. వీరి మాటల్లో ఆకర్షణ ఉంటుంది. ఎవరితో ఎలా మాట్లాడాలి? ఎలా తమవైపు తిప్పుకోవాలో వీరికి బాగా తెలుసు. ఎదుటివారి నమ్మకాన్ని పొందడంలో వీరు ముందుంటారు.

Birth Date
మనుషుల వ్యక్తిత్వం, ఆలోచనా శైలి వంటివి పుట్టిన తేదీలతో సంబంధం కలిగి ఉంటాయని సంఖ్యా శాస్త్రం చెబుతోంది. కొన్ని తేదీల్లో పుట్టినవారిని “మహా ముదుర్లు” అని సరదాగా పిలుస్తారు. ఎందుకంటే వీరు తమ మాటలు, ఆకర్షణ, తెలివి, చతురతతో ఎవ్వరినైనా ఈజీగా బుట్టలో పడేస్తారు. ఎదుటివారి మనసును అర్థం చేసుకోవడం వీరికి బాగా తెలుసు. ఏ సందర్భంలో ఏ మాట మాట్లాడితే ఎలాంటి ప్రభావం ఉంటుందో వీరు చక్కగా అంచనా వేస్తారు. మరి ఏ తేదీల్లో పుట్టినవారు ఇలాంటి లక్షణాలు కలిగి ఉంటారో ఇక్కడ తెలుసుకుందాం.
గురు గ్రహ ప్రభావంతో..
సంఖ్యా శాస్త్రం ప్రకారం ఏ నెలలో అయినా 3, 5, 6, 12, 14, 21, 23, 27 తేదీల్లో పుట్టిన వారి వ్యక్తిత్వం ప్రత్యేకంగా ఉంటుంది. అతి కఠినమైన విషయాన్ని కూడా వీరు ఈజీగా, సాఫ్ట్ గా చెప్పగల సామర్థ్యం కలిగి ఉంటారు. వీరి మాటల్లో ఉన్న ఆకర్షణ శక్తి కారణంగా ఏ వ్యక్తి అయినా వీరి ప్రభావానికి లోనవుతారు. ముఖ్యంగా 3, 12, 21 తేదీల్లో పుట్టినవారు గురు గ్రహ ప్రభావం ఉన్నవారు. వీరి మాటల్లో జ్ఞానం, చతురత, విశ్వాసం కనిపిస్తుంది. అందుకే వీరు సులభంగా ఎదుటివారి నమ్మకాన్ని పొందుతారు.
బుధ గ్రహ ఆధిపత్యం
5, 14, 23 తేదీల్లో పుట్టినవారు బుధ గ్రహాధిపత్యంలో ఉంటారు. బుధుడు సంభాషణ, బుద్ధి, తీర్మాన శక్తిలో ప్రతిభనిచ్చే గ్రహం. వీరు ఒక నిమిషం మాట్లాడితే ఎదుటివారి మనసు ఏ దిశలో మళ్లించాలో వెంటనే అర్థం చేసుకుంటారు. వీరు చాలా చురుకుగా ఉంటారు. ఎవరు ఏం ఆలోచిస్తున్నారో, ఏం కోరుకుంటున్నారో, ఏ మాట మాట్లాడితే వారి బలం లేదా బలహీనత బయటపడుతుందో ఇట్టే పసిగడతారు.
శుక్రుడి ప్రభావంతో..
6, 15, 24 తేదీల్లో పుట్టినవారిపై శుక్ర గ్రహ ప్రభావం ఉంటుంది. వీరికి ఆకర్షణ ఎక్కువ. వీరు మాట్లాడితే ఎదుటివారు వినడం మాత్రమే కాదు.. వీరితో మాట్లాడాలని, స్నేహం కొనసాగించాలని అనుకుంటారు. ఈ తేదీల్లో పుట్టినవారు సంబంధాలను బాగా అర్థం చేసుకుంటారు. ప్రేమలో, స్నేహంలో, పనిలో ఎక్కడా హద్దు దాటకుండా వ్యవహరిస్తారు. అందుకే వీరి మాటలకు ఎదుటివారు వెంటనే ఇంప్రెస్ అవుతారు.
27 వ తేదీన పుట్టినవారు
ఏ నెలలో అయినా 27వ తేదీన పుట్టినవారిపై చంద్రుడి ప్రభావం ఎక్కువ. వీరు భావోద్వేగాలను చదవడంలో కింగ్‌లాంటి వారు. ఎదుటివారి కళ్లలో ఏ బాధ ఉందో, ఏ కోరిక ఉందో, ఏ భయం ఉందో అలవోకగా గ్రహిస్తారు. ఈ గుణం వల్ల వీరు ఇతరులను సులభంగా అర్థం చేసుకుంటారు.
ఈ రంగాల్లో విజయం సాధిస్తారు
ఈ తేదీల్లో పుట్టినవారి మరో ప్రత్యేకత ఏంటంటే.. చుట్టుపక్కల ఉన్నవారి మనోభావాలు ఏంటి? ఎవరు నిజంగా తమకు దగ్గరగా ఉన్నారు? ఎవరు నటిస్తున్నారు? అన్నది కూడా వీరు ఈజీగా అర్థం చేసుకుంటారు. తమకు అవసరం ఉన్నా లేకున్నా ఎదుటివారితో మనస్ఫూర్తిగా మాట్లాడుతారు. ఈ గుణం కారణంగా వీరు రాజకీయం, వ్యాపారం, పబ్లిక్ రిలేషన్‌లు, మీడియా వంటి రంగాల్లో విజయం సాధిస్తారు.

