- Home
- Astrology
- వాస్తు చిట్కాలు: ఇంట్లో చెత్త బుట్ట ఎక్కడ పెడుతున్నారు? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది..?
వాస్తు చిట్కాలు: ఇంట్లో చెత్త బుట్ట ఎక్కడ పెడుతున్నారు? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది..?
చాలా మంది వంట గదిలో ఎక్కువగా చెత్త బుట్టను ఉంచుతూ ఉంటారు. అలా ఉంచడం వల్ల వాస్తు దోషం కలిగే అవకాశం ఉంది. ఇంట్లో నెగిటివిటీ కూడా పెంచుతుంది.

Vastu Tips
వాస్తు శాస్త్రం మన జీవితాలను చాలా ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. కేవలం ఇంటిని వాస్తు ప్రకారం సెలక్ట్ చేసుకుంటే సరిపోదు. ఇంట్లోని వస్తువులను కూడా వాస్తు ప్రకారమే ఉంచుకోవాలి. ముఖ్యంగా..వంట గది విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు. చాలా మంది ఇంట్లో వంట గదిని కేవలం వంట చేసుకునే ప్రదేశంగా మాత్రమే చూస్తారు. కానీ.. మొత్తం కుటుంబం ఆరోగ్యం, శ్రేయస్సును కాపాడేది ఈ వంటగది. అందుకే.. ఈ వంట గదిని చాలా శుభ్రంగా ఉంచుకోవాలి. వాస్తు తప్పులు చేస్తే... కుటుంబం మొత్తంపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. చాలా మంది వంట గదిలో ఎక్కువగా చెత్త బుట్టను ఉంచుతూ ఉంటారు. అలా ఉంచడం వల్ల వాస్తు దోషం కలిగే అవకాశం ఉంది. ఇంట్లో నెగిటివిటీ కూడా పెంచుతుంది.
వంట గదిలో చెత్త బుట్ట పెడితే ఏమౌతుంది..?
వంట గదిలో చెత్తబుట్ట పెట్టొచ్చు. కానీ, దానికి కచ్చితంగా మూత ఉండాలి. లేకపోతే అది ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని వ్యాపిస్తుంది. ముఖ్యంగా వంటగది లో ఉంచినప్పుడు కచ్చితంగా దానిమీద ఉంచాలి. లేకపోతే.. ఇది మీ ఆహారంపై చాలా ఎక్కువ ప్రభావం చూపిస్తుంది.ఓపెన్ చెత్తబుట్ట నుండి వెలువడే వాసన , బ్యాక్టీరియా వంటగదిలోని ఆహారాన్ని కలుషితం చేస్తుంది. ఇది ఫుడ్ పాయిజనింగ్, అలెర్జీలు , ఇతర వ్యాధుల సంభావ్యతను పెంచుతుంది. అటువంటి పరిస్థితిలో, మీరు మీ వంటగదిలో చెత్తబుట్టను బయట ఉంచడం లేదా మూసి ఉంచడం ముఖ్యం. ఎందుకంటే ఇది మీకు ఆరోగ్య సంబంధిత సమస్యలను కలిగించదు. అలాగే, మీ ఇంటి వాస్తు కూడా బాగానే ఉంటుంది.
వంటగదిలోని చెత్తబుట్టను తెరిచి ఉంచడం వల్ల ఆర్థిక నష్టం...
వాస్తు శాస్త్రం ప్రకారం, చెత్త బుట్ట తెరచి ఉంటే.. ఇంట్లోకి లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగుపెట్టదు. వంటగదిలో చెత్త బుట్టను తెరిచి ఉంచడం వల్ల ఆర్థిక నష్టం, ఖర్చులు పెరగడం , ఆదాయం తగ్గుతుంది. అందుకే.. శుభ్రమైన చెత్తబుట్టను ఉంచడానికి ప్రయత్నించండి. దానిపై మూత పెట్టండి. ఎందుకంటే ఇది మీ అనవసరమైన ఖర్చులను తగ్గిస్తుంది.
వాస్తు పొరపాట్లు చేయకూడదంటే ఏం చేయాలి..?
ప్రతిరోజూ చెత్తబుట్టను శుభ్రం చేసి సమయానికి ఖాళీ చేయండి. చెత్త బుట్టపై మూత పెట్టి ఉంచండి. ఇక చెత్త బుట్టను ఇంటికి నైరుతి దశలో ఉంచాలి.ఎల్లప్పుడూ వేప ఆకులు లేదా కర్పూరం చెత్తబుట్ట దగ్గర ఉంచండి.