Birth Date: ఈ తేదీల్లో పుట్టిన మగవాళ్లు చాలా డేంజర్, భార్యను డామినేట్ చేస్తారు
సంఖ్యాశాస్త్రం ప్రకారం కొన్ని తేదీలలో జన్మించిన (Birth date) పురుషులు చాలా డేంజర్. వీరు భర్తలుగా మారి తమ భార్యలపై ఎంతో ఆధిపత్యాన్ని చూపిస్తారు. ఈ భర్తలతో వేగలేరు భార్యలు.

ఆధిపత్యం చాటే భర్తలు
సంఖ్యాశాస్త్రం ప్రకారం కొన్ని తేదీలలో జన్మించే పురుషులు డామినేట్ చేస్తారు. వారు భార్యను అణిచివేసే విధంగా ప్రవర్తిస్తారు. ఇలాంటి భర్తలను భరించడం చాలా కష్టం. అతని ఆధిపత్యాన్ని భరించాలంటే భూదేవంత సహనం భార్యాకు ఉండాలి.
జీవిత మార్గ సంఖ్య
సంఖ్యాశాస్త్రంలో పుట్టిన తేదీని బట్టి ‘జీవిత మార్గ సంఖ్య’ (Life path number) లెక్కిస్తారు. ఆ సంఖ్యను బట్టి వ్యక్తిత్వం, గుణాలు, బలహీనతలు, సంబంధాలు, ప్రవర్తనను చెబుతుంది. ఉదాహరణకు మీరు ఒక నెలలో 23వ తేదీన జన్మిస్తే మీ జీవిత మార్గ సంఖ్య 2+3= 5. ఇలా లెక్కపెట్టుకోవాలి.
జీవిత మార్గ సంఖ్య 1
ఏ నెలలోనైనా 1, 10, 19, 28 తేదీలలో జన్మించిన వారి జీవిత మార్గ సంఖ్య 1 అవుతుంది. వీరికి సహజంగానే నాయకత్వ లక్షణాలు ఉంటాయి. కుటుంబంపై పూర్తి నియంత్రణ వీరికి ఉంటుంది. వీరిది ఆధిపత్య వైఖరి. అలాగే ప్రేమ కూడా ఎక్కువ. అధిక ప్రేమ వల్లే ఆధిపత్య వైఖరి కూడా ఎక్కువగా అనిపిస్తుంది.
4 నెంబర్
ఏ నెలలోనైనా 4, 13, 22, 31 తేదీలలో జన్మించిన పురుషుల క్రమశిక్షణతో ఉంటారు. వీరికి కష్టపడి పనిచేసే స్వభావం ఉంటుంది. వారు స్థిరమైన జీవితాన్ని కలిగి ఉంటారు. కుటుంబం కోసం ఎంతో కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు. బాస్ లాగా వ్యవహరిస్తారు. అందుకే ఇలాంటి భర్తలతో వేగం కష్టంగా ఉంటుంది.
జీవిత మార్గ సంఖ్య 8
ఏ నెలలోనైనా 8, 17, 26 తేదీలలో జన్మించిన మగవారు విజయం కోసం ఎంతో కష్టపడతారు. వారికి అధికారం ఎంతో ఇష్టం. భార్య తాను పెట్టే నియమాలను పాటించాలని ఆయన గట్టిగా కోరుకుంటారు. వీరితో పడడం చాలా కష్టం.