ఈ రాశుల వారికి దూకుడు ఎక్కువ..!
గెలుపు, ఓటములు సంగతి పక్కన పెడితే.. పోటీ పడటానికి ముందుంటారు. కేవలం పోటీ మాత్రమే కాదు... ప్రతి విషయంలోనూ చాలా దూకుడుగా ఉంటారు. జోతిష్య శాస్త్రం ప్రకారం.. మరి అలాంటి లక్షణాలు ఉన్న రాశులేంటో ఓసారి చూద్దామా..

astrology
ఏదైనా పోటీ ఉంది అంటే కొందరు ఆ దరిదాపుల్లోకి కూడా వెళ్లరు. ఆ.. ఇప్పుడు మనకు ఇవన్నీ అవసరమా అన్నట్లుగా ప్రవర్తిస్తారు. కానీ.... కొందరు మాత్రం.. అది ఎలాంటి పోటీ అయినా సరే... చాలా దూకుడుగా ఉంటారు. వారికి పోటీతత్వం చాలా ఎక్కువ. గెలుపు, ఓటములు సంగతి పక్కన పెడితే.. పోటీ పడటానికి ముందుంటారు. కేవలం పోటీ మాత్రమే కాదు... ప్రతి విషయంలోనూ చాలా దూకుడుగా ఉంటారు. జోతిష్య శాస్త్రం ప్రకారం.. మరి అలాంటి లక్షణాలు ఉన్న రాశులేంటో ఓసారి చూద్దామా..
1.మేషరాశి..
ఈ రాశివారికి ఆవేశం చాలా ఎక్కువ. భగభగ మండే అగ్ని గోళంలా ఉంటారు. వీరికి పోటీ తత్వం చాలా ఎక్కువ. వీరు ఏ విషయాన్ని తేలికగా తీసుకోరు. వారు చేసే పని మాత్రం చాలా అత్యుత్తమంగా ఉండాలని కోరుకుంటారు. ఎవరైనా సవాలు చేస్తే.. వెంటనే రంగంలోకి దిగేస్తారు. ఎదుటివారిని ఓడించడానికి ముందుంటారు. వీరితో పోటీ అంటే జాగ్రత్తగా ఉండాల్సిందే.
2.వృషభ రాశి..
ఈ రాశివారు లగ్జరీ లైఫ్ ని ఇష్టపడతారు. దాని కోసం ఎంతైనా కష్టపడతారు. ఎలాంటి పోటీకైనా సిద్దపడతారు. చాలా దూకుడుగా ఉంటారు. తాము అనుకున్నది సాధించడానికి చాలా మొండిగా ఉంటారు. వీరికి పోటీ తత్వం చాలా ఎక్కువ. వీరు చాలా కష్టపడతారు. వీరికి దూకుడు.. పోటీతత్వం. రెండూ చాలా ఎక్కువ. వీరిపై విజయం సాధించడం అంత సులువేమీ కాదు.
3.సింహ రాశి..
సింహరాశి వారు తమ చుట్టూ ఉన్న వ్యక్తుల కంటే ఉన్నతంగా ఉండేందుకు ఇష్టపడతారు. వారు ఉత్తమంగా ఉండాలని , దాని కోసం కూడా ఇతరుల దృష్టిని ఆకర్షించాలని కోరుకుంటారు. వారు ఏదైనా సాధించినట్లయితే.. ఆ విషయం అందరికీ తెలియాలని కోరుకుంటారు. ఓడిపోవడం అనే పదం వారి డిక్షనరీలో లేనందున ప్రతిదానిని పోటీగా పరిగణిస్తారు. వీరికి ధైర్యం, స్థైర్యం చాలా ఎక్కువ. అన్నింట్లోనూ దూకుడుగా ప్రవర్తిస్తారు.
4.వృశ్చిక రాశి..
ఈ రాశివారికీ పోటీతత్వం ఎక్కువ. కానీ.. ఇతరుల్లాగా డప్పు కొట్టరు. చాలా నిశ్శబ్దంగా పనిగానిస్తారు. వీరికి దూకుడు ఎక్కువ అనే విషయం చాలా ఆలస్యంగా తెలుస్తుంది. వీరి విషయంలో ఎలాంటి సందేహాలు అవసరం లేదు. ప్రతి విషయంలోనూ వీరు ఎవరికైనా పోటీ ఇవ్వగలరు.