Moon Transit: చంద్రుడి రాశిమార్పు.. ఈ మూడు రాశులవారికి ఊహించని లాభాలు!
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రుడు ప్రతి రెండున్నర రోజులకు ఒకసారి రాశి మారుతూ ఉంటాడు. చంద్రుడు నేడు (శుక్రవారం) మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. చంద్రుడి రాశి మార్పు 3 రాశులవారి జీవితాల్లో ఊహించని మార్పులు తీసుకురానుంది. అవేంటో తెలుసుకుందామా..

చంద్రుడి రాశిమార్పు..
జ్యోతిష్య శాస్త్రంలో చంద్రుడుని శుభ గ్రహంగా పరిగణిస్తారు. మనస్సు, భావోద్వేగాలకు కారకుడైన చంద్రుడు నేడు (శుక్రవారం) మకర రాశిలో ప్రవేశించనున్నాడు. రాత్రి 7:10 గంటలకు మకర రాశిలోకి ప్రవేశించి ఆగస్టు 10 ఉదయం 2:10 వరకు అక్కడే ఉంటాడు. ఈ సమయం కొన్ని రాశులవారికి అనుకూలంగా ఉంటుంది. ఆ రాశులేంటో.. వారికి కలిగే ప్రయోజనాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
మేష రాశి
చంద్రుని ప్రత్యేక అనుగ్రహంతో మేషరాశి వారికి అదృష్టం కలిసివస్తుంది. విద్యార్థులు పరీక్షల్లో మంచి మార్కులు సాధిస్తారు. విదేశీ ఒప్పందాల ద్వారా వ్యాపారులకు మంచి లాభాలు వస్తాయి. వ్యాపారం విస్తరిస్తుంది. ఉద్యోగులు అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ఆదాయం పెరుగుతుంది. బంధువులతో సఖ్యతగా ఉంటారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి చంద్రుడు కొన్ని రోజుల పాటు అనుకూలంగా ఉంటాడు. నిరుద్యోగ ప్రయత్నాలు కలిసివస్తాయి. వారు కోరుకున్న ఉద్యోగం దక్కుతుంది. ఒంటరి వ్యక్తులు స్నేహితులతో మంచి సమయం గడుపుతారు. ముందెన్నడూ లేనంత సంతోషంగా ఉంటారు. కుటుంబ పెద్దలు కుటుంబాన్ని ఏకం చేయడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలు ఆశించిన స్థాయిలో రాణిస్తాయి. ఉద్యోగులకు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
మకర రాశి
మేష, కర్కాటక రాశులతో పాటు, మకర రాశి వారికి చంద్రుని అనుగ్రహం వల్ల కొన్ని విషయాల్లో శుభ ఫలితాలు దక్కుతాయి. ధార్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరగడం వల్ల పెద్దవారికి మనశ్శాంతి లభిస్తుంది. వారి ఆరోగ్యం మెరుగుపడుతుంది. కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది. వ్యాపారులు చిన్న పెట్టుబడుల ద్వారా అధిక లాభాలు పొందుతారు. ఆర్థి ఇబ్బందులు తొలగిపోతాయి. ఉద్యోగులు, వ్యాపారులు కారు కొనుగోలు చేసే అవకాశం ఉంది.