- Home
- Astrology
- Chandra Gochar: జ్యేష్ఠ నక్షత్రంలోకి చంద్రుడు.. ఈ 4 రాశుల వారికి ధన, ఆస్తి, ఉద్యోగ సుఖాలు
Chandra Gochar: జ్యేష్ఠ నక్షత్రంలోకి చంద్రుడు.. ఈ 4 రాశుల వారికి ధన, ఆస్తి, ఉద్యోగ సుఖాలు
Chandra Gochar: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రుడు జ్యేష్ఠ నక్షత్రంలోకి జూన్ 27, 2026న ప్రవేశిస్తాడు. చంద్రుడు జూన్ 29, 2026, సోమవారం ఉదయం 1:08 గంటల వరకు ఈ నక్షత్రంలోనే ఉంటాడు. ఈ చంద్ర సంచారం 4 రాశుల వారి జీవితాలపై చాలా శుభ ప్రభావాన్ని చూపుతుంది.

కర్కాటక రాశి
కర్కాటక రాశిలోనే చంద్రుని సంచారం జరగబోతోంది. కాబట్టి ఆ రాశిలో జన్మించిన వారికి ఈ సమయం బాగా కలిసివస్తుంది. ఉన్నత చదువులు చదవాలనుకునే వారికి అంతా సాఫీగా జరుగుతుంది. వారిలో ఏకాగ్రత పెరుగుతుంది. వ్యాపారం చేస్తున్న వారికి ముఖ్యమైన ఒప్పందాలను ఖరారు కావచ్చు. అయితే వారు దూర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది.
కన్యా రాశి
చంద్రుడు బుధుడికి చెందిన జ్యేష్ఠ నక్షత్రంలోకి ప్రవేశించడం వల్ల కన్యా రాశి వారికి అంతా శుభప్రదంగా ఉంటుంది. ఉద్యోగం మారాలనుకునే వారికి మంచి అవకాశాలు వస్తాయి. భవిష్యత్తులో ఈ రాశి వారికి పురోగతి మార్గాలు తెరుచుకుంటాయి. ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. ఈ సమయంలో చేసే ప్రయాణం విజయవంతమవుతుంది.
తులా రాశి
చంద్ర సంచారం తులారాశి వారికి ఎంతో అదృష్టాన్ని తీసుకొస్తుంది. ఈ రాశి వారి మనసు సంతోషంగా ఉంటుంది. ఆర్థికంగా మంచి స్థాయికి చేరుకుంటారు. కుటుంబ వ్యవహారాలు చక్కగా సాగుతాయి. కొత్త వ్యాపార ప్రాజెక్టులను ప్రారంభించడానికి ఇదే మంచి సమయం. ఈ రాశి వారి తల్లి ఆరోగ్యం మెరుగుపడుతుంది.
మీన రాశి
చంద్ర సంచారం మీన రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. అదృష్టం పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాలు కలిసివస్తాయి. విజయం దక్కే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఇంట్లో వాతావరణం సానుకూలంగా ఉంటుంది. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి.

