Zodiac signs: బుధుడి వల్ల ఈ 4 రాశులకు కొత్త ఉద్యోగం, ప్రమోషన్ ఖాయం
2025 అక్టోబర్‌లో తులారాశిలో బుధుని సంచారం ఎన్నో రాశుల (Zodiac Signs) వారికి మంచి జరిగేలా చేస్తుంది. బుధుని వల్ల మేషం, సింహం, తుల, వృశ్చిక రాశుల వారికి వృత్తి జీవితంలో కలిసివస్తుంది. ప్రమోషన్ తో పాటూ జీతం కూడా పెరుగుతుంది.

అక్టోబర్ లో బుధ సంచారం
చదువు పూర్తి చేసిన వారికి బుధుడి వల్ల ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. అందుకే బుధుడి సంచారం జాతకంలో ఎంతో ముఖ్యమైనది. బుధుడు జ్ఞానం, కమ్యూనికేషన్, వ్యాపారం, వృత్తి జీవితంతో ముడిపడి ఉంటాడు. 2025 అక్టోబర్‌లో బుధుడి సంచారం ఎన్నో మార్పులను తీసుకొస్తుంది. బుధుడు తులారాశిలోకి ప్రవేశించబోతున్నాడు. బుధుడి సంచారం వల్ల అనేక రాశుల వారికి వృత్తిపరమైన పురోగతిని అందిస్తుంది. అలాగే కొత్త ఉద్యోగావకాశాలు కూడా వస్తాయి. అక్టోబర్లో జరిగే మార్పుల వల్ల మేషం, సింహం, తుల, వృశ్చిక రాశి వారికి ఎన్నో గొప్ప ప్రయోజనాలను ఇస్తుంది.
మేష రాశి
మేష రాశి వారికి ఎంతో మేలు జరిగే కాలం ఇది. బుధుడి వల్ల వీరికి వృత్తి, వ్యాపారాల్లో విపరీతమైన పురోగతి ఉంటుంది. ఆఫీసులో చాలా వరకు ఇబ్బందులు తగ్గుతాయి. మీకు ఉన్నతాధికారుల నుంచి మీకు ప్రశంసలు అందే అవకాశం ఉంది. మీరు అనకున్న పనులు విజయవంతమవుతాయి. వీరికి కొత్త ఉద్యోగావకాశాలు లభించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. చదువుకున్నవారికి ప్రభుత్వ లేదా ప్రైవేట్ రంగాల్లో వీరికి ఉద్యోగం కచ్చితంగా వస్తుంది.
సింహ రాశి
సింహ రాశి వారికి ఈ సమయం విపరీతంగా కలిసి వస్తుంది. వీరికి కొత్తగా ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. ఉద్యోగులకు ప్రమోషన్ కూడా వస్తుంది. జీతాలు కూడా పెరుగుతాయి. కుటుంబ మద్దతుతో వృత్తి జీవితంలో కూడా మంచి స్థాయికి చేరుకుంటుంది. నిరుద్యోగుగలకు కచ్చితంగా ఉద్యోగం వస్తుంది. వీరికి బుధయోగం ఎంతగానో కలిసివస్తుంది.
తులా రాశి
తులా రాశి వారికి ఊహించని అభివృద్ధి కనిపిస్తుంది. మీకు ఆఫీసులో ఎన్నో మంచి అవకాశాలు కనిపిస్తాయి. మీరు అనుకున్న వ్యాపార ప్రణాళికలు విజయవంతంగా మారుతాయి. మీరు ఈ సమయంలో చేసే ప్రయాణాలు లాభంగా ఉంటాయి. మీ శత్రువులను మీరు జయించవచ్చు. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగాలు దొరుకుతాయి. బుధ యోగం తులారాశి వారికి మంచి ఉద్యోగాలు వచ్చేలా చేస్తుంది.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి వృత్తిపరంగా ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. ఎదరయ్యే సవాళ్లను మీరు విజయవంతంగా అధిగమించగలరు. కొత్త వ్యాపార అవకాశాలు పెరుగుతాయి. వృత్తిపరంగా మీకు కలిసి వస్తుంది. నిరుద్యోగులు మాత్రం విజయం సాధిస్తారు. బుధుడి దృష్టి వృశ్చిక రాశి వారిపై సానుకూలంగా ఉంటుంది.