MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Astrology
  • బుధాదిత్య రాజయోగం.. ఈ 3 రాశులకు ఇక అన్నీ మంచిరోజులే, పట్టిందల్లా బంగారమే!

బుధాదిత్య రాజయోగం.. ఈ 3 రాశులకు ఇక అన్నీ మంచిరోజులే, పట్టిందల్లా బంగారమే!

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం త్వరలో బుధాదిత్య రాజయోగం ఏర్పడనుంది. ఈ రాజయోగం వల్ల 3 రాశుల వారికి మూడు నెలల వరకు పట్టిందల్లా బంగారం కానుంది. అప్పుల బాధలు తీరి.. ధనలాభం కలగనుంది. మరి ఆ రాశులేంటో తెలుసుకుందామా.. 

1 Min read
Author : Kavitha G
Published : Aug 28 2025, 05:15 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
బుధాదిత్య రాజయోగం..
Image Credit : Getty

బుధాదిత్య రాజయోగం..

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారానికి చాలా ప్రాధాన్యం ఉంది. గ్రహాల సంచారం మానవ జీవితాల్లో ఊహించని మార్పులను తీసుకువస్తుంది. ఆగస్టు 30న బుధ గ్రహం.. సింహ రాశిలోకి ప్రవేశించనుంది. సింహ రాశికి అధిపతి సూర్యుడు. కాబట్టి బుధుడు, సూర్యుడు కలిసి బుధాదిత్య రాజయోగం ఏర్పరచనున్నాయి. ఈ యోగం 3 రాశుల వారికి మంచి ఫలితాలు ఇవ్వనుంది. ఆ రాశులేంటో.. వారికి కలిగే ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
వృషభ రాశి
Image Credit : our own

వృషభ రాశి

బుద్ధికుశలత, వ్యాపారం, విద్య, ఆర్థిక స్థితికి కారకుడైన బుధుడు.. సూర్యుడితో కలవడం వల్ల వృషభ రాశి వారికి మేలు జరుగుతుంది. వ్యాపారంలో లాభాలు, ఉద్యోగంలో పదోన్నతి లభిస్తాయి. కుటుంబ సంబంధాలు బలపడతాయి. అప్పుల సమస్యలు తీరే అవకాశం ఉంది. శత్రువులపై విజయం సాధిస్తారు. సామాజిక గౌరవం పెరుగుతుంది. ధనలాభం వల్ల ఆర్థిక స్థితి బలపడుతుంది.

35
కర్కాటక రాశి
Image Credit : our own

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి బుధాదిత్య రాజయోగం శుభ ఫలితాలను ఇస్తుంది. బంధాలు బలపడుతాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కొత్త అవకాశాలు లభిస్తాయి. ఆధ్యాత్మిక ఆసక్తి పెరుగుతుంది. విద్యార్థులు చదువులో రాణిస్తారు. ఉద్యోగంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. ఆకస్మిక లాభాలు కలుగుతాయి. అప్పులు తీరి మానసిక ప్రశాంతంత పొందుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. 

45
సింహ రాశి
Image Credit : our own

సింహ రాశి

సింహ రాశి వారికి ఈ సమయం చాలా అనుకూలం. ఉద్యోగం కోసం చూస్తున్నవారికి మంచి అవకాశాలు వస్తాయి. నిర్ణయాలు తీసుకునే శక్తి పెరుగుతుంది. కుటుంబ సంబంధాలు బలపడతాయి. ఆధ్యాత్మిక ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగులు అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారాలకు కొత్త పెట్టుబడులు అందుతాయి. ఆదాయం పెరుగుతుంది. పిల్లల చదువు, ఆరోగ్యం బాగుంటుంది. 

55
రాబోయే 3 నెలలు..
Image Credit : Getty

రాబోయే 3 నెలలు..

జ్యోతిష్య నిపుణుల ప్రకారం బుధాదిత్య రాజయోగం.. వృషభ, కర్కాటక, సింహ రాశుల వారి జీవితంలో గొప్ప మార్పులు తెస్తుంది. ఈ రాశులవారు రాబోయే 3 నెలలు జీవితంలో కొత్త వెలుగు చూస్తారు. ఇది రాజయోగ సమయం కాబట్టి.. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్లవచ్చని పండితులు చెబుతున్నారు. 

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
పండుగలు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి నూతన గృహ, వాహన యోగం.. అనుకూల ఫలితాలు!
Recommended image2
Zodiac signs: పెళ్లి తర్వాత ఈ రాశుల జాతకమే మారిపోతుంది, అదృష్టం రెట్టింపు అవ్వడం పక్కా
Related Stories
Recommended image1
ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి భార్యగా వస్తే మీకన్నా లక్కీ పర్సన్ మరొకరు ఉండరు!
Recommended image2
ఈ 4 రాశుల వారు చిన్న వయసులోనే బోలెడు డబ్బులు సంపాదిస్తారు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved