- Home
- Astrology
- Mercury Transit: వృశ్చిక రాశిలోకి బుధుడు.... డిసెంబర్ లో ఈ రాశులకు చుక్కలే, సమస్యలు తప్పవు.!
Mercury Transit: వృశ్చిక రాశిలోకి బుధుడు.... డిసెంబర్ లో ఈ రాశులకు చుక్కలే, సమస్యలు తప్పవు.!
Mercury Transit: డిసెంబర్ లో బుధుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తాడు. రెండు నెలల్లో రెండోసారి బుధుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశించనున్నాడు. దీని వల్ల కొన్ని రాశులకు మంచి ఫలితాలు కలగనున్నాయి. కొన్ని రాశులకు మాత్రం సమస్యలు రానున్నాయి.

Mercury Transit
జోతిష్యశాస్త్రం ప్రకారం, బుధుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి మారడానికి 15 నుంచి 20 రోజులు పడుతుంది. బుధుడు.. మిథున రాశి, కన్య రాశికి అధిపతి. తొమ్మిది గ్రహాలలో అత్యంత వేగంగా కదిలే గ్రహాల్లో ఇది కూడా ఒకటి. కొన్ని సార్లు బుధుడి తిరోగమనం చెంది మరొక రాశిలోకి తిరిగి వెళ్తాడు. బుధుని సంచారం తెలివితేటలు, కమ్యూనికేషన్, వ్యాపారం, వ్యవహారాలను ప్రభావితం చేస్తుంది. డిసెంబర్6 నుంచి డిసెంబర్ 29వ తేదీ వరకు కొన్ని రాశులపై ఈ ప్రయాణం దుష్ప్రభావం చూపించనుంది. మరి, ఆ రాశులేంటో చూద్దాం.....
1.మేష రాశి...
బుధుడు మేష రాశి8వ ఇంట్లో సంచరిస్తాడు. బుధుని స్థానం మేష రాశివారికి అనుకూలంగా లేదు. మీరు కొన్ని సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. పనిలో ఒత్తిడి, చిరాకు పెరగొచ్చు. దీని వల్ల మీకు విసుగు వస్తుంది. వ్యాపారాల్లో లాభాలు తగ్గిపోతాయి. లాభం లేకపోవడం వల్ల అప్పులు చేయాల్సి రావచ్చు. అప్పులు తీర్చలేక ఒత్తిడికి గురౌతారు. ఆరోగ్య సమస్యలు కూడా పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక సమస్యలతో పాటు.. కుటుంబంలోనూ సమస్యలు పెరుగుతాయి. ఈ సమయంలో స్నేహితులు మీకు సహాయం చేస్తారు కానీ.. బంధువులతో సమస్యలు రావచ్చు. కొంత కాలం తర్వాత పరిష్కారమౌతాయి.
2.మిథున రాశి...
బుధుడు మిథునరాశి 6వ ఇంట్లో సంచరిస్తాడు. ఈ బుధ సంచారము మిథునరాశి ఆత్మవిశ్వాసాన్ని తగ్గిస్తుంది. మీరు పనిలో నిరుత్సాహపడతారు. ఎవరినీ కలవడానికి ఇష్టపడరు. ఒంటరితనం మిమ్మల్ని వెంటాడుతుంది. ఆర్థిక పరిస్థితి గురించి వివిధ చింతలు పెరుగుతాయి. దీర్ఘకాలిక ప్రాజెక్టుల కోసం డబ్బును నిర్వహించడం కష్టం అవుతుంది. ఇది మీ ఆర్థిక జీవితం గురించి ఆలోచించేలా చేస్తుంది. కానీ డిసెంబర్ తర్వాత కాలం మీకు చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. గతంలో ఉన్న అన్ని సమస్యలు తొలగిపోతాయి. మీరు ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతారు.
3.సింహ రాశి...
సింహరాశి 4వ ఇంట్లో బుధుడు సంచరిస్తాడు. బుధుడు ఈ స్థితిలో ఉండటం వల్ల సింహ రాశి వారికి మంచి ఫలితాలు రావు. ఏదైనా ఆర్థిక నిర్ణయం తీసుకునే ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం మంచిది. మీ తప్పుడు నిర్ణయాలు సమాజంలో హోదా, గౌరవాన్ని కోల్పోయే అవకాశం ఉంది. ఈ సమయంలో, మీరు వాహనాలను చాలా జాగ్రత్తగా ఉపయోగించాలి. దూర ప్రయాణాలను నివారించడం మంచిది. ఎందుకంటే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇంట్లో జరిగే శుభకార్యాలలో అనేక అడ్డంకులు, చింతలు ఉండవచ్చు. పనిపై ఆసక్తి కోల్పోయే అవకాశం ఉంది.
4.తుల రాశి...
బుధుడు తులారాశి 2వ ఇంట్లో సంచరిస్తాడు. బుధుడు స్థానం తులారాశి వారికి ఊహించని ప్రమాదాలను తెస్తుంది. ఇది ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. దీనితో పాటు, ఇది వివాహ జీవితంలో అనేక సమస్యలను కలిగించే అవకాశం ఉంది. అలాగే, ఇది తులారాశి వారి కెరీర్‌కు మంచి సమయం కాదు. కొత్త వ్యాపారం ప్రారంభించడానికి ఇది అననుకూలమైనది. ఈ సమయంలో అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. ఇది మీ పొదుపును ప్రభావితం చేస్తుంది. దంపతుల మధ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. దైవారాధన చేయడం వల్ల ఈ సమస్యల నుంచి బయటపడతాయి.