ఈ 5 నక్షత్రాల్లో పుట్టిన అబ్బాయిలు.. భార్య మాట అస్సలు వినరు!
భార్యాభర్తల బంధం జీవితాంతం సంతోషంగా సాగాలంటే.. ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడం, ఒకరి మాట మరొకరు వినడం ముఖ్యం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని నక్షత్రాల్లో పుట్టిన అబ్బాయిలు సహజంగానే బలమైన స్వభావం కలిగి ఉంటారు. వీరు భార్య మాట అస్సలు వినరు.

Birth Stars Astrology
భార్యాభర్తల మధ్య అనుబంధం, ప్రేమ, సహకారం, ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడం వంటివి కుటుంబ జీవితానికి పునాదులు. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని నక్షత్రాల్లో పుట్టిన అబ్బాయిలు సహజంగానే మొండితనం, అధిక ఆత్మవిశ్వాసం, ఇతరుల అభిప్రాయాలను పట్టించుకోకపోవడం వంటి గుణాలు కలిగి ఉంటారు. ముఖ్యంగా భార్య ఇచ్చే సూచనలు, సలహాలు లేదా హెచ్చరికలను అస్సలు పట్టించుకోరు. మరి ఏ జన్మ నక్షత్రం కలిగిన వారు ఇలాంటి లక్షణాలు కలిగి ఉంటారో ఇక్కడ తెలుసుకుందాం.
అశ్విని నక్షత్రం
అశ్విని నక్షత్రంలో పుట్టిన అబ్బాయిలు వేగంగా, తొందరపడి నిర్ణయాలు తీసుకునే స్వభావం కలిగి ఉంటారు. వీరు ఏ పని చేయాలన్నా ఆలస్యం చేయరు. ఆలోచించరు. భార్య చెప్పిన మాటలు వీరు పెడచెవిన పెడతారు. ‘నేను చేయాల్సిన పని గురించి నాకు బాగా తెలుసు’ అనే భావన వీరిలో ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ స్వభావం దురుద్దేశంతో కాదు.. వారి సహజ ఉత్సాహం, స్వతంత్ర స్వభావం వల్ల వస్తుంది.
భరణి నక్షత్రం
భరణి నక్షత్రం.. అధిక అహంకారం, నమ్మకంతో సంబంధం ఉన్న నక్షత్రం. ఈ నక్షత్రంలో పుట్టిన పురుషులు తమ మాటే ఫైనల్ అనే ధోరణి కలిగి ఉంటారు. భార్య సూచనను అంగీకరించడం అంటే.. తమ అధికారాన్ని కోల్పోవడమే అన్నట్లుగా ఫీల్ అవుతారు. వీరు భార్య పట్ల ప్రేమ, శ్రద్ధలతో ఉన్నా.. నిర్ణయాల విషయానికి వస్తే మాత్రం భార్య అభిప్రాయాన్ని పట్టించుకోరు.
మఖ నక్షత్రం
మఖ నక్షత్రంలో పుట్టిన పురుషులు రాజులా ఫీల్ అవుతారు. వీరికి గౌరవం, ఆధిపత్యం చాలా ముఖ్యం. కుటుంబ నాయకత్వం తమదే కావాలని భావిస్తారు. భార్య ఏదైనా చెప్పినప్పుడు.. అది సరైనదే అయినా, వినకుండా ఉండటం వీరి వ్యక్తిత్వ లక్షణం. తమ నిర్ణయాలే కరెక్ట్ అని.. వాటిని మార్చుకోవడం మంచిదికాదని వీరు గట్టిగా నమ్ముతారు.
పుబ్బ నక్షత్రం
పుబ్బ నక్షత్రం కళాత్మకత, గర్వం, స్వతంత్రాన్ని సూచిస్తుంది. ఈ నక్షత్రంలో పుట్టిన అబ్బాయిలు తమ స్వేచ్ఛను ఎంతో విలువైనదిగా భావిస్తారు. భార్య సలహాను అస్సలు తీసుకోరు. "నాకెవరూ చెప్పాల్సిన అవసరం లేదు" అనే భావన వీరిలో బలంగా ఉంటుంది. అందుకే భార్య మాట వినకపోవడం వీరిలో సాధారణ లక్షణం.
మూల నక్షత్రం
మూల నక్షత్రంలో పుట్టిన అబ్బాయిలు లోతైన ఆలోచనలు, మొండితనం, ఎక్కువ ఎమోషనల్ గా ఉంటారు. వీరు ఒకసారి నిర్ణయం తీసుకుంటే దాన్ని మార్చడం ఎవ్వరి వల్ల కాదు. ఈ నక్షత్రం అగ్ని స్వభావం కలిగిన నక్షత్రం కావడంతో.. తాము అనుకున్నదే చేయాలనే దృఢ సంకల్పం వీరిలో ఎక్కువగా ఉంటుంది. భార్య సూచనలను వీరు అడ్డంకిగా భావిస్తారు.

