Birth Date: ఈ తేదీల్లో పుట్టిన అబ్బాయిలకు తెలివి చాలా ఎక్కువ, కుటుంబ గౌరవం పెంచుతారు!
Birth Date: న్యూమరాలజీ ప్రకారం, కొన్ని తేదీల్లో పుట్టిన అబ్బాయిల్లో తెలివి తేటలు చాలా ఎక్కువగా ఉంటాయి. వారికి ఉన్న తెలివితేటలతో.. వారు ఉన్నత స్థాయికి వెళ్లడం మాత్రమే కాదు... వారి కుటుంబాన్ని కూడా గొప్ప స్థాయిలో నిలపెడతారు.

Zodiac signs
జోతిష్యశాస్త్రం మాదిరిగానే, న్యూమరాలజీ కూడా మన జీవితాలను చాలా ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తుంది. మనం పుట్టిన తేదీ సహాయంతో.. మన వ్యక్తిత్వం ఎలా ఉంటుంది? భవిష్యత్తు ఎలా సాగుతుంది? కెరీర్ బాగుంటుందో లేదో కూడా తెలుసుకోవచ్చు. ఈ రోజు కొన్ని ప్రత్యేకమైన తేదీల్లో పుట్టిన అబ్బాయిల విషయానికి వస్తే... వారిలో తెలివితేటలు చాలా ఎక్కువగా ఉంటాయి. తమ తెలివితో కుటుంబ ప్రతిష్టను నిలపెడతారు. మరి, ఆ తేదీలేంటో ఓసారి చూద్దామా....
నెంబర్ 1...
ఏ నెలలో అయినా 1, 10, 19, 28 తేదీల్లో జన్మించిన వారంతా నెంబర్ 1 కిందకు వస్తారు. ఈ తేదీల్లో జన్మించిన అబ్బాయిలకు తెలివితేటలు చాలా ఎక్కువ అని చెప్పొచ్చు. ఈ తేదీల్లో జన్మించిన వారిపై సూర్యుని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. వీరు చాలా నమ్మకంగా ఉంటారు. నిజాయితీకి మారుపేరు. వారి ఆలోచనలను.. వారి మాటలలో స్పష్టంగా తెలియజేస్తారు. జీవితంలో మంచి స్థాయికి వెళ్లగలరు. కుటుంబాన్ని గొప్ప స్థాయికి తీసుకువెళతారు. వీరికి మనసులో ఒక మాట ఉంచుకొని.. బయటకు మరో విషయం మాట్లాడటం వీరికి నచ్చదు. మనసులో ఏది అనిపిస్తే.. అదే బయటకు కూడా చెబుతారు.
నెంబర్ 3...
ఏ నెలలో అయినా 3, 12,21, 30 తేదీల్లో జన్మించిన వారంతా నెంబర్ 3 కిందకు వస్తారు. న్యూమరాలజీ ప్రకారం.. ఈ తేదీల్లో జన్మించిన వారిపై బృహస్పతి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక.. తేదీలో పుట్టిన అబ్బాయిలకు తెలివి చాలా ఎక్కువ. వీరు జీవితంలో చాలా ఎక్కువగా కష్టపడతారు. అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు. తమ కుటుంబానికి కీర్తి, ప్రతిష్టలు తీసుకువస్తారు.
నెంబర్ 5...
ఏ నెలలో అయినా 5, 14, 23 తేదీల్లో జన్మించిన వారంతా నెంబర్ 5 కిందకు వస్తారు. వీరిని బుధ గ్రహం పాలిస్తూ ఉంటుంది. ఈ గ్రహ ప్రభావం కారణంగా వీరికి తెలివి తేటలు చాలా ఎక్కువగా ఉంటాయి. స్వతహాగా వీరు చాలా ధైర్యవంతులు. జీవితంలో కష్టపడి పని చేస్తారు. తమకు ఎదురయ్యే సవాళ్లను చాలా తెలివిగా ఎదుర్కొనగలరు. ఓటమి వీరికి నచ్చదు. కచ్చితంగా జీవితంలో విజయం సాధిస్తారు. వీరిలో ఉన్న మరో స్పెషల్ టాలెంట్ ఏమిటంటే... ఒకేసారి నాలుగైదు పనులు చేయగలరు.