Mars Transit: ఈ రాశులకు పెరగనున్న కుజ బలం.... అదృష్టం జేబులో పెట్టుకొని తిరిగినట్లే..!
Mars Transit: కొత్త సంవత్సరంలో కుజ గ్రహ సంచారం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తీసుకురానుంది. కుజుడు బలం పెరిగితే... పట్టిందల్లా బంగారమే అవుతుంది. శని కారణంగా పడిన కష్టాలన్నీ తీరిపోతాయి..

Mars Transit
జోతిష్యశాస్త్రంలో కుజుడిని భూమి పుత్రుడు అని పిలుస్తారు. ఈ గ్రహం బలం, ఆత్మవిశ్వాసం, ధైర్యాన్ని సూచిస్తుంది. జాతకంలో ఈ గ్రహం బలంగా ఉంటే, కోరుకున్న వరం లభిస్తుంది. ఎటువంటి సంకోచం లేకుండా పనులు పూర్తి చేసే శక్తి పెరుగుతుంది. ఎందుకంటే కుజుడుని హనుమంతుని దైవంగా పూజిస్తారు. అందువల్ల, ఏ పని శుభప్రదంగా జరగాలన్నా కుజుడి స్థానం చాలా ముఖ్యం. జాతకంలో కుజుడు బలంగా ఉంటే, జీవితంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఇదెలా ఉండగా, 2026 ఏప్రిల్ 2న కుజుడు మీన రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇది అన్ని రాశులపై వేర్వేరు ప్రభావాలను చూపినప్పటికీ, కొన్ని రాశుల వారికి ఊహించని ఫలితాలను ఇస్తుంది. మరి, కుజుడి కారణంగా ఏ రాశుల వారి అదృష్టం రెట్టింపు అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం...
వృషభ రాశి...
కుజుడు వృషభ రాశి 11వ ఇంట్లో, అంటే లాభ స్థానంలో సంచరిస్తుంది. కాబట్టి, 2026 వృషభ రాశివారికి అదృష్టాన్ని తెస్తుంది. ధన ప్రవాహం పెరుగుతుంది. పాత అప్పులు తీరిపోయే అవకాశం ఉంది. పెట్టుబడుల నుంచి మంచి లాభాలు పొందుతారు. అలాగే, ఈ సమయంలో కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. ఉద్యోగంలో పదోన్నతి లేదా జీతం పెరిగే అవకాశాల ఉన్నాయి. వ్యాపారులకు ఇది సువర్ణ అవకాశం. ఎందుకంటే, వారు తమ వ్యాపారాన్ని వస్తరించుకోవడానికి అవకాశాలు పొందుతారు. అలాగే, కుజుడి అనుగ్రహంతో కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది.
కర్కాటక రాశి....
కుజుడు కర్కాటక రాశికి యోగాన్ని ఇచ్చే గ్రహం గా పరిగణిస్తారు. 2026లో కుజ గ్రహం కారణంగా కర్కాటక రాశివారి అదృష్టం రెట్టింపు అవుతుంది. సుదూర ప్రయాణాల ద్వారా లేదా విదేశాలకు సంబంధించిన పనుల ద్వారా మీరు ధనం సంపాదిస్తారు. మీరు మతపరమైన పనుల కోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తారు. ఇది మీ పుణ్య ఫలాలను పెంచుతుంది. ఉద్యోగ అన్వేషణలో ఉన్న వారికి విదేశాలలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. మీ ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది.
వృశ్చిక రాశి...
కుజుడు వృశ్చిక రాశికి అధిపతి. 2026లో ఈ కుజుడు మీ జాతకంలో 5వ ఇంట్లో సంచరిస్తుంది. దీని వల్ల ఈ రాశివారి లైఫ్ శుభప్రదంగా మారుతుంది. ఇది మిమ్మల్ని ఆర్థికంగా బలోపేతం చేస్తుంది. మీరు స్టాక్ మార్కెట్ లేదా వ్యాపారంలో కాస్త జాగ్రత్తగా ఉన్నా లాభాలు పొందవచ్చు. మీ తెలివితేటల, నిర్ణయాత్మక సామర్థ్యం కారణంగా మీరు పనిలో విజయం సాధిస్తారు. కుటుంబంతో కలిసి యాత్రలకు వెళ్లే అవకాశం కూడా ఉంది.
మకర రాశి
కుజుడు మకర రాశి 3వ ఇంట్లో సంచరిస్తున్నాడు. ఇది మకర రాశి వారికి ధైర్యాన్ని, విజయాన్ని అందిస్తుంది. మీరు ఎంత కష్టపడితే... అంత ఎక్కువగా ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. చిన్న పెట్టుబడుల నుంచి కూడా మంచి లాభాలు పొందుతారు. పనిలో మీ పనితీరు మెరుగుపడుతుంది. మీరు పోటీ పరీక్షలు లేదా ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. సహోద్యోగుల నుంచి సహకారం లభిస్తుంది. ఇతరుల నుంచి మీకు మంచి సహకారం లభిస్తుంది.
మీన రాశి...
మీన రాశిలో సంచరించే కుజుడు మీ వ్యక్తిత్వ తేజస్సును పెంచుతాడు. కుజుడు 2వ , 9వ స్థానాలకు అధిపతిగా లగ్నంలో ఉండటం వల్ల ధన యోగం ఏర్పడుతుంది. దీనివల్ల ఊహించని ఆర్థిక లాభాలు , వారసత్వ ఆస్తి లభించే అవకాశం ఉంది. పనిలో మీ నాయకత్వ లక్షణాలు ప్రత్యేకంగా నిలుస్తాయి. మీకు కొత్త ఉద్యోగావకాశాలు లభించవచ్చు. స్వయం ఉపాధి పొందుతున్న వారికి ప్రయోజనాలు ఉంటాయి. మీ జీవిత భాగస్వామితో మంచి సంబంధం ఉంటుంది. కానీ మీ కోపాన్ని నియంత్రించుకోవడం ముఖ్యం. ఆరోగ్యం మెరుగుపడుతుంది.

