Kubera Yogam: ఈరోజు నుంచి ఈ 6 రాశుల వారికి కుబేర యోగం, కోటీశ్వరులయ్యే అవకాశం వీరిదే
జ్యోతిషశాస్త్రం ప్రకారం, గ్రహాల సంచారం, కలయికలు ప్రత్యేక యోగాలను సృష్టిస్తాయి. ఈరోజు నుంచి చంద్రుడు, కుజుడు, గురు గ్రహం వల్ల కుబేర యోగం (Kubera Yogam) ఏర్పడింది. దీని వల్ల ఎన్నో రాశుల వారికి కోటీశ్వరులయ్యే అవకాశాలు ఉన్నాయి.

మేష రాశి
గురు గ్రహం దృష్టిలో కుజ, చంద్రుల కలయిక మేషరాశి వారికి అదృష్ట ద్వారాలు తెరుస్తుంది. ఊహించని మార్గాల్లో వీరికి డబ్బు అధికంగా వచ్చే అవకాశం ఉంది. పెట్టుబడులు లాభాలను తెచ్చి పెడతాయి. వ్యాపార రంగాల్లో కూడా ఆదాయం రెట్టింపు అవుతుంది. అప్పులను సులువుగా తీరుస్తారు.
మిథున రాశి
చంద్ర, కుజ యోగం బలంగా ఉండడం వల్ల మిథున రాశికి కలిసి వస్తుంది. దీనితో మిథునరాశి వారు తమ ప్రతిభ, నైపుణ్యాలను ఉపయోగించి కొత్త ఆదాయ మార్గాలను పొందగలుగుతారు. షేర్లు, పెట్టుబడులు, భూ సంబంధిత లావాదేవీలలో లాభాలు పొందుతారు. ఆస్తి కొనుగోలు, అమ్మకాలలో శుభ ఫలితాలు కనిపిస్తాయి.
కన్యా రాశి
కుబేర యోగం కన్యారాశి వారికి అధికంగా కలిసి వస్తుంది. ముఖ్యంగా ఉద్యోగ రంగంలో ఉన్నవారు శుభవార్తలను వినే అవకాశం ఉంది. ఉన్నత పదవులు దక్కుతాయి. విదేశీ అవకాశాలు పెరగవచ్చు. కుటుంబ ఆస్తికి సంబంధించిన వివాదాలు పరిష్కారమవుతాయి.
తులా రాశి
తులారాశిలోనే చంద్ర కుజ యోగం ఏర్పడుతుంది. ఈ రాశి వారు మరింత శక్తివంతంగా మారుతారు. గురు దృష్టి భాగ్యస్థానంపై ఉండటం వల్ల వీరి ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగస్తులకు జీతం పెరుగుతుంది, వ్యాపార ఒప్పందాలు కుదురుతాయి, పెట్టుబడులు లాభాలను ఇస్తాయి. ఊహించని మార్గాల నుంచి డబ్బు అందే అవకాశం ఉంది.
ధనూ రాశి
ధనూ రాశి వారికి లాభ స్థానంలో ఏర్పడిన చంద్ర-కుజ యోగం ఏర్పడింది. ఇది వారికి మంచి ఫలితాలను ఇస్తుంది. ఊహించని విధంగా ఆదాయం వస్తుంది. షేర్ వ్యాపారాలు అంచనాలకు మించి లాభదాయకంగా ఉంటాయి. వ్యాపారాలు బాగా వృద్ధి చెందుతాయి.
కుంభ రాశి
కుబేర యోగం కుంభరాశి వారికి శ్రమలేని సంపదను తెస్తుంది. ఉద్యోగస్తులకు జీతం పెరుగుతుంది. పెట్టుబడులు, వ్యాపారాలు మంచి ఫలితాలను ఇస్తాయి. కొత్త ఆదాయ మార్గాలు అందుబాటులోకి వస్తాయి.