MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Romanchakam Movie Review
Ayodhya Ram Mandir CEO
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Astrology
  • Eclipses 2025: మార్చిలో 2 గ్రహణాలు, భారత్ పై వాటి ప్రభావం ఎంతంటే?

Eclipses 2025: మార్చిలో 2 గ్రహణాలు, భారత్ పై వాటి ప్రభావం ఎంతంటే?

తెలుగు సంస్కృతిలో గ్రహణాలకు చాలా ప్రాధాన్యం ఉంది. గ్రహణాల టైంలో చాలామంది తినడం, తాగడం కూడా మానేస్తుంటారు. అయితే ఈ ఏడాది మార్చి నెలలో 15 రోజుల్లోనే 2 గ్రహణాలు సంభవించనున్నాయి. మరి భారత్ పై వీటి ప్రభావం ఎలా ఉంటుందో ఇక్కడ చూద్దాం.

1 Min read
Author : Kavitha G
Published : Mar 06 2025, 03:38 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ఈ మార్చిలో ప్రపంచం ఓ అద్భుతమైన ఖగోళ దృశ్యాన్ని చూడనుంది. 15 రోజుల్లో రెండు గ్రహణాలు సంభవించనున్నాయి. మొదటిది చంద్రగ్రహణం, రెండోది సూర్యగ్రహణం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ రెండు చాలా ముఖ్యమైనవి. మరి ఏ తేదీల్లో గ్రహణాలు వస్తున్నాయి. వాటి ప్రభావం ఎలా ఉండబోతోందో ఇప్పుడు తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
చంద్రగ్రహణం ఎప్పుడు?

చంద్రగ్రహణం ఎప్పుడు?

ఈ ఏడాదిలో మొదటి చంద్రగ్రహణం మార్చి 14 హోలీ రోజున రానుంది. ఇది ఉదయం 9:29 గంటలకు మొదలై.. మధ్యాహ్నం 3.29 గంటలకు ముగుస్తుంది. అయితే ఈ చంద్రగ్రహణం మన దేశంలో కనిపించదు. ఆస్ట్రేలియా, యూరప్, ఆఫ్రికాలో కొన్ని చోట్ల కనిపిస్తుంది.

35
సూర్యగ్రహణం ఎప్పుడు?

సూర్యగ్రహణం ఎప్పుడు?

మొదటి సూర్యగ్రహణం మార్చి 29, చైత్ర అమావాస్య రోజున వస్తుంది. ఇది మధ్యాహ్నం 2:20 గంటలకు మొదలవుతుంది. ఈ సూర్యగ్రహణం కూడా మనకు కనిపించదు. ఆస్ట్రేలియా, ఆసియా, హిందూ మహాసముద్రంలో కనిపిస్తుంది.

45
గ్రహణాల ప్రభావం?

గ్రహణాల ప్రభావం?

సాధారణంగా గ్రహణ సమయంలో హిందువులు సూతక నియమాలు పాటిస్తుంటారు. కొన్ని పనులు చేయకూడదని నమ్ముతారు. అయితే ఈ రెండు గ్రహణాలు మనకు కనిపించవు. కాబట్టి ఎలాంటి ప్రభావం ఉండదని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. సూతక నియమాలు పాటించాల్సిన అవసరం లేదంటున్నారు.

55

మార్చిలో సంభవించనున్న రెండూ గ్రహణాలు భారత్ లో కనిపించకపోయినా ఈ అరుదైన దృశ్యాన్ని చూసేందుకు ప్రపంచం ఎదురు చూస్తోంది. శాస్త్రవేత్తల పరిశోధనలకు, అంతరిక్షం గురించి మరింత తెలుసుకునేందుకు ఇవి ఎంతగానో ఉపయోగపడనున్నాయి.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు డబ్బు విషయంలో ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు!
Recommended image2
Moon Jupiter Conjunction: 4 రోజులు ఓపిక పడితే చాలు.. ఈ 5 రాశులవారికి గోల్డెన్ టైమ్ స్టార్ట్!
Recommended image3
Rahu Kuja Transit: ఈ 4 రాశుల వారు సరిగ్గా 17 రోజుల్లోపు శుభవార్త వినే అవకాశం, మీ రాశి ఉందా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved