Monthly Horoscope: మార్చి నెల రాశిఫలాలు.. ఓ రాశివారికి ధనాదాయం..!
ఈ నెల రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ నెలలో చక్కటి ధనాదాయం కొనసాగును. అన్ని విధములా ఈ మాసం కలసి వచ్చును. ఇష్ట దేవాలయ దర్శన, కుటుంబంలోని పెద్ద వయస్సు వారి ఆరోగ్య సమస్యలు తగ్గుట.
మేషరాశి (Aries) అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి :- ఈ నెలలో మిశ్రమ ఫలితాలు పొందుతారు. వ్యక్తిగత విషయాలలో కొద్దిపాటి మానసిక ఆందోళన లేదా నమ్మిన వారి వలన మోసం, ధన వ్యయం వంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు. జీవిత భాగస్వామి నుండి ఆశించిన సహకారం లభించదు. ద్వితీయ మరియు తృతీయ వారంలో ఆరోగ్య సమస్యలు పొందుటకు సూచనలు ఉన్నవి. 22 వ తేదీ తదుపరి నూతన ఆలోచనలు కార్యరూపం దాల్చును. ముఖ్యంగా 26, 27, 28 మరియు 29 తేదీలలో శుభ ఫలితాలు లభించుటకు అవకాశం ఉన్నది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
వృషభరాశి ( Taurus) కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి :- ఈ నెలలో అంతగా అనుకూల ఫలితాలు ఏర్పడవు. ఉద్యోగ జీవన పరంగా ఆందోళన కలిగించు వాతావరణం ఏర్పడును. ఆకస్మిక వివాదాలు భాదించును మరియు ధనాదాయం తగ్గును. బంధు వర్గం వలన వ్యక్తిగత జీవనంలో ఒత్తిడులు ఎదురగును. ఆశించిన విధంగా సహకారం లభించదు. చివరి వారంలో చికాకులు అధికం అగును. గృహ నిర్మాణ విషయాలలో వ్యయం అధికం అగును. ఈ మాసంలో 3,16,17,25 తేదీలు అనుకూలమైనవి కావు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
మిధునరాశి ( Gemini) మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి :- ఈ నెలలో ధనాదాయం బాగానే ఉండును. సంఘం లో చక్కటి పేరుప్రఖ్యాతలు లభిస్తాయి. తోటి ఉగ్యోగుల మధ్య గౌరవం పొందుతారు. నూతన ఆదాయ మార్గములు లభిస్తాయి. శతృ జయం లభిస్తుంది. శత్రువులు కూడా మీకు విధేయులుగా మారతారు. అన్ని విషయములందు విజయములు పొందుతారు. సంతాన సంబంధ శుభ వార్తలు వినుదురు. మీ అంచనాలు నిజమగును. ఈ మాసంలో చేయు ప్రయనములందు చిన్నపాటి ఆరోగ్య సమస్యలు ఎదురగును. కుటుంబంలో ఆర్భాటాలకు పోకుండా ఉండుట మంచిది. గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
కర్కాటకరాశి ( Cancer) పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి :- ఈ నెలలో వ్యాపారములో లాభములు పెరుగును. చక్కటి ప్రోత్సాహం లభించును. పోటీ దారులు తొలగును. ఆశించిన ప్రభుత్వ కాంట్రాక్టులు లభించును. ప్రధమ వారంలో కళత్ర సంబంధ అనారోగ్యం వలన మనస్తాపం అనుభవిస్తారు. మిత్రుల సహకారంతో కెరీర్ పరంగా వృద్ధి లభించును. ద్వితియ వారంలో ఆకస్మిక ధన వ్యయములు , విదేశీ ఉద్యోగ ప్రయత్నాలలో జాప్యం మరియు ప్రభుత్వ సంబంధ అడ్డంకులు ఎదుర్కొందురు. తృతీయ వారం నుండి మాసాంతం వరకూ సామాన్య ఫలితాలు ఏర్పడును. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
సింహరాశి (Leo) మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి :- ఈ నెలలో కళత్ర మూలకంగా సంతోషకరమైన వాతావరణం అనుభవిస్తారు. నూతన వ్యక్తుల పరిచయాలు. లేదా నూతన వస్తువల అమరిక లాభిస్తుంది. వివాహాది ప్రయత్నాలలో కదలిక ఏర్పడుతుంది. ఈ మాసంలో ధనాదాయం సామాన్యం. రాజకీయవర్గంలోని వారికి అవమానములు లేదా అప్రతిష్టలు ఏర్పడును. భూ సంబంధ లావాదేవీలు ఆశించిన విధంగా ముగియవు. ఆశలకు భిన్నంగా ఉండును. తృతీయ వారం నుండి గృహంలో శుభకార్య సంభదమైన వ్యయం. వ్యయములకు అవసరమగు ధనం సకాలంలో లభించును. ఈ మాసంలో 5,7,14,20,21,25 తేదీలు వ్యక్తిగత వ్యవహారాలకు అనుకూలమైనవి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
కన్యారాశి ( Virgo) ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి :- ఈ నెలలో ధనాదాయం సామాన్యం. జీవిత భాగస్వామికి ఆరోగ్య సమస్యలు. స్త్రీలకు గర్భ సంబంధమైన అనారోగ్య సమస్యలు. రావలసిన ధనం సమయానికి అందుట కష్టం. మాసం మధ్య నుండి వృత్తి వ్యాపారములలో అనుకూలత ప్రారంభం అగును. సంతాన ప్రయత్నములు దైవ ఆశీస్శులతో విజయం పొందును. ఆర్ధిక విషయాలలో అనుకూలత ఏర్పడును స్థానచలన ప్రయత్నాలు చివరి నిమిషంలో విఫలం అగును. కుటుంబ భవిష్యనిధి ఏర్పాటు కు ఈ మాసం మంచి కాలం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
తులారాశి ( Libra) చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి :- ఈ నెలలో నూతన వ్యాపార ఆలోచనలు కార్యరూపం దాల్చును. ఆర్ధిక ఆదాయ పరిస్థితులు కూడా సంతృప్తికరంగా ఉండును. కళత్ర మూలక విషయాల్లో సంతోషాలు ఏర్పడును. ధనం అవసరములకు సర్దుబాటు అగును. ఉద్యోగ జీవులు పదోన్నతి లేదా వేతనంలో పెరుగుదల ఆశించవచ్చు. సంతాన ప్రయత్నములకు ఈ మాసం అంత అనుకూల కాలం కాదు. ఒక ముఖ్యమైన వస్తువు కోల్పోవు సూచన ఉన్నది. స్టాక్ ట్రేడింగ్ వ్యాపారం చేయువారికి బాగా కలసి వచ్చును. 12 సంవత్సరముల లోపు ఉన్న సంతానం ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. రాజకీయ పలుకుబడితో శత్రుబాధలు కొంత వరకూ తగ్గును. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
వృశ్చికరాశి ( Scorpio) విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి :- ఈ నెలలో ప్రధమ వారం సామాన్య ఫలితాలు ఏర్పరచును. ద్వితియ వారంలో ఊహించని విధంగా అపవాదులు భరిస్తారు. అకారణంగా మాటపడుట తీవ్రంగా భాదిస్తుంది. ఈ మాసంలో ఆదాయ వ్యయములు సంతృప్తికరంగా ఉంటాయి. వ్యవహార చిక్కుల వలన కొన్ని కార్యములను మధ్యలోనే విడిచిపెట్టుట చేస్తారు. మాసాంతంలో కుటుంబ సంతోషాలు అనుభవిస్తారు. ఈ మాసంలో 11,12,13 తేదీలు అనుకూలమైనవి కావు. గోమాతకు గ్రాసం పెట్టండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
ధనుస్సురాశి ( Sagittarius) మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి :- ఈ నెలలో శరీర ఆరోగ్యం బాగుండును. బంధు మిత్రుల కలయిక వలన మానసిక ఉల్లాసం పొందుతారు. అతిధి సత్కారములకు ధన వ్యయం ఏర్పడుతుంది. స్థాన చలన ప్రయత్నములకు అనుకూలత ఉంది పనులలో ఆటంకములు తొలగును. అధికారులతో వివాదాలు సద్దుమనుగుతాయి. ధనాదాయం బాగుండును. ఉద్యోగ మార్పిడి ప్రయత్నాలు మాత్రం విఫలం అగును. ఆశించిన ప్రమోషన్లు లభించుట కష్టం. పెద్దల సలహాలు పాటించుట మంచిది. ఈ మాసంలో 15, 22, 23, తేదీలు అంత అనుకూలమైనవి కావు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
మకరరాశి ( Capricorn) ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి :- ఈ నెలలో చక్కటి ధనాదాయం కొనసాగును. అన్ని విధములా ఈ మాసం కలసి వచ్చును. ఇష్ట దేవాలయ దర్శన, కుటుంబంలోని పెద్ద వయస్సు వారి ఆరోగ్య సమస్యలు తగ్గుట. జీవిత భాగస్వామి సౌఖ్యం,. నూతన కార్యములందు ఆశించిన విజయం వంటి అనుకూల ఫలితాలు పొందుతారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతీ రోజూ రావి చెట్టుకు 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అని స్మరిస్తూ 11 ప్రదక్షిణలు చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
కుంభరాశి ( Aquarius) ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి :- ఈ నెలలో గృహంలో శుభకార్య సంబంధ వేడుకలు నిర్వహిస్తారు. సామరస్యంగా సంభాషించాలి. సహా పంక్తి భోజనాలు ఏర్పడతాయి. ముఖ్య కార్యములు పూర్తి చేస్తారు. ఉద్యోగ పరంగా దూర ప్రయాణములు చేయవలసి వచ్చును. ఈ మాసంలో ధనాదాయం సామాన్యం. దూర ప్రాంత విద్య కొరకు చేయు ప్రయత్నములు లాభించును. వంశ పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
మీనరాశి ( Pices) పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి :- ఈ నెలలో స్థానచలనము కొరకు చేయు ప్రయత్నములు లాభించును. స్త్రీ మూలక ధనప్రాప్తి అనుభవిస్తారు. సువర్ణ వ్యాపారములలో ప్రభుత్వ సంబంధ ఇబ్బందులు. 19 వ తేదీ తదుపరి వృధా వ్యయము తరచుగా ఎదుర్కొంటారు. ముఖ్యంగా ఆడంబరాలకు మిక్కిలిగా వ్యయము చేస్తారు. నాలుగవ వారంలో ఉద్యోగ జీవనంలోని వారికి తీవ్ర ఒత్తిడి ఎదురగుతుంది. ఈ మాసంలో 8,15,17,20 తేదీలు అంత అనుకూలమైనవి కావు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
వివరణ: డా. యం. ఎన్. చార్య, ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు, శ్రీమన్నారాయణ ఉపాసకులు, సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక, హైదరాబాద్. ఫోన్: 9440611151