Ketu Gamanam:డిసెంబర్ నుండి ఈ రాశులకు స్వర్ణయుగం స్టార్ట్.. ఎవరూ ఆపలేరు..!
Ketu Gamanam: డిసెంబర్ 5న కేతు గ్రహం కర్కాటక రాశిలోకి అడుగుపెట్టనున్నాడు. అప్పటి నుంచి కొన్ని రాశుల వారి జీవితాలు అద్భుతంగా మారిపోనున్నాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో అద్భుతంగా రాణిస్తారు. పట్టిందల్లా బంగారమే అవుతుంది

1.వృషభ రాశి...
డిసెంబర్ 5 తర్వాత వృషభ రాశి జీవితం స్వర్ణమయం అవుతుంది. ఈ సమయంలో ఈ రాశివారికి కుటుంబంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి, ఆర్థిక స్థిరత్వం పెరుగుతుంది. చాలా కాలంగా ఇల్లు లేదా వాహనం కొనాలని కలలు కంటున్న వారికి తగిన అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది. కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. ఖర్చుల విషయంలో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి. అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంది.
2. మేష రాశి
మేష రాశి వారికి ఈ కాలంలో కెరీర్లో ఎదురవుతున్న అడ్డంకులు పూర్తిగా తొలగిపోయి కొత్త అవకాశాలు తలుపు తడతాయి. ఉద్యోగం మారాలని ప్రయత్నిస్తున్నవారికి ఇది చాలా అనుకూలమైన సమయం కాగా, వ్యాపారస్తులు కొత్త వ్యూహాలతో ముందుకు వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఆర్థిక పరమైన నిర్ణయాలలో ఆచితూచి వ్యవహరించి అనవసర ఖర్చులను తగ్గించుకోవడం ఎంతో మంచిది.
3. మకర రాశి
మకర రాశి వారికి దీర్ఘకాలంగా వేధిస్తున్న సమస్యలన్నింటికీ ఈ కాలంలో తగిన పరిష్కారం లభిస్తుంది. కార్యాలయంలో కొత్త బాధ్యతలు దక్కడంతో పాటు, వ్యాపారవేత్తలు తమ భవిష్యత్తు వృద్ధి కోసం వ్యూహాలను సమీక్షించుకుంటారు. ఆర్థిక భద్రత కోసం తొందరపాటు పెట్టుబడులకు దూరంగా ఉంటూ, పొదుపునకు ప్రాధాన్యత ఇవ్వడం ఈ సమయంలో ముఖ్యం.
4. ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారికి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నవారికి మంచి అవకాశాలు రావడంతో పాటు కొత్త ప్రాజెక్టులపై పనిచేసే అవకాశం లభిస్తుంది. మీ పట్టుదల, నిరంతర కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది. వ్యక్తిగత జీవితంలో కుటుంబ సభ్యులు లేదా మిత్రులతో సహనంతో వ్యవహరిస్తే అందరితో సఖ్యత పెరుగుతుంది.
5. కన్యారాశి
కన్యారాశి వారు కొత్త వ్యక్తులను కలవడం , వృత్తిపరమైన సంబంధాలను విస్తరించుకోవడం ద్వారా మంచి లాభాలను పొందుతారు. ఉద్యోగంలో ఉన్నవారు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి చక్కటి అవకాశాలు లభిస్తాయి. ఆదాయం, వ్యయాల మధ్య సరైన సమతుల్యత పాటిస్తూ ఏదైనా కొత్త పనులను ప్రారంభించడం శ్రేయస్కరం.
6. సింహ రాశి
సింహ రాశి వారికి ఈ కాలం అనేక విధాలుగా మానసిక ప్రశాంతతను, ఊరటను ఇస్తుంది. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు వేగంగా పూర్తవుతాయి. వ్యాపారంలో ఎదురైన సమస్యలు తొలగిపోవడంతో పాటు కొత్త వ్యాపారం ప్రారంభించేందుకు తగిన సన్నాహాలు చేసుకునేందుకు ఇది అనుకూలమైన సమయం.
7. కర్కాటక రాశి
కేతువు రాశి ప్రవేశంతో కర్కాటక రాశి వారి జీవితంలో అనేక సానుకూల పరిణామాలు చోటుచేసుకుంటాయి, దీనివల్ల మానసిక ప్రశాంతత పెరుగుతుంది. భవిష్యత్తుకు ఉపయోగపడేలా చేసే పెట్టుబడులు మంచి లాభాలను తెచ్చిపెడతాయి. ఈ సమయంలో మీరు ఓర్పుతో, విచక్షణతో వ్యవహరిస్తే ఈ కాలాన్ని పూర్తిగా మీసొంతం చేసుకోవచ్చు.

