MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Astrology
  • మహాశివరాత్రి 2024: రాశి ప్రకారం..శివుడిని ఎలా పూజించాలంటే?

మహాశివరాత్రి 2024: రాశి ప్రకారం..శివుడిని ఎలా పూజించాలంటే?

ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసంలో కృష్ణ పక్షం త్రయోదశి నాడు మహా శివరాత్రిని జరుపుకుంటారు. ఈ ఏడాదిలో మార్చి 8వ తేదీ శుక్రవారం నాడు మహాశివరాత్రిని జరుపుకోనున్నారు. హిందూమతంలో మహాశివరాత్రి ఉపవాసానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. కాగా ఈ మహాశివరాత్రి నాడు మీ రాశిచక్రాన్ని బట్టి కొన్ని పరిహారాలు చేస్తే శివానుగ్రహం పొందుతారు.  

2 Min read
Author : Shivaleela Rajamoni
| Updated : Feb 20 2024, 03:58 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

మహా శివరాత్రి కోసం శివ భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అలాగే ఈ రోజున శివుడిని పూజించి నిష్టగా ఉపవాసం ఉంటారు. దీనివల్ల ఆయన అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు. ఈ మహాశివరాత్రి నాడు శివుడు, పార్వతి వివాహం చేసుకున్నారని కూడా నమ్ముతారు. మరి ఈ పవిత్రమైన రోజున రాశిచక్రం ప్రకారం.. ఎలాంటి పరిహారాలు చేస్తే శివానుగ్రహం లభిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

మేషం

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని గంధాన్ని శివుడికి పెట్టి ఎర్రచందనం పువ్వులను శివుడికి సమర్పించాలి. వీటితో పాటు శివాష్టకాన్ని కూడా పఠించొచ్చు.

వృషభ రాశి

వృషభ రాశి వారు మహాశివరాత్రి రోజున శివలింగానికి గంధం, బిల్వపత్రాన్ని సమర్పించాలి. దీనితో పాటుగా శివ చాలీసా పఠించడం కూడా మీకు ప్రయోజనకరంగా ఉంటుంది.

మిథున రాశి

ఈ రాశి వారు శివలింగానికి పూజ చేసి శివలింగంపై ఏడు తెల్లని పువ్వులను సమర్పించండి.  తర్వాత శివ స్తోత్రాన్ని పఠించండి.
 

35
Mahashivratri

Mahashivratri

కర్కాటకరాశి

మహాశివరాత్రి నాడు కర్కాటక రాశి వారు ఆవు పాలతో శివలింగానికి అభిషేకం చేసి శివ సహస్రాన్ని పఠించాలి.

సింహ రాశి

శివారాధన సమయంలో సింహ రాశి వారు పసుపు చందనాన్ని పూయాలి. వీటితో పాటుగా శివ మహిమ స్తోత్రాన్ని కూడా పఠించాలి.

కన్యా రాశి

ఈ రాశి వారు మహాశివరాత్రి సందర్భంగా శివ చాలీసా పఠించాలి. అలాగే శివుని అనుగ్రహం పొందడానికి శివలింగంపై బిల్వ పత్రను సమర్పించండి.
 

45
MahaShivratri

MahaShivratri

తులా రాశి

పూజ సమయంలో శివలింగానికి ఏడు సువాసన గల తెల్లని పువ్వులను సమర్పించండి. అలాగే శివ చాలీసా పఠించండి. ఇలా చేయడం వల్ల జీవితంలో కష్టాలన్నీ మాయం అవుతాయి. 

వృశ్చికరాశి

ఈ రాశివారు శివలింగానికి ఎర్రచందనం చెక్కను, ఏడు ఎర్రచందనం పువ్వులను శివుడికి సమర్పించండి. అలాగే వీలైనంత వరకు 'ఓం నాగేశ్వరాయ నమః' అనే మంత్రాన్ని జపించండి.

ధనుస్సు రాశి

పూజ సమయంలో శివలింగానికి పసుపు పువ్వులు సమర్పించి, మహామృత్యుంజయ స్తోత్రం పఠించండి. ఇలా చేయడం వల్ల శివుని ప్రత్యేక అనుగ్రహం పొందుతారు. 
 

55

మకర రాశి

మహాశివరాత్రి నాడు శివలింగాన్ని పూజిస్తూ వీలైనంత వరకు 'ఓం అర్ధనారీశ్వరాయ నమః' అనే మంత్రాన్ని పఠిస్తే శివుని అనుగ్రహం లభిస్తుంది.

కుంభ రాశి

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని కుంభ రాశి వారు శివలింగానికి త్రిమూర్తుల భస్మాన్ని పూసి అపరాజిత పుష్పాలను సమర్పిస్తారు. దీనితో పాటుగా మీరు మహామృత్యుంజయ కవచాన్ని కూడా పఠించవచ్చు.

మీన రాశి

ఈ రాశి వారు మహాశివరాత్రి రోజున శివుడిని ధ్యానించాలి. దీనితో పాటు 'ఓం అనంతధర్మాయ నమః' అనే మంత్రాన్ని పఠించండి.

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు అవసరానికి చేతికి డబ్బు అందక ఇబ్బంది పడతారు!
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఆశించిన పదవులు.. ఆప్తుల నుంచి శుభవార్తలు!
Recommended image3
Saturn Transit: సొంత నక్షత్రంలోకి శని.. ఈ 4 రాశులవారి కష్టాలకు చెక్, అన్నీ మంచి రోజులే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved