- Home
- Astrology
- Chandra Grahan 2025: రాశులు కాదు.. ఈ నక్షత్రంలో పుట్టిన వారికి కూడా గ్రహణ సమస్యలు తప్పవు..!
Chandra Grahan 2025: రాశులు కాదు.. ఈ నక్షత్రంలో పుట్టిన వారికి కూడా గ్రహణ సమస్యలు తప్పవు..!
చంద్ర గ్రహణం 12 రాశులతో పాటు నక్షత్రాలను కూడా ప్రభావితం చేస్తుంది. మరీ ముఖ్యంగా.. శతబిష, పూర్వాభద్ర, ఆరిద్ర, స్వాతి నక్షత్రాలపై గ్రహణ ప్రభావం చాలా ఎక్కువగా ఉంది.

Chandra Grahan
ఈ ఏడాది రెండో చంద్రగ్రహణం సెప్టెంబర్ 7వ తేదీ ఆదివారం ఏర్పడుతోంది. ఈ రోజున చంద్రుడు ఎరుపు రంగులో కనిపించనున్నాడు. బ్లడ్ మూన్ ని చూడాలని చాలా మంది ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆకాశంలో అరుదుగా వచ్చే ఈ అద్భుతాన్ని చూడటానికి రెండు కళ్లు సరిపోవు. అయితే.. జోతిష్య పరంగా మాత్రం.. ఈ చంద్ర గ్రహణం... కొంత మందికి కీడు చేయనుంది. ఈ గ్రహణం కుంభ రాశిలోని శతబిష నక్షత్రంలో సంభవిస్తోంది. అందుకే.. కొన్ని రాశుల వారినీ, మరి కొన్ని నక్షత్రాల వారిని ఇది చాలా ఎక్కువగా ప్రభావితం చేయనుంది. మరి.. ఈ గ్రహణ దోషం ఏ నక్షత్రాలపై ఎక్కువగా ఉంటుంది? ఏ నక్షత్రాలకు చెందిన వారిపై ఎక్కువ ప్రభావం ఉంటుంది అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం....
నాలుగు నక్షత్రాలు..
చంద్ర గ్రహణం 12 రాశులతో పాటు నక్షత్రాలను కూడా ప్రభావితం చేస్తుంది. మరీ ముఖ్యంగా.. శతబిష, పూర్వాభద్ర, ఆరిద్ర, స్వాతి నక్షత్రాలపై గ్రహణ ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. మరి, ఈ నాలుగు నక్ష్తత్రాలకు చెందిన వారు గ్రహణ దోషం నుంచి బయట పడేందుకు ఏం చేయాలో కచ్చితంగా తెలుసుకోవాల్సిందే.
1.శతభిష నక్షత్రం...
శతభిష నక్షత్రంలో జన్మించిన వారిపై చంద్ర గ్రహణం చాలా చెడు ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది. ఈ రోజున వీరు ఎక్కువగా ఆదయాన్ని కోల్పోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. వ్యాపార వేత్తలు ఊహించని సమస్యలను ఎదుర్కుంటారు. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న పనులు ఇంకాస్త ఆలస్యం అవుతాయి. ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. విదేశాలకు వెళ్లే అవకాశాలు చేతికి అందినట్లే అంది.. చేజారిపోయే అవకాశం ఉంది. కెరీర్ లో పురోగతి ఉండదు. స్టాక్ మార్కెట్, లాటరీ మొదలైన వాటి ద్వారా నష్టపోయే అవకాశం ఉంది.
దోషం పోవాలంటే...
చంద్రుడు వెండిని ఎక్కువగా ఇష్టపడతాడు. కాబట్టి.. గ్రహణ దోషాలు ఉన్నవారు తమ దోషాలను వదిలించుకోవడానికి వెండి దీపం, బియ్యాన్ని దానం చేయాలి. లేదంటే.. మీ సామర్థ్యానికి తగినట్లు దానం చేయాలి. గ్రహణ శాంతిలో పాల్గొనడం చాలా శుభప్రదం. గుడికి వెళ్లి.. ఏదైనా శాంతి పూజ చేయించుకోవచ్చు.
2.పూర్వాభద్ర నక్షత్రం...
పూర్వాభద్ర నక్షత్రానికి చెందిన వారు కూడా చంద్రగ్రహణం సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ నక్షత్రానికి చెందిన వారిపై గ్రహణం చెడు ప్రభావాన్ని చూపుతుంది. అందువలన, మీకు సమాజంలో గౌరవం తగ్గుతుంది. ప్రతి పనిలో విజయం సాధించడం కష్టం. ఆనందం, సంపద తగ్గుతుంది. కుటుంబ సభ్యులతో సంబంధాలు క్షీణిస్తాయి. జీవిత భాగస్వామితో సంబంధాలు కూడా క్షీణిస్తాయి. అదనంగా, పనిచేసే వారికి ప్రమోషన్లు కోల్పోవచ్చు. పెళ్లికాని వారికి పెళ్లి మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.
కాబట్టి, గ్రహణ దోషాలు ఉన్నవారు దోషాలను తొలగించడానికి చంద్ర దేవుడిని పూజించాలి. దేవాలయాలలో పూజించడం చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. గ్రహణానికి ముందు లేదా తరువాత చంద్ర దేవుడిని పూజించండి. ఇది మీ అన్ని కష్టాలను తొలగిస్తుందని జ్యోతిష్కులు అంటున్నారు.
3.ఆరుద్ర నక్షత్రం...
ఆరుద్ర నక్షత్రానికి చెందిన వారు కూడా చంద్రగ్రహణం సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో చేసే ఏ పని అయినా విజయవంతం కాదు. అపజయాలు ఎదుర్కోవలసి వస్తుంది. వ్యాపారం, వాణిజ్యం , పరిశ్రమలలో నష్టం జరిగే అవకాశం ఉంది. మీరు పని, వ్యాపారం కోసం ప్రయాణించాల్సి రావచ్చు. కానీ ప్రయాణించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఈ ప్రయాణం లాభాల కంటే నష్టాలను ఎక్కువగా తెస్తుంది. ఈ సమయంలో ఆరోగ్య సమస్యలు పెరగవచ్చు. రుణాలు తీసుకునే పరిస్థితి ఉంటుంది. ఇంట్లో శాంతి లేని జీవితం ఉంటుంది.
గ్రహణ దోషం తొలగిపోవడానికి ఈ సమయంలో వెండి ఉంగరం ధరించడం చాలా శుభ ఫలితాలను ఇస్తుంది. ఇది గ్రహణ దోషాన్ని తగ్గిస్తుంది. సమస్యలను కూడా పరిష్కరిస్తుంది.
4. స్వాతి నక్షత్రం
స్వాతి నక్షత్రంలో జన్మించిన వారికి చంద్రగ్రహణం మంచిది కాదు. ఈ గ్రహణం ప్రభావం వల్ల మీరు అనేక సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు. మీ జీవిత భాగస్వామి, బంధువులతో వివాదాలు, మీ కెరీర్‌లో సమస్యలు, చికాకులు , వ్యాపారంలో నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి, జాగ్రత్తగా ఉండటం మంచిది. ఎట్టి పరిస్థితుల్లోనూ డబ్బు అప్పుగా తీసుకోకండి లేదా డబ్బు ఇవ్వకండి. ఇది శుభప్రదం కాదు. గ్రహణం ప్రభావాల నుండి ఉపశమనం పొందడానికి ఈ రోజున దానం చేయడం చాలా మంచిది. ఈ సమయంలో మీరు వీలైనంత సహాయం చేస్తే, మీరు ప్రభావాల నుండి ఉపశమనం పొందుతారు.