Lunar Eclipse: కుంభ రాశిలో చంద్ర గ్రహణం..ఈ ఐదు రాశులకు పట్టిందల్లా బంగారమే
భాద్రపద పౌర్ణమి రోజున కుంభ రాశిలో చంద్ర గ్రహణం సంభవించబోతోంది. అది కూడా సెప్టెంబర్ 7వ తేదీన జరగనుంది.

lunar Eclipse
జోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు తరచుగా మారుతూనే ఉంటాయి. గ్రహాలు రెగ్యులర్ గా తమ రాశులను మార్చుకుంటూనే ఉంటాయి. ఈ మార్పులు కారణంగా వివిధ యోగాలు ఏర్పడుతూ ఉంటాయి. దీని కారణంగా, కొన్ని రాశులకు కొన్ని ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంటుంది. మరి కొన్ని రాశులకు నష్టం కూడా జరగొచ్చు. కాగా.. ఈ సారి, భాద్రపద పౌర్ణమి రోజున కుంభ రాశిలో చంద్ర గ్రహణం సంభవించబోతోంది. అది కూడా సెప్టెంబర్ 7వ తేదీన జరగనుంది. మరి... ఈ చంద్ర గ్రహణం.. ఏ రాశులపై ఎలాంటి ప్రభావం చూపించనుందో ఇప్పుడు తెలుసుకుందాం...
1.మిథున రాశి...
సెప్టెంబర్ 7వ తేదీన ఏర్పడుతున్న చంద్ర గ్రహణం మిథున రాశివారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ రాశివారికి వ్యాపారంలో మంచి పురోగతి ఉంటుంది. ఈ ఏడాది చివరి సమయం మిథున రాశి వారికి పాజిటివ్ గా మారనుంది. ఆదాయం సంపాదించుకోవడానికి మీరు కొత్త మార్గాలను కనుగొంటారు. మీరు మీ లక్ష్యాలను సాధించడంలో విజయం సాధిస్తారు. మీరు విద్యలో కూడా మంచి ఫలితాలను పొందుతారు.
2.కర్కాటక రాశి..
కర్కాటక రాశి వారికి చంద్ర గ్రహణం చాలా మేలు చేయనుంది. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తి చేయగలరు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వ్యాపారంలో పురోగతి చూస్తారు. లాభాలు ఎక్కువగా వస్తాయి. కొత్త ప్రాజెక్టులు విజయవంతమౌతాయి.
3.వృశ్చిక రాశి...
వృశ్చిక రాశి వారికి ఈ కాలం అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో, కుటుంబ సంబంధాలలో మెరుగుదల ఉంటుంది. మీ గందరగోళాలు అన్నీ తీరిపోతాయి. సమస్యలన్నీ పరిష్కరించుకోగలరు. మీ పిల్లల నుండి మీకు శుభవార్త అందుతుంది.
4.ధనస్సు రాశి...
ధనుస్సు రాశి వారికి చంద్రగ్రహణం వల్ల ప్రయోజనం చేకూరుతుంది. మీ కెరీర్‌లో కొత్త శిఖరాలను చేరుకోవడానికి మీకు అవకాశాలు లభిస్తాయి. మీ వివాహ జీవితంలో సమస్యలు తొలగిపోతాయి. ఆధ్యాత్మికతపై మీ ఆసక్తి పెరుగుతుంది. ఇది మీకు సరైన మార్గాన్ని చూపుతుంది.
5.మకర రాశి...
మకర రాశి వారి జీవితంలో మార్పులు వస్తున్నాయి. భాద్రపద పౌర్ణమి నాడు, కుంభ రాశి శనిలో చంద్రగ్రహణం సంభవించబోతోంది. మకర రాశి వారికి దీని వల్ల ప్రయోజనం కలుగుతుంది. మీకు ఆర్థిక సహాయం లభిస్తుంది. మీ వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. ఈ సమయంలో, శని రాశిలో చంద్రగ్రహణం జీవితంలో పురోగతిని తెస్తుంది.