చంద్రగ్రహణం...ఏ రాశివారిపై ప్రభావం చూపిస్తుందో తెలుసా?
గ్రంధాల ప్రకారం చంద్రగ్రహణం సమయంలో రాహువు ప్రభావం పెరుగుతుంది. ఈ సంవత్సరం శరద్ పూర్ణిమ 2 రాశుల వారికి ప్రత్యేకంగా మంచిది కాదు. ఆ రాశులేంటో ఓసారి చూద్దాం....
chandra grahan 2023 rashifal
ఈసారి శరద్ పూర్ణిమ నాడు చంద్రగ్రహణం ఏర్పడనుంది. అక్టోబరు 28న చంద్రగ్రహణం ఏర్పడనుంది. గ్రంధాల ప్రకారం చంద్రగ్రహణం సమయంలో రాహువు ప్రభావం పెరుగుతుంది. ఈ సంవత్సరం శరద్ పూర్ణిమ 2 రాశుల వారికి ప్రత్యేకంగా మంచిది కాదు. ఆ రాశులేంటో ఓసారి చూద్దాం....
telugu astrology
మేషరాశి..
అక్టోబర్ 28వ తేదీ ఉదయం 7:31 గంటలకు చంద్రుడు మీనరాశిని విడిచి మేషరాశిలోకి ప్రవేశిస్తాడు. గ్రహణ సమయంలో చంద్రుడు మేషరాశిలో ఉంటాడు. మళ్ళీ ఈ రాశి లగ్నంలో రాహువు ఉన్నాడు. చంద్రగ్రహణం సమయంలో ఈ రెండు గ్రహాల కలయిక మేషరాశి వారికి శ్రేయస్కరం కాదు. మేషరాశి వారికి మానసిక ఆలోచన పెరుగుతుంది. ఈ రాశి వారు తమ మాటలను అదుపులో ఉంచుకోవాలి. తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకండి
telugu astrology
కర్కాటక రాశి..
చంద్రగ్రహణం కర్కాటకరాశిని ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. అనవసర ఆందోళనలు పెరగవచ్చు. మనసులో ద్వేషం రావచ్చు. ఎవరితోనైనా గొడవలు జరిగే అవకాశం ఉంది. ఈ రాశి వారు పెద్ద నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి. జాగ్రత్తగా ఉండాలి. కర్కాటక గ్రహణం సమయంలో మహామృత్యుంజయ మంత్రాన్ని జపించాలి.