- Home
- Astrology
- Zodiac Signs: శివుడికి ఇష్టమైన రాశులు ఇవే, 40 ఏళ్ల తర్వాత ఈ రాశుల జీవితంలో ఊహించని మార్పులు..!
Zodiac Signs: శివుడికి ఇష్టమైన రాశులు ఇవే, 40 ఏళ్ల తర్వాత ఈ రాశుల జీవితంలో ఊహించని మార్పులు..!
Zodiac Signs:పరమ శివుని అనుగ్రహం ఉంటే జీవితంలో ఎలాంటి కష్టాలైనా మంచులా కరిగిపోతాయి. మరి, జోతిష్య శాస్త్రం ప్రకారం... ఏరాశుల్లో పుట్టిన వారిపై ఆ శివయ్య అనుగ్రహం ఉంటుందో ఇప్పుడు చూద్దాం...

మేష రాశి :
మేష రాశికి అధిపతి కుజుడు. ఈ రాశి వారికి సహజంగానే ధైర్యం, పట్టుదల ఎక్కువగా ఉంటాయి. జ్యోతిష్య నిపుణుల ప్రకారం, మేష రాశి వారిపై పరమశివుడి ప్రత్యేక కటాక్షం ఉంటుంది. వీరి జీవితంలో ఒక ఆసక్తికరమైన మార్పు కనిపిస్తుంది.ముఖ్యంగా వీరు 40 ఏళ్లు దాటిన తర్వాత ఆధ్యాత్మికత వైపు ఎక్కువగా ఆకర్షితులై, పరమశివుడికి భక్తులుగా మారిపోతారు. శివారాధన వల్ల వీరికి ఎదురయ్యే ఆటంకాలు తొలగిపోయి, జీవితంలో స్థిరత్వం, మానసిక ప్రశాంతత లభిస్తాయి.
కర్కాటక రాశి :
కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. ఆ చంద్రుడిని పరమశివుడు తన జటాజూటంలో ధరించాడు. కాబట్టి, కర్కాటక రాశి వారంటే మహాదేవుడికి ఎంతో ఇష్టం. వీరు చాలా సున్నిత మనస్కులు, దయాగుణం కలవారు. వీరిపై శివుని ఆశీస్సులు నిరంతరం ఉంటాయి. ఎలాంటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా, దైవబలంతో వాటిని సులభంగా అధిగమిస్తారు. సోమవారం నాడు శివుడికి అభిషేకం చేయడం వల్ల వీరికి అదృష్టం రెట్టింపు అవుతుంది.
కన్య రాశి :
కన్య రాశి వారు క్రమశిక్షణకు, కష్టపడే తత్వానికి మారుపేరు. వీరి నిజాయితీ, సేవాభావం అంటే ఆ శివుడికి ఎంతో ప్రీతి. కన్య రాశి వారిపై శివుని అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండటం వల్ల వీరు చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. ఆర్థిక సమస్యలు వీరిని ఎక్కువ కాలం వేధించవు. మహాదేవుడి కృపతో వీరికి సమాజంలో మంచి గౌరవ మర్యాదలు లభిస్తాయి.
కుంభ రాశి :
కుంభ రాశికి అధిపతి శని దేవుడు. శని దేవుడికి పరమశివుడే గురువు కాబట్టి, కుంభ రాశి వారిపై కూడా మహాదేవుడి ప్రత్యేక ఆశీస్సులు ఉంటాయి. వీరు ఇతరులకు సహాయం చేయడంలో ముందుంటారు. శివుడి అనుగ్రహం వల్ల వీరికి జీవితంలో ఊహించని విజయాలు, అదృష్టం కలిసి వస్తాయి. కష్టకాలంలో వీరికి ఏదో ఒక రూపంలో దైవ సహాయం అందుతూనే ఉంటుంది.
చిన్న పరిహారం: ఈ రాశుల వారు ప్రతి సోమవారం శివాలయానికి వెళ్లి పంచామృతాలతో అభిషేకం చేయడం లేదా 'ఓం నమః శివాయ' పంచాక్షరీ మంత్రాన్ని జపించడం వల్ల జీవితంలో సకల శుభాలు కలుగుతాయి.









