Lord Shiva: శివునికి ఈ 4 రాశుల వారంటే చాలా ఇష్టం, వారిని సమయానికి ఆదుకుంటాడు
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శివుడికి (Shiva) ఇష్టమైన రాశులు (Zodiac Signs) కొన్ని ఉన్నాయి. ఈ రాశుల వారిని శివుడు అవసరమైన సమయంలో ఆదుకుంటాడు. వారికి అండగా ఉంటాడు. ఇంతకీ ఆ రాశులేవో తెలుసా?

శివుడికి అత్యంత ఇష్టమైన రాశులు
జ్యోతిష్యం ప్రకారం ప్రతి దేవుడికి ఇష్టమైన రాశులు కొన్ని ఉంటాయి. అలా శివుడికి ఇష్టమైన రాశులు కూడా ఉన్నాయి. శివుడికి ఇష్టమైన రాశులు వారు ఆధ్యాత్మికత, ప్రశాంతత, సత్యం వంటి లక్షణాలను కలిగి ఉంటారు. అలాంటి వారినే శివుడు ఇష్టపడతారు. శివుని లక్షణాలతో సరిపోయే రాశులు శివుడికి ఇష్టమైన రాశులుగా నిలిచాయి. అవేంటో తెలుసుకోండి.
మీన రాశి
మీన రాశి వారిపై గురువు ప్రభావం అధికం. గురువు ధ్యాన రూపంలో ఉంటాడు. మోక్షాన్ని అందిస్తాడు. అతడిని శివుని అవతారంగా భావిస్తారు. గురు గ్రహం పాలించే మీన రాశి శివుడికి ఇష్టమైన రాశులలో ఒకటి. మీన రాశి వారు దయగలవారు. ఇతరులకు సహాయం చేసే మనస్తత్వం కలిగి ఉంటారు. ఈ రాశి వారు శివపూజ, ధ్యానం, శివ మంత్రాలను జపించడం ద్వారా శివుని అనుగ్రహాన్ని పొందవచ్చు.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశిపై కుజుని ప్రభావం ఎక్కువ. వీరు అంతర్గత మార్పు, ఆధ్యాత్మిక అన్వేషణతో సంబంధం కలిగి ఉంటారు. వృశ్చిక రాశి వారికి భక్తి ఎక్కువ. వారు శివ మంత్రాలను జపించడం, శివుడిని ఆరాధించడం, ఆయనను తలచుకుని ధ్యానం చేయడం ద్వారా ఆధ్యాత్మిక ఉన్నతిని పొందవచ్చు.
మకర రాశి
మకర రాశి వారిపై శని ప్రభావం ఎక్కువ. వీరు చాలా క్రమశిక్షణగా ఉంటారు. కష్టపడి పనిచేయడానికి ఇష్టపడతారు. శనికి శివునిపై భక్తి ఎక్కువ. కాబట్టి మకర రాశి వారు కూడా శివుని అనుగ్రహాన్ని పొందుతారు. మకర రాశి వారు శివుని అనుగ్రహాన్ని పొందడానికి శివాష్టకం, శివతాండవ స్తోత్రం వంటివి జపించాలి. శివాలయం కూర్చుని ధ్యానం చేయాలి.
కుంభ రాశి
కుంభ రాశి వారిపై శని ప్రభావం అధికం. కుంభ రాశి వారు జ్ఞానం, తత్వాన్ని అన్వేషించేవారు. శివుని ఆదియోగి అనే లక్షణం ఈ రాశి వారి జ్ఞాన అన్వేషణ స్వభావంతో సరిపోతుంది. కుంభ రాశి వారు శివుని పురాణాలను చదవడం, వినడం ద్వారా ఆయనతో లోతైన సంబంధాన్ని ఏర్పరచుకోవచ్చు. తద్వారా శివుడి కరుణా కటాక్షాలను పొందవచ్చు.
శివుని అనుగ్రహం పొందడానికి ఏం చేయాలి?
శివుడికి ప్రపంచంలోని అన్ని జీవులు సమానమే. అతని అనుగ్రహం అన్ని రాశులపైనా ఉంటుంది. పైన చెప్పిన రాశులు కాకుండా ఇతర రాశుల వారు కూడా శివుడిని మనస్ఫూర్తిగా ఆరాధించడం ద్వారా అనుగ్రహాన్ని పొందవచ్చు. “ఓం నమశ్శివాయ” మంత్రాన్ని జపించడం అన్ని రాశుల వారికీ మంచిది. మహా శివరాత్రి, ప్రదోష వ్రతాలు చేయాలి. బిల్వ పత్రాలతో అర్చన, పాలాభిషేకం చేయాలి.