MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Lizard astrology : మీపై బల్లి పడితే భయమొద్దు.. ఈ బాడీ పార్ట్ పై పడితే మీకిక లక్ష్మీ కటాక్షమే..!

Lizard astrology : మీపై బల్లి పడితే భయమొద్దు.. ఈ బాడీ పార్ట్ పై పడితే మీకిక లక్ష్మీ కటాక్షమే..!

బల్లి శాస్త్రం ప్రకారం... మన శరీరంపై బల్లి పడితే అది పడిన ప్రదేశాన్ని బట్టి భవిష్యత్తు ఫలితాలుంటాయి. తల, చేయి, కాలు వంటి భాగాలపై పడటం వల్ల కలిగే మంచి చెడులు, వాటికి సులభమైన పరిహారాలను ఈ కథనం వివరిస్తుంది. 

2 Min read
Author : Arun Kumar P
Published : Dec 27 2025, 01:54 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
బల్లి శాస్త్రం ఏం చెబుతోంది..?
Image Credit : Gemini AI

బల్లి శాస్త్రం ఏం చెబుతోంది..?

మన పూర్వీకులు చెప్పిన శాస్త్రాల్లో 'బల్లి శాస్త్రం' చాలా ముఖ్యమైంది. ఇంట్లో తిరిగే బల్లులు మన శరీరంపై పడటాన్ని యాదృచ్ఛికంగా కాకుండా, భవిష్యత్తుకు సంకేతంగా నమ్ముతారు. బల్లి ఎక్కడ పడిందనే దాన్ని బట్టి మంచి ఫలితాలు, హెచ్చరికలు ఉంటాయి. అవేంటో వివరంగా చూద్దాం....

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26
తలపై బల్లి పడితే..
Image Credit : pinterest

తలపై బల్లి పడితే..

తల మీద బల్లి పడితే అది ఒక హెచ్చరికగా భావిస్తారు. అనవసర ఆందోళనలు, ఇతరుల నుంచి వ్యతిరేకత లేదా బంధువుల నుంచి చెడు వార్తలు వినాల్సి రావచ్చు. బల్లి తల మీద కాకుండా జుట్టుపై పడితే, అది మీకు ఏదో ఒక విధంగా మేలు చేస్తుంది. ఇలా మనం నిల్చున్నప్పుడు, లేదా కూర్చున్నప్పుడు బల్లి పడే అవకాశాలుంటాయి.

Related Articles

Related image1
బల్లి అరిస్తే ఇంట్లో శుభమా అశుభమా? బల్లి శకునం లో నిజం ఎంత?
Related image2
దేవుడి ఫొటోల వెనకలా బల్లి కనిపిస్తే..అది మంచి శకునమా..చెడు శకునమా!
36
నుదిటిపై బల్లి పడితే..
Image Credit : Getty

నుదిటిపై బల్లి పడితే..

నుదుటిపై బల్లి పడటం చాలా శ్రేష్ఠం. ఎడమ నుదుటిపై పడితే కీర్తి, కుడి నుదుటిపై పడితే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ముఖంపై పడితే బంధువుల రాకను సూచిస్తుంది. కనుబొమ్మపై పడితే ఉన్నతాధికారుల సహాయం లభిస్తుంది. కళ్ళు, బుగ్గలపై పడితే చిన్న శిక్ష లేదా సమస్యలు రావచ్చు. ఇలా మనం పడుకున్నప్పుడు బల్లి పడే అవకాశాలుంటాయి.

46
చేతులు, కాళ్లపై బల్లి పడితే
Image Credit : Freepik

చేతులు, కాళ్లపై బల్లి పడితే

ఎడమవైపు చేతులు, కాళ్లపై బల్లి పడితే ఆ రోజంతా సంతోషకరమైన వార్తలు వస్తాయి. కుడివైపు పడటం అనారోగ్యాన్ని లేదా ఆరోగ్య సమస్యలను సూచిస్తుందని నమ్ముతారు. పాదంపై పడితే భవిష్యత్తులో మీరు విదేశీ పర్యటన చేసే అవకాశాలు ఉంటాయి.

56
ఛాతిపై బల్లి పడితే...
Image Credit : stockPhoto

ఛాతిపై బల్లి పడితే...

కుడి ఛాతీపై పడితే లాభం, ఎడమ ఛాతీపై పడితే సుఖం కలుగుతుంది. బొడ్డుపై పడితే విలువైన ఆభరణాలు కొనే యోగం కలుగుతుంది. ఎడమ మెడపై పడితే కార్య విజయం, కుడి మెడపై పడితే ఇతరులతో విభేదాలు రావచ్చు. తొడపై పడితే తల్లిదండ్రులకు బాధ కలిగించే పనులు జరగవచ్చు. ఇలా శరీరంపై బల్లి పడే స్థానాన్ని బట్టి మన ఫేట్ మారుతుందట.

66
శరీరంపై బల్లి పడితే పరిహారం..
Image Credit : Kanchi Temple Website

శరీరంపై బల్లి పడితే పరిహారం..

బల్లి పడితే ఆందోళన వద్దు. సులభ పరిహారాలున్నాయి. వెంటనే తలస్నానం చేయాలి. తర్వాత ఇష్టదైవాన్ని పూజించి, చెడు జరగకూడదని ప్రార్థించాలి. కాంచీపురం ఆలయంలోని బంగారం, వెండి బల్లులను తాకడం ఉత్తమ పరిహారం. ఇది దోషాలను తొలగిస్తుంది. ఈ పరిహారాలు నమ్మకాలపై ఆధారపడినవి.

గమనిక : బల్లి శాస్త్రానికి సంబంధించిన వివరాలను ఇంటర్ నెట్ లో లభించిన సమాచారం ఆదాారంగా అందిస్తున్నాం. దీని గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే జ్యోతిష్యులు, పండితులను సంప్రదించండి.  

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
జ్యోతిష్యం
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఊహించని వ్యక్తుల నుంచి డబ్బు సహాయం అందుతుంది!
Recommended image2
Guru gamanam: గురు సంచారంతో ఈ 4 రాశుల వారికి తిప్పలు తప్పవు, అయితే కొన్ని రోజులే
Recommended image3
Weekly Horoscope: ఈ వారం ఓ రాశివారు మంచి మాటతీరుతో అందరినీ ఆకట్టుకుంటారు!
Related Stories
Recommended image1
బల్లి అరిస్తే ఇంట్లో శుభమా అశుభమా? బల్లి శకునం లో నిజం ఎంత?
Recommended image2
దేవుడి ఫొటోల వెనకలా బల్లి కనిపిస్తే..అది మంచి శకునమా..చెడు శకునమా!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved