Ugadi 2022: స్వస్తి శ్రీ శుభకృత్ నామ సంవత్సరం.. తుల రాశి జాతకం
స్వస్తి శ్రీ శుభకృత్ నామ సంవత్సరం లో తుల రాశివారికి సంవత్సరం ఆరంభంలో మరియు చివరలో శని ఐదవ ఇంటిలో సంచరించటం వలన ఈ పరిస్థితులలో కొంత అనుకూలమైన మార్పు వస్తుంది.
Libra
ఈ జాతకాన్ని ప్రముఖ జోతిష్య నిపుణులు గొల్లపెల్లి సంతోష్ కుమార్ శర్మ తెలియజేశారు.
ఓం శ్రీ సాయి జ్యోతిష విద్యాపీఠం, ధర్మపురి, జగిత్యాల జిల్లా.
https://www.onlinejyotish.com
Libra
కుటుంబం
ఈ సంవత్సరం తులా రాశి వారికి మిశ్రమంగా ఉంటుంది. సంవత్సరమంతా గురుగోచారం, సంవత్సరం మధ్యలో శని గోచారం నాలుగవ ఇంట్లో ఉండటం వలన ఈ సమయంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఎంత కష్టపడి పని చేసినప్పటికీ ఫలితం రావడం లో ఆలస్యం అవటమే కాకుండా దానికి తగిన గుర్తింపు కూడా రాకపోవచ్చు. దానివలన మీరు నిరాశా నిస్పృహలకు, అసహనానికి గురి అవుతారు. వృత్తిలో అభివృద్ధి వచ్చినప్పటికీ దాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోలేక పోతుంటారు. అయినప్పటికీ మీకు ఇచ్చిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడానికి కృషి చేస్తారు. దాని కారణంగా కుటుంబ జీవితానికి దూరం అవుతారు. సంవత్సరం ఆరంభంలో మరియు చివరలో శని ఐదవ ఇంటిలో సంచరించటం వలన ఈ పరిస్థితులలో కొంత అనుకూలమైన మార్పు వస్తుంది. గతంలో ఉన్న పని ఒత్తిడి తగ్గి కొంత మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. అయితే గతంలో చేసిన కొన్ని పనుల కారణంగా ఉద్యోగంలో మార్పు జరుగుతుందేమో అనే భయం మిమ్మల్ని వెంటాడుతుంది. ఈ సమయంలో మీరు చేసే పనుల్లో ఆలస్యం తగ్గినప్పటికీ ఈ సమయంలో మిమ్మల్ని మీరు నిరూపించుకునే అవకాశాలు కూడా తగ్గుతాయి. దాని వలన వృత్తిలో అభివృద్ధి కొరకు కొంత కష్టపడాల్సి ఉంటుంది. అంతేకాకుండా మీ సహోద్యోగులు కానీ, మీకు నష్టాలు చేయాలనుకునేవారు కానీ ఈ సమయంలో మీ గురించి చెడుగా ప్రచారం చేసే అవకాశం ఉంటుంది. అటువంటి వారి విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం చేయకూడదు. జూలైలో శని గోచారం తిరిగి నాలుగో ఇంటికి రావటం వలన కొంతకాలంగా తక్కువగా ఉన్న పని ఒత్తిడి మళ్లీ పెరిగే అవకాశం ఉంటుంది. మీరు ఈ సమయంలో పేరు ప్రతిష్టల కొరకు పని చేసే అవకాశం ఉంటుంది. చేసే ప్రతి పనికి గుర్తింపు రావాలని బలమైన కోరికతో పని చేయడం వలన పని పై శ్రద్ధ తగ్గి ఇతర విషయాలపై శ్రద్ధ పెరిగే అవకాశం ఉంటుంది. ఫలితం పై దృష్టి పెట్టకుండా మీరు చేసే పని నిజాయితీగా చేయడం వలన ఈ సమయంలో అనుకూల ఫలితాలు పొందుతారు.
Libra
ఆర్థిక స్థితి
ఈ సంవత్సరం తులా రాశి వారికి ఆర్థిక స్థితి సామాన్యంగా ఉంటుంది. సంవత్సరమంతా గురుగోచారం మధ్యమంగా ఉండటం వలన డబ్బు వచ్చినప్పటికీ అవసరమైన ఖర్చులు ఎక్కువగా చేయటం వలన ఆర్థికంగా ఇబ్బందిపడే అవకాశముంటుంది. జన్మరాశిలో కేతుగోచారం కారణంగా అనవసరమైన ఖర్చులకు, గొప్పలకు పోయి ఎక్కువడబ్బు ఖర్చుచేస్తే ఆర్థికంగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అలాగే కొత్తగా పెట్టే పెట్టుబడుల విషయంలో కూడా జాగ్రత్త అవసరం. సంవత్సర ఆరంభంలో శని దృష్టి లాభ స్థానం పై ఉండటం వలన లాభాలు తగ్గుతాయి అంతేకాకుండా పెట్టుబడులు ద్వారా వచ్చే లాభాలు కూడా గతంలో వచ్చినట్టుగా కాకుండా కొంత తగ్గుతాయి. తిరిగి జులై నుంచి జనవరి మధ్యలో శని గోచారం నాలుగు ఇంటికి మారటం వలన ఖర్చులు తగ్గుముఖం పడతాయి. ఈ సమయంలో ఆరోగ్య విషయంలో, కుటుంబ సభ్యుల కొరకు డబ్బు ఎక్కువగా ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా శుభకార్యాలకు లేదా ఆధ్యాత్మిక కార్యక్రమాలకు కూడా ఈ సమయంలో డబ్బు ఖర్చు పెడతారు. ఈ సంవత్సరమంతా పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది.
Libra
కుటుంబం
కుటుంబ పరంగా ఈ సంవత్సరం మిశ్రమంగా ఉంటుంది. సంవత్సరమంతా గురుగోచారం మరియు రాహుగోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి మీరు పని ఒత్తిడి కారణంగా ఎక్కువ సమయం కుటుంబంతో గడిపే అవకాశం ఉండదు. అంతేకాకుండా భార్యాభర్తల మధ్య లేదా కుటుంబ సభ్యులతో భేదాభిప్రాయాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అనవసరమైన అపోహల కారణంగా వారితో సమస్యలు ఏర్పడవచ్చు. అయితే గురు దృష్టి కుటుంబ స్థానంపై ఉంటుంది కాబట్టి సమస్యలు వచ్చినప్పటికీ వాటిని ధైర్యంగా ఎదుర్కొని పరిష్కరించుకుంటారు. ఈ సంవత్సరం మీరు ఉద్యోగ రీత్యా వేరే ప్రదేశానికి వెళ్లాల్సి వస్తుంది. దాని కారణంగా కొంతకాలం కుటుంబానికి దూరంగా ఉండటం జరుగుతుంది. అలాగే ఏడవ ఇంట రాహువు గోచారం కారణంగా భార్యాభర్తల మధ్య లో అవగాహన లోపిస్తుంది. సంబంధం లేని విషయాల గురించి గొడవలు జరిగే అవకాశం ఉంటుంది అలాగే అహంభావం కారణంగా ఇద్దరి మధ్యలో భేదాభిప్రాయాలు ఏర్పడతాయి. కుటుంబ సభ్యుల సహకారం వలన ఈ సమస్యలు పరిష్కారం అవుతాయి. సంవత్సర ఆరంభంలో మీ సంతానానికి ఆరోగ్య సమస్యలు రావడం కానీ లేదా వారి కారణంగా ఇబ్బందులు రావడం కానీ జరుగుతుంది. దాని కారణంగా మానసిక ఆందోళనకు గురవుతారు. అంతేకుండా కుటుంబ సభ్యుల విషయంలో ఎక్కువ ఆందోళన పడటం అతి జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. దాని కారణంగా కుటుంబ సభ్యులకు మీ పై కొంత చికాకు ఏర్పడటం కానీ లేదా కోపానికి రావడం కానీ జరుగుతుంది. మీ రాశి పై కేతు గోచారం కారణంగా ఇలాంటి భయాలు, ఆందోళనలు ఎక్కువ ఉంటాయి కానీ వీటి విషయంలో ఆందోళన అవసరం లేదు. చాలా వరకు అవి కేవలం భయాలు గానే ఉంటాయి తప్ప నిజాలు కావు.
Libra
ఆరోగ్యం
తులా రాశి వారికి ఈ సంవత్సరం ఆరోగ్యపరంగా సామాన్యంగా ఉంటుంది. సంవత్సరమంతా గురు మరియు రాహు గోచారం అనుకూలంగా లేకపోవటం, సంవత్సరం మధ్యలో శనిగోచారం కూడా అనుకూలంగా లేకపోవటం వలన ఈ సంవత్సరం ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఆహారం విషయంలో అలాగే పని విషయంలో కొంత జాగ్రత్త అవసరం మీ ఉద్యోగం కారణంగా విశ్రాంతి లేకుండా పని చేయాల్సి రావడం అలాగే సమయానికి భోజనం చేయకపోవడం వలన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. మెడ, కడుపు, వెన్నెముక సంబంధ ఆరోగ్య సమస్యలు ఈ సమయంలో ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. సంవత్సరమంతా కేతువు గోచారం జన్మరాశిపై ఉండటం కారణంగా ఈ సమయంలో మానసిక ఆరోగ్య సమస్యలు ఎక్కువ అవుతాయి. డిప్రెషన్ కానీ, ఒంటరితనం అనే భావన కానీ మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. గురు దృష్టి కుటుంబ స్థానంపై ఉండటం వలన మీ కుటుంబం యొక్క సహకారంతో మీ మానసిక ఆరోగ్య సమస్యల నుంచి బయట పడగలుగుతారు. ఈ సమయంలో వీలైనంతవరకూ ఏదో ఒక పనిలో మిమ్మల్ని మీరు నిమగ్నం చేసుకోవడం వలన మానసిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. మీరు ఎంత ధైర్యంగా ఉంటే అంతగా మీ ఆరోగ్యం బాగుంటుంది
Libra Daily Horoscope
వ్యాపారం మరియు స్వయం ఉపాధి
తులా రాశి లో జన్మించిన వ్యాపారస్థులకు ఈ సంవత్సరం మిశ్రమంగా ఉంటుంది. సంవత్సరమంతా మూడు ప్రధాన గ్రహాల గోచారం అనుకూలంగా లేకపోవటం వలన వ్యాపారంలో ఒడిదుడుకులు ఎదుర్కుంటారు. ఈ సంవత్సరం మధ్యకాలంలో శనిగోచారం పంచమ స్థానంలో ఉండి ఏడవ ఇంటిని చూడటం వలన వ్యాపారంలో కొంత తగ్గుదల ఏర్పడుతుంది. మీ భాగస్వామి నుంచి వచ్చే సహాయ సహకారాలు కూడా తగ్గటం వలన లాభాల శాతం తగ్గుతుంది. అంతేకాకుండా ఈ సమయంలో వ్యాపార భాగస్వాములతో మనస్పర్థలు ఏర్పడటం కానీ లేదా వారు విడిపోవడం కానీ జరుగుతుంది. దానివలన మీకు మరింత పని ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో వీలైనంతవరకూ సంయమనం పాటించి ఎదుటివారిని అర్థం చేసుకొని ప్రవర్తించడం వలన చాలా వరకు సమస్యలు తగ్గుముఖం పడతాయి. అంతేకానీ అతి జాగ్రత్త వలన మీ భాగస్వామి మనసు నొప్పించి వారికి దూరంగా ఉండటం వలన వ్యాపారంలో ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. గురు దృష్టి ధన స్థానంపై ఉంటుంది కాబట్టి ఆర్థికంగా కొంత అనుకూలంగా ఉంటుంది. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలి అనుకునేవారు ఈ సంవత్సరం కొద్దిగా జాగ్రత్తగా అన్ని ఆలోచించి ప్రారంభం చేయటం మంచిది సంవత్సరమంతా గురు గోచారం సామాన్యంగా ఉంటుంది కాబట్టి కొత్త పెట్టుబడులకు, వ్యాపార ప్రారంభాలకు అంతగా అనుకూలంగా ఉండదు. సప్తమ స్థానంలో రాహు గోచారం వ్యాపార విషయంలో తెగింపును, పట్టుదలను ఇస్తుంది కానీ అది వ్యాపారంలో లాభాల కంటే నష్టాలను, సమస్యలను ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సమయంలో వ్యాపార విషయంలో పట్టుదలకు పోకుండా ఉండటం మంచిది. ఇతరులు మీకు చేసే నష్టం కంటే మీకు మీకు మీరే చేసుకునే నష్టం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఏ నిర్ణయం అయినా కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిపుణుల లేదా అనుభవజ్ఞుల సలహాల మేరకు నిర్ణయం తీసుకోవటం మంచిది.
Libra Daily Horoscope
స్వయం ఉపాధి ద్వారా జీవనం సాగిస్తున్న వారికి కళాకారులకు ఈ సంవత్సరం మిశ్రమంగా ఉంటుంది. ప్రథమార్ధంలో మంచి అవకాశాలు రావడమే కాకుండా మీ పేరు ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. ఆర్థికంగా కూడా ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. సంవత్సర ఆరంభంలో మరియి చివరలో శని గోచారం 5వ ఇంట్లో ఉండటం అలాగే సంవత్సరమంతా రాహు గోచారం ఏడవ ఇంట ఉండటం వలన అవకాశాల విషయంలో కొంత కష్టపడాల్సి రావచ్చు. ఈ సమయంలో గర్వాన్ని కానీ, అహంకారాన్ని విడిచిపెట్టి ప్రవర్తించాల్సిన అవసరం ఉంటుంది. మీ అహంకారం వలన మీకు వచ్చిన అవకాశాన్ని సరిగ్గా వినియోగించుకోలేక పోవటంతో రావలసిన పేరు ప్రతిష్టల విషయంలో కొంత ఇబ్బంది పడాల్సి వస్తుంది. మీ గురించి తప్పుగా చెప్పేవారు కానీ, మీకు వచ్చిన అవకాశాలను లాగేసుకుని వారు కానీ ఈ సమయంలో ఎక్కువ అవుతారు. అటువంటి వారిని గుర్తించి వారి విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది.
Libra
పరిహారాలు
తులారాశి వారు ఈ సంవత్సరం గురువు, శని, రాహువు మరియు కేతువులకు పరిహార క్రియలు ఆచరించడం మంచిది. దీని వలన ఆరోగ్య విషయంలో, ఉద్యోగ విషయంలో, కుటుంబ విషయంలో మరియు ఆర్థికంగా ఈ గ్రహాలు ఇచ్చే చెడు ప్రభావం ఉంటుంది ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. గురుగ్రహ దోష నివారణకు ప్రతిరోజు గురు స్తోత్ర పారాయణం చేయటం కానీ లేదా గురు చరిత్ర పారాయణం చేయడం మంచిది. లేదా 16,000 సార్లు గురు మంత్ర జపం కానీ, గురు గ్రహ శాంతి హోమం కానీ చేయడం వలన గురువు ఇచ్చే చెడు ఫలితాలు తగ్గుతాయి. శని ఇచ్చే చెడు ప్రభావం తగ్గడానికి ప్రతిరోజు శని స్తోత్ర పారాయణం చేయటం కానీ, లేదా హనుమాన్ స్తోత్ర పారాయణం చేయడం కానీ చేయాలి. లేదా 19,000 సార్లు శని మంత్ర జపం చేయటం కానీ లేదా శని గ్రహ శాంతి హోమం చేయించడం కానీ మంచిది. వీటితో పాటుగా పేదలకు, ముసలి వారికి, వికలాంగులకు సేవ చేయడం వలన కూడా శని శాంతించి అనుకూల ఫలితాలు ఇస్తాడు. రాహు గ్రహ దోష నివారణకు ప్రతిరోజు రాహు స్తోత్ర పారాయణం చేయటం కానీ, దుర్గా స్తోత్రం పారాయణం చేయడం కానీ మంచిది, లేదా 18 వేల సార్లు రాహు మంత్ర జపం చేయటం కానీ లేదా రాహు గ్రహ శాంతి హోమం చేయటం కానీ మంచిది. కేతు గ్రహ దోష నివారణకు ప్రతిరోజు కేతు మంత్ర జపం చేయడం కానీ, గణపతి స్తోత్రం పారాయణం చేయటం కానీ మంచిది. లేదా ఏడువేల సార్లు కేతు జపాన్ని చేయటం కానీ, కేతు గ్రహ శాంతి హోమం చేయటం మంచిది. మీ జాతకంలో పైన చెప్పిన గ్రహాల యొక్క దశ లేదా అంతర్దశలు ఈ సమయములో నడుస్తున్నట్లు అయితే వాటి ప్రభావము అధికంగా ఉంటుంది. పైన చెప్పిన పరిహారములు మీ శక్తి, భక్తి మరియు శ్రద్ధ మేరకు ఏ పరిహారం అయినా పాటించవచ్చు అంతేకానీ చెప్పిన పరిహారములు అన్ని పాటించమని చెప్పడం లేదు. ఈ గ్రహాల పరిహారాలు తో పాటుగా వీలైనంత వరకూ తోచిన విధంగా అవసరం ఉన్నవారికి సేవ చేయడం మంచిది.