MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Astrology
  • Tula Rasi 2024:న్యూఇయర్ లో తుల రాశివారికి అన్ని విధాలుగా కలిసొస్తుంది..!

Tula Rasi 2024:న్యూఇయర్ లో తుల రాశివారికి అన్ని విధాలుగా కలిసొస్తుంది..!

మనమంతా 2024లోకి అడుగుపెట్టబోతున్నాం. మరి ఈ  న్యూ ఇయర్ లో  తుల రాశివారి కి ఎలా ఉంటుందో చూద్దాం. తుల రాశివారికి ఈ ఏడాది   వ్యాపారులకు సంవత్సరం అంతా హెచ్చుతగ్గులు తప్పవు. లాభాలు తక్కువ. ఉద్యోగాల్లో స్థిరం తగ్గుతుంది. ప్రమోషన్‌లు దగ్గరకు వచ్చి మిస్‌ అవుతాయి. మీకు శ్రమకు తగిన లాభం, శ్రమకు తగిన గుర్తింపు అందవు.

2 Min read
Author : ramya Sridhar
Published : Dec 21 2023, 02:55 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

తుల  రాశి వారికి ఈ ఆంగ్ల సంవత్సరం (2024 జనవరి నుంచి 2024 డిసెంబర్) ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఏయే నెలలు కలిసి వస్తుంది...ఎప్పుడు  ఇబ్బందులు ఉంటాయి ... రాశి వార్షిక ఫలాలు లో తెలుసుకుందాం

 
తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
నామ నక్షత్రములు
 (రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)

గురు:- ఏప్రిల్ నెలాఖరు వరకు కళత్ర స్థానంలో సంచరించి మే నెల నుండి అష్టమ స్థానంలో సంచారము.

శని:- ఈ సంవత్సరమంతా పంచమ స్థానంలో సంచారము.

రాహు:-ఈ సంవత్సరమంతా షష్టమ  స్థానంలో సంచారము

కేతు:-ఈ సంవత్సరమంతా  వ్యయ స్థానంలో సంచారము

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

ఈ రాశి వారికి కొత్త ఏడాదిలో ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఎక్కువ ఆదాయాన్ని పెంచుకునేందుకు మంచి అవకాశాలొస్తాయి. అయితే ఆర్థిక లావాదేవీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశి వ్యాపారస్తులకు 2024 వ్యాపారాభివృద్ధి కలుగును. రైతాంగానికి ఓ మాదిరి ఫలితాలున్నాయి. రాజకీయ నాయకులకు 2024 అన్ని విధాలుగా కలసివచ్చును. విద్యార్థులకు 2024 అనుకూలమైనదే. సినీ, కళారంగం వారికి ఈ సంవత్సరం అద్బుతమైన ఫలితాలు సూచిస్తోంది. అలాగే ఈ సంవత్సరం మీ దృష్టి అంతా పుణ్యకార్యాచరణ లేదా పుణ్యక్షేత్ర సందర్శన మీద ఉంచే అవకాశం ఉంటుంది. దైనందిన కార్యకలాపాలు దైవ దర్శనంతో అద్బుతంగా పూర్తి అవుతాయి. అయితే గ్రహాల   కోర్టు వ్యవహారాల్లో నమ్మకద్రోహానికి గురవుతారు. ఉద్యోగంలో స్థానచలన ప్రయత్నాలలో ప్రత్యేక జాగ్రత్తలు అవసరం. వ్యాపారులకు సంవత్సరం అంతా హెచ్చుతగ్గులు తప్పవు. లాభాలు తక్కువ. ఉద్యోగాల్లో స్థిరం తగ్గుతుంది. ప్రమోషన్‌లు దగ్గరకు వచ్చి మిస్‌ అవుతాయి. మీకు శ్రమకు తగిన లాభం, శ్రమకు తగిన గుర్తింపు అందవు.

34


అయితే సంవత్సర మధ్యలో అనవసర ఆలోచనలు, వృథా కాల క్షేపాల వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. ఆగస్టు నుంచీ ఆరోగ్యపరంగా ఇబ్బందులు వుంటాయి. ధనవ్యయం ఎక్కువగా వుంటుంది.విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో ఉన్నవారికి చాలా ఇబ్బందులతో పనులు పూర్తి అవుతాయి. షేర్‌ వ్యాపారులకు, ఫైనాన్స్‌ వ్యాపారులకు ఈ సంవత్సరం మే నుంచి చాలా చికాకులు ఎదురవుతాయి. విద్యార్థులకు విద్యావ్యాసంగం కంటే ఇతర వ్యవహారాలు ఎక్కువై విద్యాభంగం పొందుతారు. రైతులకు శ్రమ ఎక్కువ అవుతుంది.  అయితే ఆత్మవిశ్వాసంతో పనులు ప్రారంభించి, వేగంగా పూర్తి చేసుకునే వెసులు బాటు దొరుకుతుంది. 

అక్టోబర్ చివరి నుంచి అన్ని అంశాలలోనూ అవరోధాలు తొలగుతాయి. ఉద్యోగంలో చికాకులు వుంటాయి. తెలివిగా సరి చేసుకుంటారు. వ్యాపారంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. పదిమందికీ సాయంచేసి సంఘంలో మంచిపేరు తెచ్చుకుంటారు.  కుటుంబ విషయాలు చాలావరకు మంచి ఫలితాలతో ఉంటాయి. ఖర్చులను నియంత్రించగలుగుతారు. ఉద్యోగం, వ్యాపారం అంతా సాధారణ స్థాయి ఫలితాలతో ఉంటాయి. అభివృద్ధిపథంలో ప్రయాణం సాగుతుందనే చెప్పాలి. ఈ రాశివారికి ఆర్థికపరముగా ప్రథమార్థం మధ్యస్థ ఫలితాలు. ద్వితీయార్థం జూన్‌ నుండి డిశంబర్‌ సమయంలో అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. 2024లో ఆర్థికపరముగా పురోగతిని పొందెదరు. ఆరోగ్య విషయాల కోసం కుటుంబ సమస్యల కోసం ధనాన్ని అధికముగా ఖర్చు చేయాల్సి వచ్చును.

44

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్ధాంతి, స్మార్త పండితులు - గాయత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ విద్యార్థి)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్యలు చెప్పండి ...సాయంత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Zodiac Signs: జీవితాన్ని ఎంజాయ్ చేయడంలో ఈ 5 రాశులవారు టాప్! మీది ఏ రాశి?
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఈ నాలుగు రాశులవారికి విపరీతంగా కలిసివస్తుంది..!
Recommended image3
Weekly Horoscope: 12 రాశుల వారఫలాలు.. గ్రహాల మార్పుతో ఈ వారం ఏ రాశికి కలిసొస్తుందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved