2023లో సింహ రాశివారి రాశిఫలాలు
నూతన సంవత్సరంలో 2023లో సింహ రాశివారి జాతకం ఇలా ఉండనుంది. ఓ నెలలో విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్తలు అవసరం. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. విద్యార్థులు అనవసర వ్యాపకాలు తగ్గించుకుంటే కానీ లక్ష్యాన్ని చేరుకోలేరు, అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి.
ఈ సంవత్సరంలో రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఎలా ఉండబోతోంది? ఎవరికి శుభం జరుగుతుంది.. వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి. ఎవరికి కలిసి వస్తుంది...ఎవరు నష్టపోతున్నారు. మొత్తం రాశుల వారికి ఎలా ఉంటుందో ఈ సంవత్సర ఫలాలు లో తెలుసుకుందాం.
ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.
Vijaya Rama krishna
జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది) 'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం. - ఫోన్: 8523814226 (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)
సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
2023 సంవత్సరంలో ఈ రాశివారి గోచారం పరిశీలించగా ఈ సంవత్సరమంతా పూర్తిగా అనుకూలంగానే ఉంటుందని చెపవచ్చు. కుటుంబ,వృత్తిపరమైన వ్యవహారాలను సమర్థంగా నిర్వహిస్తారు. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. కొన్ని నెలల్లో ధనలాభం ఉంది. చాలా కాలంగా వేధిస్తున్న కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. అధిక ఆదాయంతో విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. గత సమస్యలు కొన్ని పరిష్కారమవుతాయి. పెట్టుబడుల విషయంలో పునరాలోచన మంచిది. స్థిరచరాస్తుల వ్యవహారంలో ఇబ్బందులు తలెత్తుతాయి. వివాహయత్నం ఫలిస్తుంది, అయితే జాతక పొంతన ముఖ్యమని గమనించండి. ఉద్యోగస్తులకు శుభసూచకం. ప్రమోషన్లతో కూడిన బదిలీలుంటాయి. వ్యాపారాలు లాభాల దిశగా సాగుతాయి. నిత్యం దుర్గాదేవిని, సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధిస్తే మంచిది. అనుకూల ఫలితాలుసాధించే అవకాశం ఉంది.
ఈ రాశివారి నెలవారీ ఫలితాలలోకి వెళితే...
జనవరి 2023
ఈ నెలలో అంతా సంతృప్తిగా కనిపిస్తున్నా బంధువర్గంతో కొన్ని విభేదాలుంటాయి, అకారణంగా మాటలు పడాల్సిన సందర్భాలు ఎదరవుతాయి. మీకు రహస్య శత్రువులున్నారు జాగ్రత్త. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్తలు అవసరం. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. విద్యార్థులు అనవసర వ్యాపకాలు తగ్గించుకుంటే కానీ లక్ష్యాన్ని చేరుకోలేరు, అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి. కోర్డు సంబంధిత వ్యవహారాల్లో చిక్కుకున్నవారు పరిష్కారం దిశగా అడుగువేస్తారు
లవ్ లైఫ్ : మీ జీవిత భాగస్వామి తో అన్యోన్యత తగ్గుతుంది. ఇద్దరూ ఒకేమాటపై అడుగేస్తే మాత్రం విజయం సాధిస్తారు. మీకు సంభందం లేని విషయాల గురించి మీరు గొడవపడే అవకాసం ఉంది. అలాంటివాటిని ఉపేక్షిస్తే మంచిది.
ఉద్యోగం-వ్యాపారం: ఉద్యోగస్తులకు ఈ నెల కలిసొస్తుంది. ప్రమోషన్లతో కూడిన బదిలీలుంటాయి. వ్యాపారాలు లాభదాయకంగా సాగుతాయి, హోల్ సేల్ వ్యాపారులు మాత్రం అప్రమత్తంగా ఉండాలి. వైద్య రంగంలో ఉండేవారికి ఆదాయాభివృద్ధి.
ఆరోగ్యం: ఆరోగ్యాన్ని, ఆహారాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. ఎందుకంటే దీర్ఘకాలిక రోగాల బారిన పడే ప్రమాదం ఉంది. అనవసర విషయాలపై ఆసక్తి ప్రదర్శిస్తూ, ఇతరుల వివాదాల్లో తలదూర్చితే మీ ఆరోగ్యం పై దాని ప్రభావం పడుతుంది. ఆ టెన్షన్ మీకు ఇతర ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది.
ఫిబ్రవరి 2023
ఈ నెలలో మిశ్రమ ఫలితాలుంటాయి. మంచి-చెడు, జపం-అపజయం అన్నీ సమానంగా ఉంటాయి. కొందరి వింత ప్రవర్తన గందర గోళానికి గురి చేస్తుంది. కెరీర్‌లో కొత్త దశ ఆనందాన్ని ఇస్తుంది. ఆర్థికంగా సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. మీ చేతిలో డబ్బులు ఎక్కువ రోజులు నిలవకపోవచ్చు. దీంతో కుటుంబ అవసరాలు తీర్చటం కోసం కూడా వెనక అడుగు వేస్తారు. అయితే నెల మధ్యలో మీలోని కొత్త ప్రతిభ బయటపడి, కొత్త ఆలోచనలతో మిమ్మల్ని ఉత్సాహపరుస్తుంది. కెరీర్‌లో కొత్త మలుపులు చోటుచేసుకోవచ్చు.. వృత్తి పరంగా కొన్ని ఘటనలు ఉత్సాహాన్ని పెంచుతాయి. అపమృత్యు భయాన్ని అధిగమించేందుకు నిత్యం మృత్యుంజయ స్తోత్రాన్ని పటిస్తుండండి.
లవ్ లైఫ్: అవివాహితులకు శుభదాయకం. భార్యా భర్తలు అన్యోన్యంగా ఉంటారు. సాంసారిక జీవితం ఏ ఇబ్బందులు లేకుండా సాగిపోతుంది. మీ జీవితంలో కొన్ని మధురమైన క్షణాలను మిగిలుస్తుందీ ఈ నెల.
ఉద్యోగం-వ్యాపారం: వృత్తులు, కార్మికులకు సదవకాశాలు లభిస్తాయి. ఉద్యోగస్తులు అప్రమత్తంగా ఉండాలి. ఒత్తిళ్లు, ధనప్రలోభాలకు లొంగవద్దు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసి వస్తాయి. ఉపాధ్యాయులకు బదిలీలు ఆందోళన కలిగిస్తాయి.
ఆరోగ్యం: తరచు ఆరోగ్య సమస్యలెదురవుతాయి. వైద్య సేవలతో కుదుటపడతారు. ఆ క్రమంలో కొన్ని దీర్గకాల ఆరోగ్య సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. కొత్త పరిచయాలు మీ మానసిక ఉన్నతికి తోడ్పడతాయి. అయితే కొన్ని చికాకులు తలెత్తే ఆస్కారం ఉంది.
మార్చి 2023
ఈ నెలలో గ్రహసంచారం యోగదాయకంగానే ఉంది. కొన్ని సమస్యల నుంచి ఊహించని విధంగా బయటపడతారు. ఆదాయం బాగుంటుంది. చక్కని ప్రణాళికలు వేసుకుంటారు. ఖర్చులు మీ స్తోమతకు తగ్గట్టుగానే ఉండి ఇబ్బంది పెట్టవు. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. బంధువులతో తెగిపోయిన సంబంధాలు బలపడతాయి. పదవులు, బాధ్యతల నుంచి తప్పుకుంటారు. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు అనుకూలం. నగదు, విలువైన వస్తువులు జాగ్రత్త. ఇతరులకు బాధ్యతలు అప్పగించవద్దు.
లవ్ లైఫ్ : సంతానం భవిష్యత్తుపై శ్రద్ధ వహించండి. భార్య,భర్తల మధ్య అనుకూలతలు అంతంత మాత్రమే. మీకుటుంబ జీవనాన్ని మెరుగుపరిచే అవకాశాలు అందినట్టే వెనక్కి వెళ్లిపోతాయి. ఆశావహదృక్పథంతో యత్నాలు సాగించాలి. కార్యసిద్ధికి మరింత శ్రమించాలి.
ఉద్యోగం-వ్యాపారం: ఈ నెల లో ఉద్యోగస్దులకు అనవసరమైన భయాందోళనలు తొలగిపోతాయి. ఆర్థిక పరిస్థితిలో మార్పులుంటాయి. వ్యాపారస్దులు ఋణప్రయత్నాలు చేస్తారు. ఆత్మీయుల సహకారం ఆలస్యంగా లభిస్తుంది. నిరుద్యోగులు కొత్త వార్తలు వింటారు, కలిసొచ్చే కాలం.
ఆరోగ్యం: స్వల్ప అనారోగ్య బాధలుంటాయి. ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్య విషయమై వ్యయ ప్రయాసలు తప్పవు. ధైర్యం కోల్పోవాల్సిన పనిలేదు. అంతా మంచే జరుగుతుంది. ఔషధ సేవనం తప్పనిసరి అయినా భయపడాల్సిన పనిలేదు.
ఏప్రియల్ 2023
ఈ నెలలో మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. గృహమార్పు అనివార్యం. విలువైన వస్తువులు, పత్రాలు జాగ్రత్త. పట్టుదలతో శ్రమిస్తే మీదే విజయం. స్వయంకృషితోనే సత్ఫలితాలు సాధిస్తారు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. దుబారా ఖర్చులు విపరీతం. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఆశించిన సంబంధం నిశ్చయమవుతుంది. ప్రతి విషయంలోను ఆచితూచి వ్యవహరించండి. అనాలోచిత నిర్ణయాలు తగవు. మీ జీవన భాగస్వామి సలహా పాటించండి.
లవ్ లైఫ్ : ఈ నెలలో కుటుంబ జీవనం బాగుంటుంది. మీ భాగస్వామి తరుపు బంధుత్వాలు, పరిచయాలు బలపడతాయి. వారి నుండి లబ్ది కోసం యత్నాలు సాగిస్తారు. ఈ క్రమంలో కొందరు ప్రత్యర్థులు ఏర్పడతారు. వారితో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ వ్యవహార ఒప్పందాల్లో మెలకువ వహించండి. సాధ్యం కాని హామీలివ్వవద్దు.
ఉద్యోగం-వ్యాపారం: ఈ నెలలో వ్యాపారాభివృద్ధికి మరింతగా శ్రమించాలి. ఉమ్మడి వ్యాపారాలు కలిసిరావు. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. ఉద్యోగస్తులకు శుభయోగం. రాజకీయనాయకులకు కలిసి వస్తుంది. మంచి చేద్దామనుకున్నా ఒక్కోసారి రివర్స్ అవుతుంది. జాగ్రత్తగా ఉండాలి.
ఆరోగ్యం: ఆరోగ్య విషయంలో మీరు తీసుకునే చిన్న చిన్న జాగ్రత్తలు మిమ్మల్ని ఒడ్డున పడేస్తాయి. ఒకరోజు సౌఖ్యంగా.. మరోరోజు చికాకుగా సాగుతుంది. కుటుంబం మీకు అన్ని విధాలా సపోర్ట్ ఇచ్చి నిలబెడుతుంది. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.
మే 2023
ఈ నెల గ్రహాన్నీ అనుకూలిస్తాయి.మీలో ఉన్న నిజాయితీ మిమ్మలని గెలిపిస్తుంది. అందరి చేతా ప్రశంసలందుకుంటారు. ఆదాయం బాగుంటుంది. కొన్ని కుటుంబ సమస్యల నుంచి బయటపడతారు. వాహనం, విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. మీరు చేసే ప్రయత్నాలకు కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఉంది. తరచు వేడుకలు, శుభకార్యాలు చేస్తారు. అవివాహితులకు శుభయోగం. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. సోదరుల మధ్య ఆస్తి వ్యవహారాలు ప్రస్తావనకు వస్తాయి. తెలివిగా వ్యవహరించండి.
లవ్ లైఫ్ : జీవనభాగస్వామితో వైరమేర్పడకుండా మెలగాలి. తలచిన కార్యా లకు ఆటంకాలెదురవుతాయి. ఆర్థిక ఇబ్బందులు ఆలస్యంగా తొలగిపోతాయి. కుటుంబంలో సం తోషం. పేరుప్రతిష్టలు లభిస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలుంటాయి. అంతటా అనుకూల వాతావరణం.
ఉద్యోగం-వ్యాపారం: వృత్తి, ఉద్యోగ రంగాల్లో ఆలస్యంగా అభివృద్ధి వుంటుంది. స్థిరాస్తుల విషయంలో జాగ్రత్తగా నుండుట మంచిది. వ్యాపారస్దులు ఒక అద్భుత అవకాశాన్ని కోల్పోతారు. ఉద్యోగస్దులకు నూతన వ్యక్తుల పరిచయమే ర్పడుతుంది. ప్రయాణాలవల్ల లాభాన్ని పొందుతారు.
ఆరోగ్యం: ఆరోగ్య పరంగా వయస్సు తగ్గ సమస్యలు. మందులతో పాటు మీకు మనశ్సాంతి అవసరం. అలాగే అహార,విహారాలలో అతి పనికి రాదు. మిమ్మల్ని మీరు చెక్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన సమయం.
జూన్ 2023
ఈ నెలలో ఆకస్మిక ధనలాభముంటుంది. కుటుంబం అంతా సంతోషంగా కాలక్షేపం చేస్తారు. కీర్తిప్రతిష్టలు పొందుతారు. మీలో ఆధ్యాత్మిక భావన నిండుతుంది. మీ ప్రతిష్ట మరింత పెరుగుతుంది. మేధో సామర్థ్యం పెరిగి, ఆనందాన్ని పెంచుతుంది. ఈ సంవత్సరం మీరు లక్ష్యానికి దగ్గరగా చేరుకుంటారు. ఈ సమయంలో మీ ఆరోగ్యానికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.నెల మధ్యలో గందరగోళం నెలకొంటుంది. వింత సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. ఖర్చుల విషయంలో కాస్త ఆలోచించాలి. ఒకరి మూర్ఖత్వం వల్ల మీ తల రాత మారే ప్రమాదం ఉంది. ఈరాశి వారు తరచూ నవగ్రహారాధన, శనైశ్చరుడికి తైలాభిషేకం చేయడం వల్ల గడ్డు పరిస్థితులు ఉపశమించే వీలుంది.
లవ్ లైఫ్ : జీవన భాగస్వామి మీకు అనుకూలం. మీ తొందరకి అడ్డు కట్టు వేస్తున్నారని కోపం పెట్టుకోకండి. మీ మేలు కాంక్షించేవారు మీ వెన్నంటే ఉన్నారని భావించండి. అంతటా మీరు గౌరవింపబడతారు.
ఉద్యోగం-వ్యాపారం: వృత్తి ఉద్యోగాల్లోని వారు అనవసర గొడవలకు దూరంగా ఉండండి. నిరుద్యోగులు ఆశించిన ఫలితం కోసం విపరీతంగా శ్రమించాలి. రాజకీయ రంగంలోని వారికి మిశ్రమ ఫలితాలుంటాయి. వ్యాపారస్దులకు సామాన్యంగా ఉంది.
ఆరోగ్యం: ఈ నెలలో ఆకస్మిక ధన నష్టమేర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. అనా రోగ్య బాధలు తొలగుటకు డబ్బు ఎక్కువ ఖర్చు చేస్తారు. దైవదర్శనం కొన్ని అనారోగ్య బాధలు తప్పుతాయి.
జూలై 2023
ఈ నెల మీకు అన్ని విధాలుగా కలిసొచ్చే యోగకాలం. మీ పని మరియు మీ గుర్తింపుతో, మీరు కొత్త స్థాయిలను అధిరోహిస్తారు. మీ మిత్రుల,సన్నిహితులు అనుభవం మరియు జ్ఞానం నుండి ప్రయోజనం పొందుతారు. అంచనాలు, మానసిక గందరగోళం రెండింటినీ చూస్తారు. ఈ క్రమంలో శక్తి, ధైర్యం పెరుగుతాయి. మానవ సంబంధాలు విస్తరిస్తాయి. మీరు ప్రయాణాలు ఎక్కువ చేసే అవకాశాలు బాగా ఉన్నాయి. మీరు చేసే కొన్ని తప్పులు, మూర్ఖత్వం జీవితాన్ని వేరే దారి వైపు మళ్లిస్దాయి. కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి.రోజూ సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి.
లవ్ లైఫ్ :మీ లైఫ్ పార్టనర్ తో కొత్త అనుభూతులు ఆస్వాదించే సమయం..చిన్న చిన్న గొడవలతో ఆనందాన్ని దూరం చేసుకోకండి. గ్రహాల అనుకూలత ఉంది. దూరమైన సంబంధాలు మెరుగు పడే అవకాశాలు ఉన్నాయి.పిల్లలు సైతంమిమ్మల్ని అర్దం చేసుకుంటారు. కుటుంబ విషయంలో వేరే వారి సలహాలు ఇబ్బంది పెడతాయి.
ఉద్యోగం- వ్యాపారం: ఉద్యోగ,వ్యాపారాల్లో సూక్ష్మబుద్ధితో విజయాన్ని సాధిస్తారు. మీ ప్రతిభను ఇతరులు గుర్తిస్తారు. శతృబాధలు తొలగిపోతాయి. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. ముఖ్యమైన వ్యక్తుల్ని కలుస్తారు. ఆకస్మిక లాభాలుంటాయి.
ఆరోగ్యం: స్వల్ప అనారోగ్య బాధలుంటాయి. వ్యయ ప్రయాసలు తప్పవు. హాస్పటిల్ పాలు కాకుండా జాగ్రత్తపడుట మంచిది. కొద్ది రోజుల్లోనే అన్ని సర్దుకుని మనోల్లాసాన్ని పొందుతారు. వీటితో వచ్చే ఆర్థిక ఇబ్బందులు ఆలస్యంగా తొలగిపోతాయి.
ఆగస్ట్ 2023
ఈ రాశి స్త్రీ పురుషులకు ధనం, కుటుంబం, సంపద, సంతానం, గౌరవానికి హాని లేదు. పెద్దహోదాగల వ్యక్తులకో పరిచయాలు ఏర్పడతాయి, సమాజంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు, అధికారం వహించే శక్తిసామర్థ్యాలు వీరిసొంతం. నెల మధ్యలో గ్రహ దోషాలవల్ల అడుగడుగునా విఘ్నాలు ఎదురవుతాయి కానీ తెలివిగా పనులు పూర్తిచేస్తారువివాదాలకు దూరంగా ఉండాలి, వచ్చిన ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకోవాలి
లవ్ లైఫ్ : ఈ నెలలో జీవిత భాగస్వామి మీకు అన్ని విధాలా సహకారం అందిస్తుంది. మీ బంధం మరింత బలపడుతుంది. ప్రేమికులకు కుటుంబం నుంచి మద్దతు లభిస్తుంది. మీ పిల్లల ప్రవర్తన ఇబ్బంది పెడుతున్నట్లు అనిపిస్తుంది. కానీ వారి పనుల వల్లే మీ ప్రతిష్ట పెరుగుతుంది. ఆనందం పెరుగుతుంది. సానుకూల పరిస్థితులు ఏర్పడుతాయి.
ఆరోగ్యం: మీ ఆరోగ్యం బాగుంది. కుటుంబంలో పెద్దల ఆరోగ్య విషయంలో ఇతరులతో విమర్శలకు లోనవుతారు. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు. ఆకస్మిక ధనవ్యయం అయ్యే అవకాశం. బంధు మిత్రులతో జాగ్రత్తగా వుండుట మంచిది. ఋణప్రయత్నాలు చేస్తారు.
ఉద్యోగం- వ్యాపారం: నిరుద్యోగులకు ఉద్యోగం దొరుకుతుంది, అధికారులకు పదోన్నతి ఉంటుంది, విద్యార్థులు పోటీపరీక్షల్లో సక్సెస్ అవుతారు
ప్రైవేట్ సంస్థల ఉద్యోగులు ఉద్యోగం మారే అవకాశం ఉంది. వ్యాపారస్దులకు పోటీ ఉన్నా ఫలితం బాగుంటుంది.
సెప్టెంబర్ 2023
ఈ రాశి వారి గోచారం ప్రకారం మీకు ప్రతికూల ఫలితాలే వస్తాయి. అయితే చివరకు వచ్చే ఫలితం మాత్రం అనుకూలంగా ఉంటుంది. ఓర్పు, పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. ఆలస్యంగానైనా సమర్ధతకు గుర్తింపు లభిస్తుంది. కీలక పదవులు అందుకుంటారు. గౌరవ ప్రతిష్టలు పెంపొందుతాయి. ఆదాయం బాగుంటుంది. దుబారా ఖర్చులు తగ్గించుకోగల్గుతారు. సంతానానికి విదేశీయానం, ఉన్నత విద్యావకాశాలు లభిస్తాయి. వివాహయత్నం ఫలిస్తుంది. శుభకార్యాలను ఘనంగా చేస్తారు. వ్యవసాయ, తోటల రంగాల వారికి ఆశాజనకం. పంట దిగుబడి, గిట్టుబాటు ధర లభిస్తాయి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి.
లవ్ లైఫ్ : మీ భాగస్వామితో నిజాయితీగా మెలిగి ప్రశంసలందుకుంటారు. మీ కుటుంబ ఆదాయం బాగుంటుంది. చాలా కాలంగా ఉన్న కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఇద్దరు కలిసి వాహనం, విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.మీ ప్రయత్నాలకు కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఉంది.
ఉద్యోగం- వ్యాపారం: వ్యాపారస్దులు ..వ్యవహార ఒప్పందాల్లో మెలకువ వహించండి. ఉద్యోగస్దులు ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు. పదవులు, బాధ్యతల నుంచి తప్పుకుంటారు. 20 వ తేదీ దాటాక ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. మీ సిఫార్సుతో ఒకరికి ఉద్యోగం లభిస్తుంది. స్త్రీలకు ధనలాభం, వస్త్ర ప్రాప్తి ఉన్నాయి. పోటీ పరీక్షల్లో విద్యార్థులు విజయం సాధిస్తారు. రిటైర్డు ఉద్యోగస్తులకు రావలసిన ఫలితాలు అందుతాయి. అధికారులకు హోదామార్పు.
ఆరోగ్యం: ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. జీవన శైలిలో కొత్త మార్పులు ఆహ్వానిస్తారు. అవి మేలు చేస్తాయి. ఆధ్యాత్మికత మీకు అండంగా ఉటుంది. వాహనం నడిపేటపుడు జాగ్రత్త. పాల్గొంటారు. అసాంఘిక కార్యకలాపాలకూ దూరంగా ఉండాలి.
అక్టోబర్ 2023
కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఆదాయం బాగుంటుంది. ఓర్పు, పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. ఆలస్యంగానైనా సమర్ధతకు గుర్తింపు లభిస్తుంది. కీలక పదవులు అందుకుంటారు. గౌరవ ప్రతిష్టలు పెంపొందుతాయి. ఆదాయం బాగుంటుంది. దుబారా ఖర్చులు తగ్గించుకోగల్గుతారు. చక్కని ప్రణాళికలు వేసుకుంటారు. ఖర్చులు మీ స్తోమతకు తగ్గట్టుగానే ఉంటాయి. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. దళారులు ను విశ్వసించవద్దు. బంధువులతో తెగిపోయిన సంబంధాలు బలపడతాయి.
లవ్ లైఫ్ : దంపతుల మధ్య తరచు అవగాహన లోపం, అకాల కలహాలు తలెత్తుతాయి. దీర్గకాలిక బంధాల పట్ల శ్రద్ధ అవసరం. సంతానానికి విదేశీయానం, ఉన్నత విద్యావకాశాలు లభిస్తాయి. మీ పిల్లల వివాహయత్నం ఫలిస్తుంది. శుభకార్యాలను ఘనంగా చేస్తారు.
ఉద్యోగం- వ్యాపారం: ప్రైవేట్ సంస్థ ఉద్యోగస్తులకు కష్టకాలం. విద్యార్థులు ర్యాంకుల సాధనకు మరింత శ్రమించాలి. విదేశీ విద్యాయత్నం ఫలించదు. వ్యాపారాలు పురోగతిన సాగుతాయి. ఉమ్మడి వ్యాపారాలు అనుకూలించవదు.
ఆరోగ్యం: మీకు ఇష్టమైన వారి ఆరోగ్యం ఇబ్బంది పెడుతుంది. అనారోగ్యానికి గురవుతారు. వైద్య సేవలతో ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ప్రియతముల గురించి ఆందోళన చెందుతారు. కుటుంబీకుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి.
నవంబర్ 2023
ఈ రాశివారి గోచారం ప్రకారం అన్ని విధాలా అనుకూలదాయకమే. కార్యసిద్ధి, ధనలాభం ఉన్నాయి. మనోధైర్యంతో వ్యవహరిస్తారు. సంఘంలో గుర్తింపు, గౌరవ మర్యాదలు పెంపొందుతాయి. ఖర్చులు అదుపులో ఉండవు. ఉన్నతిని చాటుకోవటానికి విపరీతంగా వ్యయం చేస్తారు. మీ ప్రమేయంతో శుభకార్యం నిశ్చయమవుతుంది. విలువైన వస్తువులు అపహరణకు గురవుతాయి. రియల్ ఎస్టేట్ రంగం క్రమంగా పుంజుకుంటుంది. న్యాయ, వైద్య, కంప్మూటర్ రంగాల వారికి ఆదాయాభివృద్ధి. విదేశీయానానికి పాస్పోర్టులు, వీసా మంజూరవుతాయి. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. తరచు పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.
లవ్ లైఫ్ : దంపతుల మధ్య సఖ్యత లోపం. కొద్దిపాటి తెలివితో పరిష్కరించుకునే వాటిని నిర్లక్ష్యం చేస్తారు. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. ఈ ఒత్తిడితో పదవులు, బాధ్యతల నుంచి తప్పుకుంటారు. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు అనుకూలం. మీ పిల్లలకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. ఉన్నత విద్యావకాశం లభిస్తుంది.
ఆరోగ్యం: ఈ నెలలో ఆరోగ్యం గురించి చింత అవసరం లేదు. మీ ఆరోగ్యం కుదుటపడింది. కొత్త సమస్యలను ఆహ్వానించకుండా ఉండటం కోసం ఆహార,విహారాదులలో మార్పులు చేయండి. తరచు సేవా కార్యక్రమాల్లో పాల్గొనండి. అన్ని సర్దుకుంటాయి..
ఉద్యోగం- వ్యాపారం: రిటైర్డు ఉద్యోగస్తులకు రావలసిన బెనిఫిట్స్ విషయంలో శ్రమ చికాకులు తప్పవు. ఉపాధ్యాయులకు పదోన్నతి, స్థానచలనం. నూతన వ్యాపారాలు చేపడతారు. వ్యాపారాల ప్రారంభంలో మందకొడిగా సాగినా క్రమంగా పుంజుకుంటారు. హోల్ సేల్ వ్యాపారస్తుల ఆదాయం బాగుంటుంది. చేతివృత్తులు, భవన నిర్మాణ కార్మికులకు ఆశాజనకం..
డిసెంబర్ 2023
ఈ రాశివారికి ఏ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. న్యాయ, ఆస్తి వివాదాలు జటిలమవుతాయి. ముఖ్యులలో ఒకరికి వీడ్కోలు పలుకుతారు. నెల ప్రారంభంలో స్వల్ప ఇబ్బందు లుంటాయి. అయితే గ్రహాలను అనుకూలిస్తాయి. గురు సంచారం వల్ల అన్ని విధాలా ప్రోత్సాహకరంగానే ఉంటుంది. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ప్రణాళికలు వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు. బంధుత్వాలు, పరిచయాలు బలపడతాయి. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు.
లవ్ లైఫ్ : మీ లైఫ్ పార్టనర్ విషయంలో కనబడుతున్న అన్ని అంశాలూ నిజం కాదు అని గ్రహించండి. ప్రతి విషయంలోనూ స్వయం శోధన అవసరం. అనుమానాలు తలెత్తకుండా చూసుకోండి. మంచి కూడా గ్రహాలు అనుకూలించకపోతే చెడుగా కనపడుతుంది.
ఆరోగ్యం: ఆరోగ్య విషయంలో అప్పుడప్పుడు కుటుంబంలో చికాకులు ఉన్నప్పటికీ అవన్నీ త్వరలోనే సమసిపోతాయి.మీ తెలివితేటలకు గురుబలం తోడవటం వల్ల ఈ నెల మీ జీవితం ప్రశాంతంగా ఉంటుంది. సన్నిహితుల సలహాలు, సూచనలు పాటిస్తే మీకు అంతా మంచే జరుగుతుంది.
ఉద్యోగం- వ్యాపారం : మీకు అంతా శుభసమయమే. రాజకీయంగా, సాంఘికంగా , ఇంటా-బయటా గౌరవ మర్యాదలు దక్కుతాయి. స్థిరాస్తి వృద్ధి చెందుతుంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి, ఆనందంగా ఉంటారు. తలపెట్టిన పనులు పూర్తి చేసేందుకు కష్టపడాలి. మొండిబాకీలు అతి కష్టంమీద వసూలవుతాయి, ఖర్చుల విషయంలో ఆచితూచి వ్యవహరించండి. సన్నిహితుల సలహాలు, సూచనలు పాటిస్తే మీకు అంతా మంచే జరుగుతుంది.