మిథున రాశిలో గురు, చంద్రుల కలయిక.. ఈ 3 రాశులకు డబ్బే డబ్బు!
Jupiter Moon Conjunction: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నేడు (ఆదివారం) గురువు, చంద్రుడి కలయిక వల్ల శుభప్రదమైన గజకేసరి రాజయోగం ఏర్పడనుంది. ఈ యోగం వల్ల 3 రాశులవారికి పట్టిందల్లా బంగారం కానుంది. మరి ఆ రాశులేంటో.. వారికి కలిగే ప్రయోజనాలేంటో చూద్దామా..

మిథున రాశిలో గురు చంద్రుల కలయిక
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నవ గ్రహాలు నిర్ణీత కాలంలో రాశులను మారుస్తాయి. ఇతర గ్రహాలతో కలిసి శుభ, అశుభ యోగాలను సృష్టిస్తాయి. నేడు (ఆదివారం) చంద్రుడు మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇప్పటికే మిథున రాశిలో ఉన్న గురువుతో కలిసి శక్తివంతమైన గజకేసరి రాజయోగాన్ని ఏర్పరుస్తాడు. ఈ రాజయోగం వల్ల కొన్ని రాశుల వారికి మేలు జరగనుంది. ఆ రాశులేంటో చూద్దాం.
గజకేసరి రాజయోగం 2025
‘గజ’ అంటే ఏనుగు. ఇది బలం, స్థిరత్వానికి చిహ్నం. ‘కేసరి’ అంటే సింహం. ఇది ధైర్యం, అధికారాన్ని సూచిస్తుంది. గజకేసరి యోగం కొన్ని రాశులవారికి సంపద, గౌరవం, అవకాశాలను అందిస్తుంది. ఊహించని లాభాలు, వృత్తిపరమైన అభివృద్ధి, ఆనందాన్ని ఇస్తుంది.
మిథున రాశి
మిథున రాశిలో గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది. కాబట్టి మిథున రాశి వారికి ఆర్థిక వృద్ధికి కొత్త ద్వారాలు తెరుచుకుంటాయి. ధన స్థానమైన రెండవ ఇంట్లో ఈ యోగం ఏర్పడటం వల్ల, ఆకస్మిక ధన లాభాలు కలుగుతాయి. ఉద్యోగులకు జీతం పెరుగుదల లేదా పదోన్నతి లభించవచ్చు. వ్యాపారంలో గణనీయమైన లాభాలు వస్తాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. చేపట్టే అన్ని పనుల్లో విజయం సాధిస్తారు.
సింహ రాశి
సింహ రాశి వారికి గురు చంద్రుల కలయిక వల్ల ఏర్పడే గజకేసరి రాజయోగం అనేక రంగాలలో విజయాలను అందిస్తుంది. ఈ యోగం ప్రభావంతో చేపట్టే అన్ని ప్రయత్నాలు విజయవంతమవుతాయి. కుటుంబ సభ్యులు, స్నేహితులు, సహోద్యోగుల మద్దతు లభిస్తుంది. సమాజంలో విలువ, గౌరవం, హోదా పెరుగుతాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు అనేక ప్రయోజనాలను పొందుతారు. విజయానికి మార్గం సుగమమవుతుంది. కొత్త అవకాశాలు వస్తాయి.
తుల రాశి
తుల రాశి వారికి గజకేసరి రాజయోగం అదృష్టాన్ని మోసుకువస్తుంది. భాగ్య స్థానంలో ఈ యోగం ఏర్పడటం వల్ల ఉద్యోగ, వ్యాపార రంగాలలో ఊహించని ప్రయోజనాలను పొందుతారు. మీ ప్రయత్నాలకు ఫలితాలు లభిస్తాయి. ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆధ్యాత్మిక యాత్రలు చేయవచ్చు. సానుకూల శక్తి పెరుగుతుంది. శత్రువులను ఓడించే అవకాశం ఉంది. వ్యాపారంలో పోటీదారులు తప్పుకోవడం వల్ల లాభం రెట్టింపు అవుతుంది. మీ లక్ష్యాన్ని చేరుకోవడానికి ధైర్యంగా ముందుకు సాగుతారు. ఓర్పు, దూరదృష్టితో మీ సమస్యలకు పరిష్కారం కనుగొంటారు.
గమనిక
ఈ కథనంలో పేర్కొన్న సమాచారం.. జ్యోతిష్య నిపుణుల అభిప్రాయాలు, సూచనల ఆధారంగా అందించింది మాత్రమే.