Zodiac signs: 100 ఏళ్ల తర్వాత శనిపై గురు దృష్టి, ఈ 4 రాశులకు రాజయోగం...!
Zodiac signs: 100 ఏళ్ల తర్వాత శని దేవుడిపై బృహస్పతి దివ్య దృష్టి పడింది. దీని ప్రభావం నాలుగు రాశులపై చాలా ఎక్కువగా ఉండనుంది. ఆ నాలుగు రాశుల వారికి ఇప్పటి వరకు ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి.. వారి ఇంట సంతోషాలు వెల్లివిరవనున్నాయి.

మకర రాశి
శని గ్రహంపై గురు గ్రహ దృష్టి పడటం దాదాపు 100 ఏళ్ల తర్వాత జరుగుతోంది. దీని కారణంగా, మకర రాశివారికి చాలా లాభాలు కలగనున్నాయి. మకర రాశివారికి లగ్నాధిపతి శని మూడో ఇంట్లో, గురుడు ఏడో ఇంట్లో ఉంటారు. గురు దృష్టి శనిపై పడుతుంది. దీని కారణంగా ఈ రాశివారికి కష్టానికి తగిన ప్రతి ఫలం లభిస్తుంది. ఆర్థికంగా ప్రయోజనాలు కలగుతాయి.
కన్య రాశి...
కన్యారాశి వారికి గురు దృష్టి వల్ల అద్భుత ఫలితాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. చిరకాల కలలు నెరవేరుతాయి. కొత్త వాహనం లేదా ఆస్తి కొనుగోలుకు ఇది అనుకూల సమయం. గతంలో ఎప్పుడూ చూడని లాభాలు ఇప్పుడు చూస్తారు.
మిథున రాశి..
శనిపై గురు దృష్టి మిథునరాశి వారికి చాలా మేలు చేయనుంది. కెరీర్ లో పురోగతి సాధించగలరు. వైవాహిక జీవితం బాగుంటుంది. కొత్త ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. విదేశీ అవకాశాలు లభిస్తాయి. ఆదాయం పెరుగుతుంది.
కర్కాటకం
కర్కాటక రాశి వారికి ఈ కలయిక ఉద్యోగ, వ్యాపారాల్లో గొప్ప విజయాన్నిస్తుంది. పెట్టుబడుల నుంచి లాభాలు వస్తాయి. ప్రమోషన్, జీతం పెరుగుదల ఉంటుంది. ఆర్థికంగా స్థిరపడతారు. ఆదాయం పెరుగుతుంది. కుటుంబ జీవితం ఆనందంగా మారుతుంది.