MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Astrology
  • జులై 2022 మాస ఫలాలు...ఓ రాశి వారికి బుణ శత్రు బాధలు తొలుగుతాయి

జులై 2022 మాస ఫలాలు...ఓ రాశి వారికి బుణ శత్రు బాధలు తొలుగుతాయి

జులై నెల రాశి ఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారు కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. సంఘంలో గౌరవ ప్రతిష్టలు. వివిధ మార్గాల ద్వారా ధనం చేకూరును. రావాల్సిన బాకీలు వసూలగును. ఇతరులకు ఉపకారం చేస్తారు. 

4 Min read
Author : ramya Sridhar
Published : Jul 01 2022, 10:08 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113
Horoscope 2022

Horoscope 2022

గమనిక :- ఈ ద్వాదశ రాశి ఫలితాలు అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని చెప్పినవి మాత్రమే. మీకు పూర్తి స్దాయి ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది,సమయం తీసుకుని అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి,జాతక చక్రం వేయించుకోండి.సమస్యలు ఉంటే రెమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా వస్తాయి. చక్కటి తరుణోపాయలతో శుభ ఫలితాలను పొందగలరు. 

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం.   - ఫోన్:   8523814226  (సంప్రదించు వారు ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)
 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213

మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
ధనాదాయ మార్గాలు బాగుంటాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సోదరుల సహకారంతో వృత్తి వ్యాపారాలలో లాభాలు పొందుతారు. సత్కార్యాలు చేస్తారు. స్థిరాస్తి క్రయ విక్రయాలకు అనుకూలం. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. విలాసవంతమైన వస్తువులను కొనుగోలు చేస్తారు. బంధు మిత్రుల కలయిక. సంతాన విషయంలో ప్రతికూల వాతావరణం. మాసాంతంలో ఋణ శత్రు బాధలు. మనస్చాంచల్యం వలన కొన్ని పనులలో ఆటంకాలు ఏర్పడును.

313

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్న ఋణ శత్రు బాధలు తొలగును. బంధుమిత్రుల సహకారం లభించును. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. సంఘంలో గౌరవ ప్రతిష్టలు. వివిధ మార్గాల ద్వారా ధనం చేకూరును. రావాల్సిన బాకీలు వసూలగును. ఇతరులకు ఉపకారం చేస్తారు. మాసం ప్రారంభంలో స్థిరాస్తి వృద్ధికి అనుకూలం. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అనుకోని ఖర్చులు చేస్తారు. ఉద్యోగులకు పై అధికారుల ఒత్తిడి. అన్నదమ్ముల సహకారం లభిస్తుంది. వ్యాపారాల్లో లాభం.

413

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
ఉద్యోగులకు పదోన్నతులు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు. ఋణ,శత్రు బాధలు కొంతమేర తొలగును. బంధు మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. శుభవార్తలు వింటారు. వృత్తి వ్యాపారాలకు అనుకూలం. గృహము నందు శుభ కార్యాచరణ. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. జీవిత భాగస్వామితో ప్రతికూల వాతావరణం. వివాహ ప్రయత్నాలలో ఆటంకాలు. అవసరమైన ఖర్చులు. సోదరులతో మనస్పర్థలు.

513

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
ఆదాయ మార్గాలు బాగుంటాయి. వృత్తి వ్యాపారాల యందు లాభం. అన్నదమ్ముల సహాయ సహకారాలు లభిస్తాయి. స్థిరాస్తి క్రయ విక్రయాలకు అనుకూలం. ఉద్యోగులకు అనుకూలమైన ప్రమోషన్లు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు. శుభకార్యాలల వలన ధనవ్యయం. బంధు మిత్రుల కలయిక. తలపెట్టిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవ ప్రతిష్టలు. రుణ శత్రుబాధలు కొంతమేర ఇబ్బంది పెడతాయి. ఆరోగ్యంలో తగు జాగ్రత్తలు తీసుకొనవలెను. జీవిత భాగస్వామితో మనస్పర్థలు.

613

సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
శుభవార్తలు వింటారు. సంఘంలో తెలివిగా వ్యవహరిస్తారు. గృహమునందు శుభ కార్యాచరణ. ఆదాయ మార్గాలు బాగుంటాయి. పెద్దల యొక్క సహాయ సహకారాలు అందుతాయి. కుటుంబ అభివృద్ధి కొరకు నిర్ణయాలు తీసుకుంటారు. స్థిరాస్తి క్రయ విక్రయాల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. మాసాంతంలో ఉద్యోగులకు కొద్దిగా ఇబ్బందులు. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అవివాహితులకు వివాహ ప్రయత్నాలు అతి కష్టం మీద సఫలీకృతం అవుతాయి. ప్రయాణాలలో తగు జాగ్రత్తలు తీసుకోండి.

713

కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్న ఆర్థిక ఇబ్బందులు తొలుగును. సంతానము విద్య ఉద్యోగంలో రాణిస్తారు. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. వృత్తి వ్యాపారాల్లో సామాన్యం. కుటుంబము వృద్ధి. ఆస్తి విషయంలో అన్నదమ్ములతో కలహాలు ఏర్పడవచ్చు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. స్థిరాస్తి క్రయవిక్రయాల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. జీవిత భాగస్వామితో ప్రతికూల వాతావరణం. ఉద్యోగస్తులకు పై అధికారుల ఒత్తిడి. మాసాంతంలో అనవసరపు ఖర్చులు.

813

తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
సంఘంలో గౌరవ ప్రతిష్ఠలు. బంధు మిత్రుల సహాయ సహకారం లభిస్తుంది. కొంతకాలంగా ఇబ్బంది పడుతున్న రుణబాధలు తొలగుతాయి. శుభకార్యాల వల్ల కొద్దిగా ఖర్చులు. రావలసిన సొమ్ము తిరిగి లభించును. నూతన వ్యాపారాలకు శ్రీకారం చుడతారు. స్థిరాస్తి కొనుగోలుకు అనుకూలం. వస్తు వాహన ప్రాప్తి. సంతాన వృద్ధి కొరకు తగిన నిర్ణయాలు తీసుకుంటారు. ఆదాయ మార్గాలు బాగుంటాయి. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. ఉద్యోగులకు అనుకూలమైన పదోన్నతులు.

913

వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
అకారణంగా స్తంభించిన పనులను పూర్తిచేస్తారు. రుణ శత్రు బాధలు తొలగును. పోయిన వస్తువులు తిరిగి లభించును. చేయు పనులలో అభివృద్ధి సాధిస్తారు. ఆకస్మిక ధన లాభం. సంతానం యొక్క విద్య ఉద్యోగంలో అభివృద్ధి. వివాహ ప్రయత్నాలు అతి కష్టం మీద ఫలించే అవకాశం. వృత్తి వ్యాపారాల్లో సామాన్యం. ఉద్యోగస్తులకు పై అధికారుల ఒత్తిడి. ప్రయాణాలలో జాగ్రత్త వహించాలి. స్థిరాస్తి క్రయ విక్రయాలు వాయిదా వేసుకోవడం మంచిది. మాసాంతంలో అవసరమైన ఖర్చులు చేస్తారు.
 

1013

ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
అవివాహితులకు వివాహ ప్రయత్నాలు సఫలీకృతం. బంధుమిత్రులతో ఆహ్లాదంగా గడుపుతారు. అనేక విధాలుగా ధనాదాయం మార్గాలు ఏర్పడతాయి. శుభకార్యాల వలన ఖర్చులు. వస్తు వాహన ప్రాప్తి. రావలసిన బకాయిలు వసూలు అవును. తలపెట్టిన పనులలో కష్టించిన ఫలితం బాగుంటుంది.కుటుంబ వృద్ధి కొరకు తగునిర్ణయాలు తీసుకోనవలెను. స్థిరాస్తి క్రయ విక్రయాలు వాయిదా వేసుకోవడం మంచిది. కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మాసాంతంలో జీవితభాగస్వామితో చికాకులు

1113

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్న రుణ శత్రు బాధలు తొలగును. వృత్తి వ్యాపారాల్లో లాభాలు. ఉద్యోగస్తులకు మాసాంతంలో చికాకులు. సంతానం మూలంగా కొంత ఇబ్బందులు. వివాహ ప్రయత్నాలకు ఆటంకాలు. స్థిరాస్తి క్రయ విక్రయాల విషయంలో ఆచి తూచి వ్యవహరించాలి. వ్యాపార భాగస్వాములతో ఇబ్బందులు. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మాసాంతంలో అధిక ఖర్చులు చేస్తారు.
 

1213

కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
ఈ రాశి వారు ఈ మాసం తగు జాగ్రత్తలు తీసుకోవాలి. విలువైన వస్తువులు పోగొట్టుకుంటారు. అనుకోని ఖర్చులు. వివాహ ప్రయత్నాలకు అనుకూలం. ధనాదాయం మార్గాలు బాగుంటాయి. స్థిరాస్తి క్రయ విక్రయాలు వాయిదా వేసుకోండి. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. రుణ శత్రుబాధలు కొంతమేర తొలగుతాయి.ఉద్యోగస్తులకు పై అధికారుల మన్నన. వ్యాపార భాగస్వాములతో జాగ్రత్తగా వ్యవహరించాలి. మాసాంతం లో బంధుమిత్రులతో కలహాలు

1313

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
ఉద్యోగస్తులకు పై అధికారుల ప్రశంసలు. ధనాదాయ మార్గాలు బాగుంటాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు. స్థిరాస్తి క్రయవిక్రయాలలో లాభాలు. వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. గృహము నందు శుభ కార్యాచరణ. రుణ శత్రుబాధలు కొద్దిగా ఇబ్బంది పెడతాయి. అనవసరమైన ఖర్చు చేస్తారు. అన్నదమ్ములతో చికాకులు. వృత్తి వ్యాపారాల్లో సామాన్యం. ఆర్థికంగా కొంత ఇబ్బందులు ఉన్నప్పటికీ నిలదొక్కుకుంటారు. మాసాంతంలో జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Planets Movement: శని, గురు గ్రహాల కలయికతో నవపంచమ యోగం.. ఈ 4 రాశులకు పట్టిందల్లా బంగారమే
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు చాలా కాలంగా వేధిస్తున్న సమస్యల నుంచి బయటపడతారు!
Recommended image3
Venus Blessings: ఈ 5 రాశులవారికి శుక్ర దశ.. డబ్బుకు డబ్బు, పేరుకు పేరు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved