జులై 2021 మాస ఫలాలు.. ఓ రాశివారి ధనలాభం..!
ఈ నెల రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ నెలలో యోగదాయకంగా ఉండే కాలం. వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో అంచనాలకు అనుకూలంగా ఫలితాలు లభిస్తాయి. వ్యతిరేకులు సన్నిహితులుగా మారుతారు.
డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151
గమనిక :- ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి , షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు జైశ్రీమన్నారాయణ.
మేషరాశి (Aries) అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి :- ఈ నెలలో విధి నిర్వహణలో మార్పులకు సిద్ధంగా ఉండాలి. కుటుంబంలో ఆకస్మిక ధన ప్రాప్తి లభించును. వ్యాపార విస్తరణ పనులు చేపడతారు. సోదర వర్గం వారికి సహాయం చేయగలుగుతారు. మీ శ్రమ కు తగిన గుర్తింపు పొందగలుగుతారు. భూ వివాదాలు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. ఆర్ధిక పరమైన వ్యూహాలు రచించగాలుగుతారు. ధనాదాయం పెరుగును. చేయుచున్న వృత్తి వ్యాపారాలలో, ఉద్యోగ ప్రయత్నాలలో జయము ప్రాప్తించును. ఈ మాసంలో 13, 21 తేదీలు అనుకూలమైనవి కావు. ఈ మాసంలో నూతన వాహన కొనుగోలు చేయకుండా ఉండుట మంచిది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
వృషభరాశి ( Taurus) కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి :- ఈ నెలలో యోగదాయకంగా ఉండే కాలం. వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో అంచనాలకు అనుకూలంగా ఫలితాలు లభిస్తాయి. వ్యతిరేకులు సన్నిహితులుగా మారుతారు. మిత్రుల వలన లాభం పొందుతారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. ప్రధమ ద్వితీయ వారాలలో కుటుంబ సభ్యుల సహకారంతో ఒక సదావకాశం పొందుతారు. తల్లి గారి ఆరోగ్య సమస్యల వలన మాత్రం ఆందోళన ఏర్పడుతుంది. స్పెక్యులేషన్, స్టాక్ మార్కెట్ రంగంలో వ్యాపార పెట్టుబడులు చేయు వారు లాభం పొందుతారు. తృతీయ వారం నుండి ధనాదాయం పెరుగును. ఈ మాసంలో 15, 24, 30 మరియు 31 తేదీలు అంత అనుకూలమైనవి కావు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
మిధునరాశి ( Gemini) మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి :- ఈ నెలలో ప్రారంభంలో మంచి అనుకూలత ఆ తదుపరి కుటుంబంలో చికాకులు, మానసిక ఆందోళన ఏర్పడును. మొదటి వారంలో ఆశించిన ధనప్రాప్తి లభిస్తుంది. ఆశించిన విధంగా వాహన సౌఖ్యం పొందుదురు. కుటుంబ వ్యవహారాలలో మీకు అనుకూలంగా మార్పులు ఏర్పడతాయి. దూరమైన మిత్రులు తిరిగి దగ్గర అవుతారు. సంతాన సంబంధ శుభ వార్తలు పొందుతారు. బంధు లేదా స్నేహ వర్గ రాక పోకలు ఆనంద పరచును. విదేశీ నివాస ప్రయత్నములు చేయువారికి అనుకూల ఫలితాలు. ద్వితీయ వారం చివరి వరకూ పెద్దగా ఇబ్బందులు ఏర్పడవు. 16 వ తేదీ నుండి కుటుంబంలోని పెద్దవయ్యస్సు వారికి అనారోగ్య సమస్యలు. మాసాంతంలో వృత్తిలో ప్రతికూల ఫలితాలు. ఈ మాసంలో 19, 20, 21 తేదీలు అనుకూలమైనవి కావు. గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
కర్కాటకరాశి ( Cancer) పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి :- ఈ నెలలో ఆలోచనలు ఉద్రేకపూరితంగా ఉండును. ఎటువంటి కారణం లేకుండా కోపం, చిరాకు ఏర్పడుచుండును. ఆచార సంప్రదాయములను విడిచి వ్యవహరించేదరు. ధనాదాయం సామాన్యం. అనారోగ్య సమస్యలు కొనసాగును. కుటుంబ పరంగా కఠినమైన నిర్ణయాలు తీసుకొనవలసి వచ్చును. బంధు మిత్రుల ఆదరణ చేయూత ఆశించిన విధంగా ఉండదు. చివరి వారంలో ఉద్యోగ జీవనంలో అనుకూలమైన మార్పులు ఏర్పడును. వినోద సంబంధ వ్యయం చేయుదురు. ఈ మాసంలో 3,8,11,13,17 తేదీలు అంత అనుకూలమైనవి కావు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
సింహరాశి (Leo) మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి :- ఈ నెలలో చక్కటి ఫలితాలు కనబడుతాయి. ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం లభించును. ప్రవర్తనలోని పొరపాట్లను సరిదిద్దుకొని వ్యవహారములను పూర్తి చేయగలుగుతారు. తృతీయ వారంలో ప్రత్యర్ధుల నుండి సానుకూల సందేశాలు అందుకుంటారు. వివాదాలు కొలిక్కి వచ్చును. ఆహార అలవాట్లు, వ్యసనాల పట్ల జాగ్రత్త అవసరం. ఈ మాసంలో వ్యాపార వ్యవహారాలు లాభాపురితంగా సాగుతాయి. ఈ మాసంలో 23,24, 27,29 తేదీలలో నూతన కార్యములు, వివాహము కొరకు చేయు ప్రయత్నములు లాభించును. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
కన్యారాశి ( Virgo) ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి :- ఈ నెలలో చక్కటి సుఖసంతోషాలు ఉండును. భూ లేదా గృహ ప్రయత్నాలు చేయువారికి లాభం ఏర్పడును. వ్యాపార జీవనంలోని వారికి ఆశించిన లాభములు లభించును. ఉద్యోగ జీవనంలోని వారికి నూతన భాద్యతల వలన విశ్రాంతి లోపించును. ప్రధమ ద్వితీయ వారములలో నూతన పరిచయాల వలన లాభం, సంఘంలో మంచి గుర్తింపు మరియు ఆశించిన ధనాదాయం పొందుదురు.18 వ తేదీ తదుపరి మొహమాటంతో సమస్యలు జటిలం అవుతాయి. నూతన ఉద్యోగ ప్రయత్నములలో ఆశాభంగం ఏర్పడును. సొంత గృహ నిర్మాణ సంబంధ ప్రయత్నాలు చేయవచ్చు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
తులారాశి ( Libra) చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి :- ఈ నెలలో ధనాదాయం బాగుండును. మానసిక ఆందోళన మరియు చికాకులు అధిగమిస్తారు. తలచిన పనులలో విజయం సాధించగలుగుతారు. గురు భక్తీ పెరుగుతుంది. ఉద్యోగ మార్పు ప్రయత్నాలలో ఉన్నవారికి అధికారుల వలన ఇబ్బందులు ఎదురగును. సహచరుల నుండి ఆశించిన సహకారం లభించదు. కోర్టు వ్యవహారముల వలన ధన నష్టం పొందటానికి అవకాశం ఉన్నది. వినరాని మాటలు వినుట వలన ఆత్మవిశ్వాసం కొల్పోవుదురు. వృత్తి జీవనంలోని వారికి వ్యాపార రంగంలోని వారికి సంతృప్తికర ఆదాయం ఉండును. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
వృశ్చికరాశి ( Scorpio) విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి :- ఈ నెలలో ఆశించిన విధంగా చక్కటి ధనాదాయం లభిస్తుంది. తలపెట్టిన కార్యములందు విజయాలు చేకురును. ఆధ్యాత్మిక పరంగా ఉన్నత స్థాయి వ్యక్తుల దర్శన భాగ్యము పొందగలుగుతారు. ఉద్యోగ జీవనంలో మీ శ్రమకు తగిన గుర్తింపు, గౌరవ సత్కారములు పొందగలుగుతారు. వంశ పెద్దల ఆశీస్శులు లభిస్తాయి. కొద్దిపాటి విఘ్నములు ఉన్నా నూతన పదవులు పొందగలుగుతారు. అయితే 22, 24,25 తేదీలలో అశుభ వార్తలు వినుటకు అవకాశం కలదు. గోమాతకు గ్రాసం పెట్టండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
ధనుస్సురాశి ( Sagittarius) మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి :- ఈ నెలలో కుటుంబం లోనూ వృత్తి వ్యాపార జీవనంలోనూ అనుకూలమైన పరిస్థితులు ఏర్పడును. ఆశించిన విధంగా లాభకరమైన వాతావరణం కలిగి ఉందురు. సంతాన ప్రయత్నాలలో సంతృప్తికరమైన ఫలితాలు ఏర్పడును. సొంత వాహన సంబంధ ప్రయత్నాలు లాభించును. గత కాలంగా వాయిదా వేస్తూ వస్తున్న పనుల వలన ఇబ్బందులు ఎదుర్కొందురు. చివరి నిమిషంలో తీవ్ర ఒత్తిడి ఎదుర్కొందురు. 18 నుండి 23 వ తేదీ మధ్య ఆహార సంబంధ అనారోగ్య బాధించును. 25 వ తేదీ తదుపరి మాసాంతంలో అందరి మన్ననలు లభిస్తాయి.సంతోషకర రోజులు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
మకరరాశి ( Capricorn) ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి :- ఈ నెలలో ధనాదాయం సామాన్యం. ముఖ్యమైన కార్యక్రమాలు నిదానిస్తాయి. ఆదాయం సామాన్యంగా ఉన్నప్పటికీ అవసరాలకు అప్పులు చేయవలసి వచ్చును. ప్రధమ వారంలో వృత్తి వ్యాపారములు సామాన్యంగా కొనసాగును. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తికి ఈ మాసం 5,6 తేదీలు అనుకూలమైనవి. ద్వితీయ వారంలో సువర్ణ సంబంధ కోరికలు తీరును. నూతన పరిచయాలు ఏర్పడతాయి. తృతీయ వారం సామాన్య ఫలితాలు ఏర్పడుతాయి. బంధు పరంగా కొద్దిపాటి ఆటంకములు మాత్రం ఉంటాయి. మీ పై బంధువులు అభాండములు మోపే అవకాశాలున్నాయి జాగ్రత్త వహించండి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతీ రోజూ రావి చెట్టుకు 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అని స్మరిస్తూ 11 ప్రదక్షిణలు చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
కుంభరాశి ( Aquarius) ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి :- ఈ నెలలో శరీర అనారోగ్య పరమైన సమస్యలు, శ్రమానంతర కార్య జయం వంటి సమస్యలు ఎదురగును. ఉద్యోగ జీవనం సామాన్యం. విద్యార్ధులకు మంచి అవకాశములు లభిస్తాయి. నూతన వధూవరులకు సంతాన ప్రాప్తి. ఈ మాసంలో ద్వితీయ వారంలో వ్యక్తిగత జీవనానికి సబందించిన విషయాల్లో స్పష్టత వస్తుంది. తృతీయ వారంలో సామాన్య ఫలితాలు ఏర్పడతాయి. 22 వ తేదీ తదుపరి ధనాదాయంలో పెరుగుదల ఉంది. కుటుంబ అవసరములకు తగిన ధనం సర్దుబాటు చేస్తారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
మీనరాశి ( Pices) పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి :- ఈ నెలలో పరిస్థితులు అనుకూలంగా ఉండును. ధనాదాయం బాగుంటుంది. వారసత్వ లేదా భూ లాభం ఏర్పడును. వ్యాపార వ్యపారాదులలో ఆశించిన దాని కన్నా ఎక్కువ ధనప్రాప్తి లభిస్తుంది. సుఖసంతోషాలు ఉన్నవి. వేడుకలలో పాల్గొంటారు. కొన్ని నిర్ణయాలను చివరి నిమిషంలో మార్చుకుంటారు. దాని వలన లాభపడతారు.16, 17, 18, 19 తేదీలలో అధిక భాద్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది. లోహ సంబంధ వ్యాపారములు ఈ మాసంలో ప్రారంభించకూడదు. ఈ మాసంలో చేయు మిగిలిన వ్యాపార పెట్టుబడులు లాభించును. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.