Rahu Gochar: 2026 లో రాహువు కారణంగా ఈ నాలుగు రాశుల అదృష్టం రెట్టింపు కావడం పక్కా..!
Rahu Gochar:2026లో రాహువు శని గ్రహం అయిన మకర రాశిలోకి అడుగుపెట్టనున్నాడు. 11 నెలలు కుంభ రాశిలో సంచరించిన తర్వాత మకర రాశిలోకి మారతాడు. దీని ప్రభావం సంవత్సరం మొత్తం ఉంటుంది. ఫలితంగా.. నాలుగు రాశుల అదృష్టం రెట్టింపు కానుంది.

రాహు సంచారం..
గ్రహాల మార్పులు తరచుగా జరుగుతూనే ఉంటాయి. 2026లో జరిగే ఈ గ్రహాల మార్పులు కొన్ని రాశుల జీవితాలను పూర్తిగా మార్చేయనున్నాయి. మరీ ముఖ్యంగా రాహువు కారణంగా నాలుగు రాశుల వారికి సమస్యలు రానున్నాయి. మే 18, 2025 నుంచి రాహువు కుంభ రాశిలోనే సంచరిస్తున్నాడు. 2026 లో మకర రాశిలోకి అడుగుపెట్టనున్నాడు. దీని కారణంగా నాలుగు రాశులకు మహర్దశ పట్టనుంది. చాలా ప్రయోజనాలు పొందనున్నారు. మరి, ఆ రాశులేంటో చూద్దామా....
వృషభ రాశి....
శని గ్రహాలు మకర, కుంభ రాశులలో రాహువు సంచరించడం వల్ల వృషభ రాశి వారికి చాలా ప్రయోజనాలు కలగనున్నాయి. ఈ సమయంలో వృషభ రాశిలో జన్మించిన వ్యక్తులు పదోన్నతి పొందుతారు. కెరీర్ లో మంచి అవకాశాలు పొందుతారు. చాలా కాలంగా ఎదురుచూస్తున్న అవకాశాలు లభిస్తాయి. పెళ్లి కాని వారికి మంచి సంబంధాలు వచ్చే అవకాశం ఉంది. వ్యాపారంలోనూ భారీ లాభాలు పొందుతారు. మంచి విజయావకాశాలు లభిస్తాయి. కుటుంబంలో సంతోషం రెట్టింపు అవుతుంది.
మిథున రాశి...
మిథున రాశిలో జన్మించిన వ్యక్తులకు 2026 చాలా బాగా కలిసి రానుంది. మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. పోటీ పరీక్షల్లోనూ విజయం సాధించగలరు. విద్యార్థులు పరీక్షల్లో మంచి మార్కులు సాధిస్తారు. కుటుంబంతో చాలా సంతోషంగా గడపగలరు. అంతేకాదు... ఈ రాశి వారి సంపద ఈ సమయంలో రెట్టింపు అవుతుంది. కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. చేసే ప్రతి పనిలోనూ విజయం సాధించగలరు. ప్రతి ఒక్కరూ మీరు చేసే పనిని ప్రశంసిస్తారు. ప్రభుత్వ పథకాల నుంచి కూడా చాలా ప్రయోజనాలు లభిస్తాయి.
కన్య రాశి...
కన్య రాశిలో జన్మించిన వ్యక్తులు ఈ కాలంలో రాహువు కారణంగా శుభ ఫలితాలు పొందుతారు. ముఖ్యంగా పిల్లల కారణంగా ఈ రాశివారి సంతోషం రెట్టింపు అవుతుంది. కోరుకున్న మంచి భాగస్వామి వీరికి లభిస్తారు. అంతేకాదు... ఈ సమయంలో కన్య రాశివారి ఆత్మ విశ్వాసం పెరుగుతుంది.
మీన రాశి...
ప్రస్తుతం మీన రాశి ఏలినాటి శని దశ నడుస్తోంది. కానీ... రాహువు సంచారం మాత్రం మీన రాశివారికి చాలా మేలు చేయనుంది. సౌకర్యవంతంగా జీవితాన్ని గడుపుతారు. విదేశీ ప్రయాణ యోగం ఈ రాశివారికి ఎక్కువగా రాసి పెట్టి ఉంది. అంతేకాదు, ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఇప్పటి వరకు ఎదుర్కొన్న సమస్యలన్నీ తగ్గుముఖం పడతాయి. కోరుకున్న లక్ష్యాలను చేరుకునే అవకాశం ఉంటుంది. అన్నింట్లోనూ విజయం సాధిస్తారు.