MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Bigg Boss Telugu 10
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
IMD Weather Update
iPhone 18 Pro
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Astrology
  • Zodiac sign: ప్రేమించిన అమ్మాయి రాఖీ చేత పట్టుకొని వస్తే...!

Zodiac sign: ప్రేమించిన అమ్మాయి రాఖీ చేత పట్టుకొని వస్తే...!

కొందరు అమ్మాయిలు.. తమ సొంత సోదరులకు మాత్రమే కాదు.. తమ వెంట పడే కొందరు ఆకతాయిలకు కూడా రాఖీ కట్టేయాలని చూస్తూ ఉంటారు. అలాంటివాళ్లు.. రాఖీ పండగ పేరు చెబితనే భయపడిపోతూ ఉంటారు. 

3 Min read
Author : ramya Sridhar
Published : Aug 09 2022, 12:48 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113

రాఖీ పర్వదినం దగ్గరకు వచ్చేస్తోంది. ఈ పర్వదినాన.. ప్రతి ఒక్కరూ తమ సోదరీమణులతో సంతోషంగా గడపాలని అనుకుంటూ ఉంటారు. అయితే.. ఈ రాఖీ రోజున కొందరు అమ్మాయిలు.. తమ సొంత సోదరులకు మాత్రమే కాదు.. తమ వెంట పడే కొందరు ఆకతాయిలకు కూడా రాఖీ కట్టేయాలని చూస్తూ ఉంటారు. అలాంటివాళ్లు.. రాఖీ పండగ పేరు చెబితనే భయపడిపోతూ ఉంటారు. నిజంగా.. మీరు ప్రేమించిన అమ్మాయి.. మీ క్రష్.. మీకు రాఖీ కట్టాలని చూస్తే.. ఏ రాశి అబ్బాయిలు ఎలా రియాక్ట్ అవుతారో ఓసారి చూద్దాం..
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213

1.మేష రాశి..
ఈ రాశి వారు చాలా తెలివిగల వారు. తమ క్రష్ తమకు రాఖీ  కట్టాలి అనుకుంటుందో లేదో వీరు ముందుగానే తెలుసుకుంటారు. అంతే.. ఆమె తమ దగ్గరకు రాకముందే.. వీరు అక్కడి నుంచి పారిపోతారు.
 

313

2.వృషభ రాశి..
ఈ రాశివారు తాము ప్రేమించిన అమ్మాయి కనుక రాఖీ కట్టడానికి వస్తే.. అవసరం లేదు.. నో థ్యాంక్స్.. రాఖీ కట్టడానికి నాకు సిస్టర్ ఆల్రెడీ ఉన్నారు. మీరు కట్టాల్సిన అవసరం లేదు అని చెప్పేస్తారు.

413

3.మిథున రాశి..
ఈ రాశివారు తాము ప్రేమించిన అమ్మాయి కనుక రాఖీ కట్టడానికి వస్తే.. మొహమాటంతో కట్టించేసుకుంటారు కూడా. ముఖంపై ఒక ఫేక్ నవ్వు పెట్టి.. రాఖీ కట్టించుకుంటారు. కానీ.. తర్వాత జీవితంలో మళ్లీ వాళ్ల ముఖం కూడా చూడటానికి ఇష్టపడరు.

513

4.కర్కాటక రాశి..
ఈ రాశివారు.. తాము ఇష్టపడిన అమ్మాయి తమకు రాఖీ కట్టాలని అనుకుంటుంది అనే ఊహ కూడా భరించలేరు. అది కేవలం జోక్  అయితే తప్ప వీరు నార్మల్ అవ్వలేరు. ఆ వార్త విన్నా.. నిజంగానే ఆ అమ్మాయి వచ్చి రాఖీ కట్టినా.. వీరు జీవితంలో అన్నీ కోల్పోయినట్లుగా భావిస్తారు. ప్రపంచం తల్లకిందులైనట్లు ఫీలౌతారు

613


5.సింహ రాశి..
సింహ రాశివారికి కాస్త ధైర్యం ఎక్కువే. తాము ఇష్టపడిన అమ్మాయి చేతిలో రాఖీ చూసినా వీరు అక్కడి నుంచి తప్పించుకుంటారు. లేదు.. ఏకంగా ఆ అమ్మాయి వచ్చి రాఖీ కడతాను అని అడిగితే... నిర్మోహమాటంగా నో చెప్పి.. తమ ప్రేమ విషయం వారికి తెలియజేస్తారు.

713

6.కన్య రాశి..
ఈ రాశివారు అన్ని విషయాల్లోనూ చాలా ప్రశాంతంగా ఉంటారు. వీళ్లు చాలా కంపోస్డ్ గా కూడా ఉంటారు. కానీ.. తాము ఇష్టపడిన అమ్మాయి తమకు రాఖీ కట్టాలి అని చూస్తే మాత్రం వీరు భరించలేరు. సున్నితంగా వారికి రాఖీ కట్టించుకోవడం ఇష్టం లేదని చెప్పి.. అక్కడి నుంచి వెళ్లిపోతారు.

813

7.తుల రాశి..
తుల రాశివారు  జీవితంలో దేనినీ సీరియస్ గా తీసుకోరు. కాబట్టి.. వీరు.. తమ క్రష్ వచ్చి రాఖీ కట్టాలి అని అనుకుంటున్నట్లు చెబితే.. వెంటనే అదో జోక్ లా తీసుకుంటారు. వెంటనే గట్టిగా నవ్వేసి.. ఇలాంటివి తాను పెద్దగా పట్టించుకోనని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతారు.

913

8.వృశ్చిక రాశి..
వృశ్చిక రాశివారికి తమ క్రష్ కనుక రాఖీ కట్టడానికి వస్తే.. ఒక రకమైన లుక్ ఇస్తారు. ఆ లుక్ చూస్తే.. వారు ఆమెను ఎంతగా ప్రేమిస్తున్నారనే విషయం ఇట్టే అర్థమైపోతుంది. ఆ లుక్కు చూశాక ఎవరూ ఆయనకు రాఖీ కట్టరు.
 

1013

9.ధనస్సు రాశి..
ధనస్సు రాశివారు.. తాము ఇష్టపడిన అమ్మాయి చేతిలో రాఖీ చూసినా.. తమ కోసమేనేమో అని భయపడతారు. అయితే.. ఆ భయాన్ని కానీ.. వారిపై తమకు ఉన్న ఇష్టాన్ని కానీ..  ఏమీ తెలియజేయకుండా.. కామ్ అక్కడి నుంచి వెళ్లిపోతారు.
 

1113

10.మకర రాశి..
మకర రాశివారికి ధైర్యం చాలా ఎక్కువ. తాము ఇష్టపడిన అమ్మాయి.. రాఖీ కట్టడానికి వస్తే.. ఎలాంటి భయం, సందేహాలు లేకుండా నో చెప్పేస్తారు. ఆ తర్వాత.. అదే సమయంలో ప్రపోజ్ చేసి.. డేట్ కి రమ్మని పిలిచే అవకాశం కూడా ఎక్కువగా ఉంది.
 

1213

11.కుంభ రాశి..
కుంభ రాశివారు.. తాము ప్రేమించిన వారు వచ్చి తమకు రాఖీ కట్టాలి అని చూస్తే.. మనసు చంపుకొని రాఖీ కట్టించుకుంటారు. కానీ... తర్వాత.. తమను ఎలా మిస్ చేసుకున్నామని.. తమ క్రష్ బాధపడేలా చేస్తారు.
 

1313

12.మీన రాశి..
మీన రాశివారు.. తాము ఇష్టపడిన అమ్మాయి రాఖీ కట్టడానికి వస్తే.. వెంటనే కట్టించుకుంటారు. కానీ... ఆ తర్వాత నుంచి వారు మీకు కనిపించరు. ఒకవేళ కనిపించినా.. మిమ్మల్ని పూర్తిగా ఎవాయిడ్ చేసేస్తారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Saturn Transit: శని సంచారంతో ఈ 2 రాశులవారికి ఇల్లు, భూమి కొనే యోగం
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు డబ్బు విషయంలో ఇతరులకు మాట ఇచ్చి ఇబ్బంది పడతారు!
Recommended image3
Weekly Horoscope: 12 రాశుల వారఫలాలు.. ఈ వారం ఏ రాశివారికి లాభం, ఎవరు జాగ్రత్తగా ఉండాలి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved