MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Forecast
Bigg Boss Agnipariksha 2
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
Donald Trump Strait of Hormuz
India Skills Report
KL Rahul Love Story
India Geographic Extent
Rocking Star Yash
Agadha Movie 4 Days Collection
Telangana Food Safety
VAS vs Makutam Box Office
Yashasvi Jaiswal
Korean Kanakaraju Collections
  • Home
  • Astrology
  • Evil eye Stone: మీకు నరదిష్టి తగలకూడదనుకుంటే ఈ రత్నం ధరించండి

Evil eye Stone: మీకు నరదిష్టి తగలకూడదనుకుంటే ఈ రత్నం ధరించండి

Evil eye Stone: నర దిష్టికి నాపరాయి కూడా పగులుతుందని అంటారు. అలాంటి నరదిష్టి నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలంటే ఫిరోజా రత్నం అద్భుతంగా పనిచేస్తుంది. దీన్ని ఎలా ధరించాలో తెలుసుకోండి. 

2 Min read
Author : Haritha Chappa
Published : Feb 03 2026, 12:48 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
నరదిష్టితో నష్టాలు
Image Credit : ChatGPT

నరదిష్టితో నష్టాలు

నరదిష్టి అంటే చెడు చూపు. ఎవరికైనా మంచి జరుగుతున్నప్పుడు, వారు ఉన్నత స్థాయికి ఎదుగుతున్నప్పుడు వారిని చెడు చూపుతో చూస్తూ దిష్టి పెడుతూ ఉంటారు. దీనివల్ల ఉద్యోగంలో ఆటంకాలు, జీవితంలో కష్టాలు, వ్యాపారంలో నష్టాలు, ఆరోగ్య సమస్యలు, జీవితంలో అశాంతి వంటివి పెరిగిపోతూ ఉంటాయి. వీటికి నరదిష్టే కారణమని చెబుతూ ఉంటారు. అలాంటి నరదిష్టి నుంచి రక్షణ కోసం జ్యోతిష శాస్త్రంలో కొన్ని రత్నాలను సూచించారు. అందులో ముఖ్యంగా చెప్పుకునేది ఫిరోజా రత్నం. ఫిరోజా రత్నం ధరించడంవల్ల చెడు శక్తులు దగ్గరకు రావు. నెగటివ్ ఎనర్జీ నుంచి కూడా రక్షణ లభిస్తుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఫిరోజా రత్నం అంటే ఏమిటి?
Image Credit : ChatGPT

ఫిరోజా రత్నం అంటే ఏమిటి?

ఫిరోజా రత్నం చూడడానికి ఆకుపచ్చ, నీలం రంగు కలిపి కనిపిస్తుంది. ఈ రత్నాన్ని రక్షణకు వేసుకుంటారు. పూర్వకాలంలో రాజులు, యోధులు కూడా దీన్ని ధరించే వారని జ్యోతిష్య గ్రంథంలో చెబుతారు. నరదిష్టి, చెడు శక్తులు, అనుకోని ప్రమాదాల నుంచి కాపాడే శక్తి దీనికి ఉందని అంటారు. ఫిరోజా రత్నం మన చుట్టూ ఒక రక్షణ వలయాన్ని ఏర్పరుస్తుంది. ప్రతికూల శక్తులు మనపై పడకుండా అడ్డుకుంటుంది. అందుకే తరచూ సమస్యల బారిన పడుతున్న వారు, కారణం తెలియకుండా ఇబ్బందులు పడుతున్న వారు ఈ రత్నాన్ని ధరిస్తే ఉత్తమమని అంటారు.

Related Articles

Related image1
Lord Shiva: ఈ 3 రాశులపై శివుని కృప.. మహాశివరాత్రి నుంచి ఆదాయం, ఆనందం రెట్టింపు
Related image2
Cheapest Alcohol: ఆ చిన్నదేశాల్లో బ్రాండెడ్ మద్యం బాటిల్ ధర రూ.50 లోపే
34
పిల్లలకు తాయెత్తు రూపంలో
Image Credit : ChatGPT

పిల్లలకు తాయెత్తు రూపంలో

జ్యోతిష శాస్త్రం చెబుతున్న ప్రకారం నరదిష్టి తగిలినప్పుడు మనసులో ఆందోళన ఎక్కువైపోతుంది. అనవసర భయాలు కలుగుతాయి. ఫిరోజా రత్నం ధరిస్తే మనసుకు ప్రశాంతత లభిస్తుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ముఖ్యంగా ఎదుగుతున్న వ్యాపారులు, ఉద్యోగంలో మంచి స్థాయికి చేరుకుంటున్న వారు, జనాల్లో అధికంగా తిరిగేవారికి నరదిష్టి తగిలే అవకాశం ఉంటుంది. అలాంటివారు ఈ రత్నాన్ని ధరించడం వల్ల చెడు చూపు చాలా వరకు తగ్గుతుంది. వీరి జీవితంలో సానుకూల శక్తి పెరుగుతుంది. అలాగే పిల్లలకు కూడా నరదిష్టి తగలకుండా ఫిరోజాను తాయెత్తు రూపంలో ధరింప చేస్తే మంచిది.

44
ఎలా ధరించాలి?
Image Credit : ChatGPT

ఎలా ధరించాలి?

ఫిరోజా రత్నాన్ని బ్రాస్లెట్ గా లేదా ఉంగరం రూపంలో, మెడలో పెండెంట్ రూపంలో వేసుకోవచ్చు. దీన్ని ధరించేటప్పుడు కొన్ని నియమాలు మాత్రం పాటించాలి. శుభసమయంలో, శుభదినంలో మాత్రమే వీటిని ధరించాలి. ధరించే ముందు ఈ రత్నాన్ని శుద్ధి చేయాలి. రత్నాన్ని పూర్తి నమ్మకంతో ధరిస్తే మంచి ఫలితాలు వస్తాయి. నరదిష్టి నుంచి రక్షణ కావాలనుకునే వారు.. ఒకసారి జ్యోతిష నిపుణులను కలిసి ఈ ఫిరోజా రత్నాన్ని ధరిస్తే అన్ని విధాలా మంచిది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జ్యోతిష్యం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Visha Yogam: శని, చంద్రుల కలయికతో విష యోగం.. ఈ 5 రాశులవారికి కష్టాలు, నష్టాలు!
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఈ మూడు రాశులవారికి విపరీతంగా కలిసివస్తుంది..!
Recommended image3
Zodiac Signs: ఈ 4 రాశుల అబ్బాయిలు భార్య మాట అస్సలు వినరు.. వారి మాటే ఫైనల్!
Related Stories
Recommended image1
Lord Shiva: ఈ 3 రాశులపై శివుని కృప.. మహాశివరాత్రి నుంచి ఆదాయం, ఆనందం రెట్టింపు
Recommended image2
Cheapest Alcohol: ఆ చిన్నదేశాల్లో బ్రాండెడ్ మద్యం బాటిల్ ధర రూ.50 లోపే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved