Vastu Tips: దీపావళి రోజున ఇంటికి ఇవి తెస్తే.. లక్ష్మీ దేవి అడుగుపెట్టినట్లే..!
Vastu Tips: మరి కొద్ది రోజుల్లో దీపావళి పండగ రాబోతోంది. దీపావళి రోజును లక్ష్మీదేవిని పూజిస్తే.. ఆమె కటాక్షం లభిస్తుందని... అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయని కూడా నమ్ముతారు. వాస్తు ప్రకారం కొన్ని పనులు చేయడం వల్ల లక్ష్మీ కటాక్షం లభిస్తుంది.

Diwali
చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ నచ్చే పండగలలో దీపావళి ముందు వరసలో ఉంటుంది. ఈ ఏడాది దీపావళి పండగను దేశ వ్యాప్తంగా ప్రజలు అక్టోబర్ 20వ తేదీన జరుపుకోనున్నారు. ఈ పండగ రోజున ఇంటిని అందంగా అలంకరించుకుంటారు. అంతేకాదు.. సాయంత్రం వేళ లక్ష్మీ దేవి, కుబేరుడిని పూజిస్తారు. లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి కేవలం ఆమెను పూజించడం మాత్రమే కాకుండా.. వాస్తు ప్రకారం కొన్ని నియమాలు పాటించాలి. దీపావళి రోజున కొన్ని వస్తువులను ఇంటికి తీసుకురావడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగుపెడుతుందని నమ్ముతారు. మరి, అవేంటో చూద్దామా...
1.తాబేలు...
వాస్తు శాస్త్రం ప్రకారం, తాబేలుకు చాలా ప్రాముఖ్యత ఉంది. తాబేలు ని విష్ణుమూర్తి చిహ్నంగా పరిగణిస్తారు. దీపావళికి ముందు.. లోహంతో తయారు చేసిన తాబేలు ను ఇంట్లోకి తెచ్చుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో పాజిటివిటీ పెరుగుతుంది. లక్ష్మీదేవి, విష్ణుమూర్తి ప్రత్యేక ఆశీస్సులు కూడా లభిస్తాయి. ఈ తెచ్చుకున్న తాబేలు ని మీ ఇంటి ఉత్తర లేదా ఈశాన్య దిశలో ఉంచడం శుభప్రదం. ఈ చిన్న మార్పు చేయడం వల్ల.. మీ ఆర్థికాభివృద్ధి పెరుగుతుంది.
కొబ్బరికాయ..
వాస్తు శాస్త్రం ప్రకారం, కొబ్బరికాయ స్వచ్ఛత, శ్రేయస్సుకు సంకేతంగా పరిగణిస్తారు. ఈ దీపావళికి ఒక రోజు ముందు మీరు ఇంటికి కొబ్బరికాయను తెచ్చుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇంటి లక్ష్మీదేవి వచ్చినట్లుగా పరిగణిస్తారు. తెచ్చిన కొబ్బరికాయను ఇంట్లో దక్షిణ లేదా పశ్చిమ దిశలో ఉంచాలి. తర్వాతి రోజు అంటే దీపావళి పండగ రోజున ఆ కొబ్బరికాయను లక్ష్మీదేవికి సమర్పించాలి. దీని వల్ల.. ఇంట్లో ఏవైనా దోషాలు ఉంటే తొలగిపోయే అవకాశం ఉంది. అంతేకాకుండా.. శుభ ఫలితాలు కూడా పొందుతారు.
తులసి మొక్క...
మీ ఇంట్లో తులసి మొక్క లేకపోతే.. ఈ సంవత్సరం దీపావళి రోజున మీ ఇంటికి తులసి మొక్కను తీసుకురావడం చాలా శుభప్రదం. తులసి మొక్క స్వచ్ఛతకు చిహ్నం. పాజిటివిటీని కూడా పెంచుతుంది. ఇంట్లో ఆనందాన్ని, ఆరోగ్యాన్ని పెంచడానికి హెల్ప్ చేస్తుంది. ఈ మొక్కను తెచ్చుకొని.. ఇంట్లో ఈశాన్య దిశలో నాటాలి. రోజూ భక్తితో పూజిస్తే... శుభ ఫలితాలను పొందుతారు.