కర్కాటక రాశి వారు ప్రేమలో పడితే ఇలానే చేస్తారు...!
ఒక వేళ ఏదైనా ఇబ్బంది కలిగితే వారు చెప్పకుండానే వీరు అర్థం చేసుకుంటారు. మీ బాధలను తీర్చడానికి ఎప్పుడూ ముందుంటారు. తాము ప్రేమించినవారిని నిత్యం సంతోషంగా ఉంచాలని చూస్తారు.

కర్కాటక రాశివారు సాధారణంగానే చాలా కూల్ గా , కామ్ గా ఉంటారు. ఈ రాశివారు ఎవరినైనా ప్రేమిస్తే వారికి జీవితంలో ఎక్కువ విలువ ఇష్తారు. అసలు ఈ రాశివారు ప్రేమలో పడితే ఎలా ప్రవర్తిస్తారో చూద్దాం.....
కర్కాటక రాశి ఎవరినైనా ప్రేమిస్తే వారి పట్ల చాలా శ్రద్ధ కలిగి ఉంటారు. తమ భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ప్రతి విషయంలోనూ వారు ప్రేమించిన వారికి చోటు కల్పిస్తారు. జీవితం విషయంలో ముఖ్యమైన నిర్ణయం తీసుకునేటప్పుడు కూడా తాము ప్రేమించిన వారి నిర్ణయం తీసుకుంటారు. నిత్యం ఒక ప్రత్యేకమైన అనుభూతి కలిగేలా చేస్తారు.
ఈ రాశివారు తాను ప్రేమించిన వారి ముందు నటించడం లాంటివి చేయరు. చాలా సహజంగా ఉంటారు. తాము ప్రేమించిన వారికి చిన్న ఇబ్బంది కూడా కలగకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఒక వేళ ఏదైనా ఇబ్బంది కలిగితే వారు చెప్పకుండానే వీరు అర్థం చేసుకుంటారు. మీ బాధలను తీర్చడానికి ఎప్పుడూ ముందుంటారు. తాము ప్రేమించినవారిని నిత్యం సంతోషంగా ఉంచాలని చూస్తారు.
ఇక కర్కాటక రాశివారు తాము ఏవిధంగా ప్రేమించిన వారికి శ్రద్ధ ఇస్తున్నారో... వారు కూడా తమకు అలానే ఇవ్వాలని కోరుకుంటారు. ఈ రాశివారు కాస్త రొమాంటిక్ కూడా. తమ భాగస్వామితో రొమాంటిక్ గా ఉండటాన్ని ఇష్టపడతారు. తమ పార్ట్ నర్ కూడా రొమాంటిక్ గా ఉండాలని కోరుకుంటారు.
ఈ రాశివారు ఒకరితో రిలేషన్ లో ఉన్నప్పుడు మరోకరితో చనువుగా ఉండటం లాంటివి కూడా చేయరు. తమ జీవితభాగస్వామికి మాత్రమే కట్టుబడి ఉంటారు. తమ పార్ట్ నర్ అసూయ పడేలా కూడా చేయరు. కలలో కూడా పరాయి స్త్రీ గురించి ఈ రాశి అబ్బాయిలు ఆలోచించరు. కేవలం తమ జీవిత భాగస్వామికే కట్టుబడి ఉంటారు.