రాత్రిపూట దిండు కింద వీటిని పెట్టుకొని పడుకుంటే ఏమౌతుందో తెలుసా?
మసాలా దినుసులను దిండు కింద పెట్టుకొని నిద్రపోవడం వల్ల.. మన కోరికలన్నీ తీరతాయి అంటే మీరు నమ్ముతారా..? ఏ వస్తువు పెట్టుకుంటే.. ఎలాంటి కోరికలు నిజం అవుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..
జీవితంలో ప్రతి ఒక్కరికీ కొన్ని కోరికలు,కలలు ఉంటాయి. వాటిని సాధించడానికి చాలా కష్టపడుతూ ఉంటాం. కానీ కొన్నిసార్లు మనం ఎంత ప్రయత్నించినా.. కోరుకున్న వాటిని నిజం చేసుకోలేం. కానీ.. మన కిచెన్ లో దొరికే కొన్ని వస్తువులు మన కోరికలు నిజం చేస్తాయని మీకు తెలుసా..? నమ్మసక్యంగా లేకపోయినా ఇది నిజం. మసాలా దినుసులను దిండు కింద పెట్టుకొని నిద్రపోవడం వల్ల.. మన కోరికలన్నీ తీరతాయి అంటే మీరు నమ్ముతారా..? ఏ వస్తువు పెట్టుకుంటే.. ఎలాంటి కోరికలు నిజం అవుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..
1.యాలకులు..
యాలకులు మన వంటకు కమ్మని రుచి, వాసనను అందిస్తుంది. ఇదే యాలకులు.. జోతిష్యపరంగా మ్యాజికల్ ప్రాపర్టీలు కలిగి ఉంటాయి. అందుకే.. వీటిని కనుక మనం రాత్రిపూట పడుకునే ముందు... దిండు కింద పెట్టుకొని పడుకుంటే... డబ్బు సమస్యలు తీరతాయి. ఇవి.. డబ్బును బాగా ఆకర్షిస్తాయి. ఆర్థిక సమస్యలు తీరి.. ఇంటికి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది.
2.దాల్చిన చెక్క..
దాల్చిన చెక్క కూడా జోతిష్యశాస్త్రం ప్రకారం చాలా ఉపయోగాలను తీసుకువస్తుంది. ఈ దాల్చిన చెక్క చిన్న ముక్కను రోజూ రాత్రి పడుకునే ముందు దిండు కింద పెట్టుకొని పడుకోండి. ఇలా చేయడం వల్ల జీవితంలో కోరుకున్న శ్రేయస్సు లభిస్తుంది. సుఖ, సంతోషాలు లభిస్తాయి.
3.లవంగాలు..
లవంగాలను మనం చాలా రకాల వంటల్లో ఉపయోగిస్తాం. దీని వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఇదే.. లవంగాలు.. జోతిష్యశాస్త్రం ప్రకారం మనకు చాలా ప్రయోజనాలను అందిస్తాయి. ఎవరైనా తమ చుట్టూ లేదంటే... తమ ఇంట్లో నెగిటివిటీ ఎక్కువగా ఉందని ఫీలైతే రెండు లేదంటే మూడు లవంగాలు పెట్టుకుంటే సరిపోతుంది. నెగిటివిటీ మొత్తం దూరమైపోతుంది. మీపై ఎలాంటి చెదు దృష్టి ఉన్నా పోతుంది.
4.పసుపు..
ఎవరైనా సరే తమ జీవితంలో ప్రేమ, పెళ్లి విషయంలో సమస్యలు ఎదుర్కొంటున్నట్లయితే.. వారు దిండు కింద.. పసుపు పెట్టుకుంటే సరిపోతుంది. ఒక చిన్న క్లాత్ లో.. కొద్దిగా పసుపు వేసి దానిని ముడి వేసి దిండు కింద పెట్టుకొని నిద్రపోవాలి. ఇలా చేయడం వల్ల.. మీ ప్రేమ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తీరిపోతాయి.
5.నట్ మగ్..
నట్ మగ్ కూడా.. చాలా మందికి ఇంట్లో ఉంటుంది. దీనిని దిండు కింద పెట్టుకొని పడుకోవడం వల్ల... జీవితంలో ఉన్న చాలా సమస్యలన్నీ తీరిపోతాయి. మీకు రావాల్సిన డబ్బు ఎక్కడైనా ఆగిపోతే.. ఈ నట్ మగ్ సహాయం చేస్తుంది. మీకు రావాల్సిన డబ్బు మీకు వచ్చి చేరుతుంది.
6.స్టార్ ఫ్లవర్..
బిర్యానీలో మనం కచ్చితంగా చేర్చేది ఈ స్టార్ ప్లవర్. ఇది మనకు అదృష్టాన్ని తీసుకువస్తుంది. కేవలం.. మీరు దీనిని దిండు కింద పెట్టుకొని పడుకుంటే సరిపోతుంది. ఎలాంటి సమస్యలు ఉన్నా తీరిపోయి.. అదృష్టం మీ తలుపు తడుతుంది. మంచి నిద్ర కూడా వస్తుంది.
మీ కోరికను పట్టి.. మీ మసాలా దినుసులను ఎంచుకోవాలి. ఎక్కువ సమస్యలు ఉంటే.. వాటినికి సంబంధించిన అన్ని మసాలాలను ఒక క్లాత్ లో పెట్టి... దిండు కింద కనీసం 21 రోజులు పెట్టుకోవాలి. మీ కోరిక తీరిన తర్వాత.... 21 రోజుల తర్వాత.. దానిని రీప్లేస్ చేస్తే సరిపోతుంది.