Zodiac sign:మేష రాశివారు ప్రేమలో ఉన్నారనడానికి సంకేతాలు ఇవి...!
ఒక్కసారి ప్రేమను తెలియజేస్తే మాత్రం... చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. చిన్న బాధ కూడా కలిగించరు. చాలా మనోహరంగా, మురిపంగా చూసుకుంటారు.

జీవితంలో ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఒకసారి ప్రేమలో పడతారు. అయితే.. ఆ ప్రేమను ఒక్కొక్కరు ఒక్కోలా వ్యక్తపరుస్తూ ఉంటారు. కొందరు పువ్వులు, బహుమతులు ఇచ్చి... తమ ప్రేమను తెలియజేస్తూ ఉంటారు. మరి ఒకవేళ మేష రాశివారు ప్రేమలో పడితే... ఆ విషయాన్ని ఎలా తెలియజేస్తారనేది ఓసారి చూద్దాం...
Aries Traits
జ్యోతిష్యం, సంఖ్యాశాస్త్రం, ప్రకారం... మేషరాశి వ్యక్తి ప్రేమలో పడ్డట్లయితే, అతను ప్రేమిస్తున్నాడని... డైరెక్ట్ గా చెప్పరు. కానీ... ఇన్ డైరెక్ట్ గా ప్రేమను తెలియజేస్తారు. ఒక్కసారి ప్రేమను తెలియజేస్తే మాత్రం... చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. చిన్న బాధ కూడా కలిగించరు. చాలా మనోహరంగా, మురిపంగా చూసుకుంటారు.
Aries Zodiac
మేష రాశివారు ఎవరినైనా ప్రేమిస్తే.. వారిని బాధ పెట్టాలని అస్సలు అనుకోరు. వారు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని అనుకుంటారు. కనీసం వారికి ఎదురు కూడా ఒక్క మాట చెప్పరు. వారు ఏది చెప్పినా.. చిరు నవ్వుతో చేస్తారు. వారు ప్రేమించిన వారి ముఖంపై చిరు నవ్వు చెరగకుండా ఉండేలా చూసుకుంటారు.
Aries
ఏ మహిళ అయినా.. తమ జీవితంలోకి వచ్చిన అబ్బాయి తమకు అన్ని విషయాల్లో ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకుంటూ ఉంటారు. అయితే.. ఆ ప్రాధాన్యత మేష రాశి అబ్బాయిల దగ్గర లభిస్తుంది. మేష రాశి అబ్బాయిలు.. తమ జీవితంలోకి వచ్చే అమ్మాయికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అంతేకాదు.. ఆవేశంగా మాట్లాడటం, ఎదురించడం లాంటివి చేయరు. చాలా సున్నితంగా కూడా మాట్లాడతారు.
aries
ఇక ఈ రాశి అబ్బాయిలు.. తాము ప్రేమించిన అమ్మాయికి చాలా రక్షణగా ఉంటారు. వారి అన్ని బాధ్యతలు తీసుకోవడానికి వీరు ఇష్టపడతారు. తాము ప్రేమించిన అమ్మాయిని రక్షించుకోవాలని ఎప్పుడూ అనుకుంటూ ఉంటారు. వారికి ఎలాంటి చెడు జరగకుండా ఉండేలా వీరు జాగ్రత్తపడతారు.
Aries
తాము ప్రేమించిన అమ్మాయిని చాలా విలాసవంతంగా ఉండేలా చూసుకుంటారు. వారికి అన్నీ అడకముందే తెచ్చి పెడుతూ ఉంటారు. అయితే.. ఏది చేసినా ప్రేమతోనే చేస్తారు. అంతేకాదు... ఈ రాశి అబ్బాయిలు.. తాము ప్రేమించిన అమ్మాయి అభిప్రాయానికి ఎక్కువ విలువ ఇస్తారు. వారి జీవితంలో ప్రతి ముఖ్యమైన దాని కోసం అభిప్రాయాన్ని వారు అడుగుతారు.