Diwali: దీపావళికి ఈ రాశుల వారికి ధనరాజయోగం, వందేళ్లకు ఒకసారి వచ్చే యోగం
దీపావళి (Diwali) నుంచి కొన్ని రాశుల వారికి విపరీతంగా కలిసి వస్తుంది. ఆ రోజున శని దేవుడు ధన రాజయోగాన్ని ఏర్పరుస్తున్నాడు. ఈ యోగం వల్ల కొన్ని రాశుల వారికి ఆర్థికంగా కలిసివస్తుంది. వారు పట్టిందల్లా బంగారంలా మారుతుంది.

దీపావళికి రాజయోగం
శనిదేవుడు న్యాయదేవత. మనం చేసిన కర్మలకు తగిన ఫలాలను అందిస్తుంది. ప్రస్తుతం శని దేవుడు మీనరాశిలో వక్ర స్థితిలో ప్రయాణిస్తున్నాడు. 2027వరకు శని దేవుడు మీనరాశిలోనే ఉండబోతున్నాడు. ఈ సమయంలో ఆయన ఇతర గ్రహాలతో కొన్ని సంయోగం చెందాల్సి వస్తుంది. ఆ సమయంలో ప్రత్యేక యోగాలు ఏర్పడతాయి. అలా ఈసారి దీపావళి పండుగకు అరుదైన యోగం ఏర్పడుతుంది. 100 ఏళ్ల తర్వాత దీపావళి రోజున శని దేవుడు ఏర్పరిచే ధన రాజయోగం' కొన్ని రాశుల వారికి విపరీతంగా డబ్బును అందిస్తుంది.
వృషభ రాశి
దీపావళి రోజు శనిదేవుడి వల్ల ఏర్పడే ధనయోగం వృషభ రాశి వారికి ఎన్నో మంచి ఫలితాలను అందిస్తుంది. ఈ రాశి వారికి శనిదేవుడు లాభ స్థానంలో ఉంటాడు. దీని వల్ల ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. వ్యాపారంలో మీ శత్రువులపై మీకు విజయం దక్కుతుంది. సమాజంలో మీ గౌరవం, విలువ పెరుగుతాయి. పాత పెట్టుబడుల నుంచి విపరీతమైన లాభాలు వస్తాయి. బంగారం, భూమి కొనే అవకాశాలు ఉన్నాయి.
మకర రాశి
ధన రాజయోగం వల్ల మకర రాశి వారికి మంచి ఫలితాలు రాబోతున్నాయి. మంచి ఫలితాలు అందుకోబోతున్నారు. ఈ రాశి వారికి శని మూడో ఇంట్లో సంచరించబోతున్నాడు. మూడవ ఇల్లు అనేది0 కమ్యూనికేషన్, తోబుట్టువులు వంటివి సూచిస్తుంది. ఉద్యోగం, వ్యాపారం విషయంలో మీరు చాలా తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు. మీ జీవితంలో పురోగతి కూడా లభిస్తుంది. కొత్త ఆస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంది.
మిథున రాశి
ధన రాజయోగం అనేది మిథున రాశి వారికి అధిక సానుకూల ఫలితాలను అందిస్తుంది. శని దేవుడు మీ రాశి నుంచి కర్మస్థానంలోకి ప్రవేశించబోతున్నాడు. దీని వల్ల మీకు విజయం దక్కుతుంది. కొత్తగా వ్యాపారం ప్రారంభించేందుకు ఇది మంచి సమయం. నిరుద్యోగులకు ఉద్యోగం దక్కే అవకాశం ఉంది. నలుగురికి ఉద్యోగాలిచ్చే స్థాయికి మీరు చేరుకుంటారు. తండ్రి వైపు నుంచి మీకు అనుబంధం పెరుగుతుంది.